కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఈపిఎఫ్ఓ తన సభ్యులలకు రెండవ విడత కోవిడ్-19 అడ్వాన్స్ పొందటానికి అనుమతిచ్చింది
కోవిడ్ 19 మహమ్మారి రెండవ వేవ్ దృష్ట్యా తీసుకున్న నిర్ణయమిది
Posted On:
31 MAY 2021 2:03PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి రెండవ వేవ్ లో తన ఖాతాదారులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఈపిఎఫ్ఓ ఇప్పుడు దాని సభ్యులకు తిరిగి చెల్లించనవసరం లేని రెండవ కోవిడ్-19 అడ్వాన్స్ పొందటానికి అనుమతించింది. మహమ్మారి సమయంలో సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేక ఉపసంహరణను 2020 మార్చిలో ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ యోజన (పిఎంజికెవై) కింద ప్రవేశపెట్టారు. అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ద్వారా పేరా 68 ఎల్ కింద ఉప-పారా (3) ను చేర్చడం ద్వారా కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్స్ పథకం 1952 లో ఈ సవరణ చేశారు.
ఈ నిబంధన ప్రకారం, మూడు నెలల పాటు ప్రాథమిక వేతనాలు, కరువు భత్యం తిరిగి చెల్లించనవసరం లేని విధంగా తీసుకోవొచ్చు లేదా ఇపిఎఫ్ ఖాతాలో సభ్యుల క్రెడిట్‌కు 75% వరకు, ఏది తక్కువైతే అది పొందవచ్చు. సభ్యులు తక్కువ మొత్తానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
మహమ్మారి సమయంలో కోవిడ్ -19 అడ్వాన్స్ ఇపిఎఫ్ సభ్యులకు గొప్ప సహాయంగా ఉంది, ముఖ్యంగా నెలవారీ వేతనాలు రూ. 15,000 ఉన్నవారికి ఉపయోగంగా ఉంది. ఇప్పటి వరకు ఈపిఎఫ్ఓ 76.31 లక్షలకు పైగా కోవిడ్-19 అడ్వాన్స్ క్లెయిమ్‌లను పరిష్కరించింది. తద్వారా మొత్తం రూ. 18,698.15 కోట్లు చెల్లించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో సభ్యులకు అకస్మాత్తుగా అవసరం వచ్చినపుడు కోవిడ్-19 క్లెయిమ్ లకు అధిక ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు. ఈ క్లెయిమ్ లు అందిన వెంటనే మూడురోజుల్లోపు పరిష్కరించడానికి ఈపిఎఫ్ఓ కట్టుబడి ఉంది. ఈపిఎఫ్ఓ అటువంటి సభ్యులందరికీ సంబంధించి ఆటో-క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్‌ను ఏర్పాటు చేసింది. దీని కేవైసి అవసరాలు అన్ని విధాలుగా పూర్తయ్యాయి. ఇంతకు ముందు క్లెయిమ్‌ల పరిష్కరించడానికి చట్టబద్ధమైన కాలపరిమితి 20 రోజులు ఉన్న విధానాన్ని ప్రస్తుత ఆటో-మోడ్ ఆఫ్ సెటిల్మెంట్ కేవలం 3 రోజులకె పరిష్కరిస్తుంది.
*****
(Release ID: 1723131)
Visitor Counter : 303
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam