విద్యుత్తు మంత్రిత్వ శాఖ

రాయ్‌బరేలీ జిల్లా యంత్రాంగానికి ఎన్‌టీపీసీ ఉన్‌చహార్‌ ఆక్సిజన్ ప్లాంటు అప్పగింత

प्रविष्टि तिथि: 31 MAY 2021 3:35PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే మహారత్న హోదా సంస్థ ఎన్‌టీసీసీ, కొవిడ్‌పై పోరాటంలో తాను అందిస్తున్న మద్దతుకు కొనసాగింపుగా, ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలీలోని ఉన్‌చహార్‌ ఎన్‌టీపీసీ విభాగం ద్వారా ఒక ఆక్సిజన్‌ ప్లాంటును నిర్మించింది. రాయ్‌బరేలీ జిల్లా యంత్రాంగానికి ఆ ప్లాంటును అప్పగించింది. ప్లాంట్‌ను సాఫీగా నడిపేందుకు అవసరమైన పరికరాలు, వనరులను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాంటు ఏర్పాటుతో, ఆక్సిజన్‌ అవసరమైన వారికి తక్షణం, నిరంతరం ప్రాణవాయువు అందుతుంది.

    ఇంతకుముందు, ఉన్‌చహార్‌ సామాజిక ఆరోగ్య కేంద్రానికి 10 ఆక్సిజన్‌ సిలిండర్లను ఎన్‌టీపీసీ అందించింది. ఎన్‌టీపీసీ ఉన్‌చహార్‌ చూపిన చొరవ, గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా మెరుగైన ఆరోగ్య సేవలు పొందే ఆశాకిరణంలా మారింది.
 

***


(रिलीज़ आईडी: 1723137) आगंतुक पटल : 198
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Tamil