శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 పై పోరులో కీలక పాత్ర పోషిస్తున్న టిడిబి మద్దతు గల సైన్స్ ఆధారిత స్టార్టప్‌లు
Posted On:
29 MAY 2021 12:47PM by PIB Hyderabad
కోవిడ్ -19 ను ఎదుర్కొనేందుకు ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడంతోపాటు ఈ మహమ్మారిపై పోరాటంలో దేశానికి సహాయపడటంలో సైన్సు ఆధారిత స్టార్టప్‌లు కీలక పాత్రపోషిస్తున్నాయి.
పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు , ఎంటర్‌ప్రెన్యుయర్లు కోవిడ్ పై పోరాటంలో తమ శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి అన్ని విధాలుగా కృషి చేస్తున్న దశలో పలు సైన్స్ ఆధారిత స్టార్టప్‌లు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నాయ. అలాగే కొన్ని ప్రస్తుత టెక్నాలజీలో మార్పులు తెచ్చి ప్రస్తుత పరిస్థితులకు ఉపయోగపడేట్టు చేస్తున్నాయి. ఇవి తమ కార్యకలాపాలను ముమ్మరం చేయడంతోపాటు ప్రభుత్వ మద్దతుతో వాటిని వాణిజ్యపరంగా కూడా అందుబాటులోకి తెస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, వనరులను పిపిఇ కిట్లు, మాస్కులు, పరీక్షలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ప్రస్తుత వాక్సిన్ పరిశోధనలకు ప్రస్తుత మహమ్మారి సమయంలో ఎంతో జాగ్రత్తగా వినియోగించడం జరుగుతోంది.
డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన చట్టబద్ధమైన సంస్థ అయిన టెక్నాలజీ డవలప్ మెంట్ బోర్డు (టిడిబి) పలు స్టార్టప్‌లు తమ ఉత్పత్తులు వాణిజ్యపరంగా ముందుకు తీసుకువెళ్లడానికి సహాయపడింది. ఉదారణకు టెస్టింగ్ కిట్‌లు, మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్కానరర్లు, మెడికల్ పరికరాల తయారీ ద్వారా భారత్ కోవిడ్ -19 పోరాటానికి సహాయపడింది.
ఆర్థిక సహాయం అందించడానికి , కోవిడ్ 19 మహమ్మారిపై పోరాటానికి సంబంధించి ఆయా కంపెనీల నుంచి ప్రత్యేకంగా పరిష్కారాలను ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానానికి మంచి స్పందన వచ్చింది. పలు స్టార్టప్ కంపెనీలు తమ వినూత్న పరిష్కారాలతో ముందుకు వచ్చాయి. ఇది వివిధ రకాల సాంకేతికతలు వాణిజ్యపరంగా వెలువడడానికి ఉపయోగపడింది. అలాగే సైన్స్ ఆధారిత చిన్న స్టార్టప్‌లు కోవిడ్ మహమ్మారిపై పోరాటానికి వినూత్న పరిష్కారాలతో ముందుకు వచ్చాయి.
పూణే కి చెందిన మైలాబ్ డిస్కవరీ దేశీయంగా మొట్టమొదట రియల్ టైమ్ పిసిఆర్ ఆధారిత మొబైల్ డయాగ్నస్టిక్ కిట్ ను తయారు చేసింది. ఇది ఫ్లూ తరహా లక్షణాఉ ఉన్న వారి నమూనాలను పరీక్షించి నిర్ధారిస్తుంద. ఈ కిట్‌ను ఐసిఎంఆర్, సిడిఎస్‌సిఓలు అభవృద్ధి చేసి ఆమోదించాయి. టిడిబి మద్దతుతో అతి తక్కువ సమయంలో ఈ కిట్‌ల ఉత్పత్తిని రోజుకు 30000 టెస్టులనుంచి 2 లక్షల టెస్టుల వరకు పెంచారు.
దీనికి తోడు, ఈ కంపెనీ అత్యంత సెన్సిటివ్ యంటిజెన్ కిట్‌ను అభివృద్ధి చేసింది. ఇది 2 కోట్ల మంది భారతీయులకు చేరింది. ఆర్.టి.-పిసిఆర్ పరీక్షలు, కాంపాక్ట్ ఎక్స్.ఎల్, ఆటోమేట్ ఆర్‌టి-పిసిఆర్ టెస్టింగ్ అందుబాటులో లేని మారుమూల ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెచ్చి కాలహరణ సమస్యను పరిష్కరించి, లక్షలాది మంది భారతీయులకు దోషరహితమైన ఫలితాలు అందించడంలో ఇది తోడ్పడింది.
కంపెనీ ప్రత్యేక ల్యాబ్‌లను రూపొందించింది. వీటిని మహారాష్ట్ర , గోవా, ఇంకా దేశంలోని ఇతర మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్లింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో మొబైల్ ఆర్‌టి-పిసిఆర్ ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేసింది.
మై ల్యాబ్ ఇటీవల కోవిసెల్ఫ్ పేరుతో హోమ్ టెస్టింగ్ కిట్‌ను కూడా తయారు చేసింది. ఇండియాలో తొలి స్వీయ పరీక్షా కిట్ ఇది. దీనిని వాణిజ్య పరంగా అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుత మహమ్మార దశలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కోవిడ్ -19 పరీక్షలకు సంబంధించి కీలకంగా వ్యవహరించనుంది.
వినూత్న ఆవిష్కరణల నుంచి, ఆ ఆవిష్కరణల వినియోగం వరకు సైన్స్ టెక్నాలజీ నిరంతర ప్రక్రియను రూపొందించగలిగితే అంతకంటే చెప్పుకోదగినది వేరొకటి ఉండదు. అలాగే పరిశోధన, అభివృద్ధి నుంచి ఆవిష్కరణలు అక్కడ నుంచి వినూత్న సామాజిక ఆర్ధిక అవకాశాల కల్పన ఎంతో ముఖ్యమైనవి. భారతీయ సాంకేతిక ఉత్పత్తులు వాణిజ్య పరంగా అందుబాటులోకి రావడానికి సంబంధించిన కథనాలు గమనించినపుడు టిడిబి , విజ్ఞానాన్ని , వినూత్న అవకాశాలుగా మలచడంలో వాటికి సకాలంలో మద్దతు నివ్వడంలో ముందుందని చెప్పుకోవచ్చునని డిఎస్‌టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ తెలిపారు.
.
ఢిల్లీకి చెందిన నానో క్లీన్ గ్లోబల్ అనే కంపెనీ సెమీ ఆటోమేటిక్ ఎన్-95 మాస్క్ ఉత్పత్తి యంత్రాన్ని అసెంబుల్ చేసింది. దీనితో ఎన్-95 మాస్కుల వాణిజ్య ఉత్పత్తి చేసింది. ఈ కంపెనీ ఢిల్లీ పోలీసులకు లక్ష ఎన్ -95 మాస్కులను అందించింది. అలాగే మూడు లక్షలకుపైగా ఎన్.95 మాస్కులను తయారు చేసి కోవిడ్ 19 పై పోరాటంలో దేశానికి అండగా నిలిచింది.
పూణే కి చెందిన థినెర్ టెక్నాలజీస్ ఇండియా తక్కువ ఖరీదు కు యాంటీ వైరల్ ఏజెంట్ పూత కలిగిన సమర్ధమైన మాస్కులను అభివృద్ధి చేసింది. ఇది కోవిడ్ 19 వ్యాప్తి నిరోధానికి, ప్రజలకు వైరస్‌లనుంచి రక్షణకు ఉపకరిస్తుంది. కోవిడ్ -19 నుంచి ముందస్తు రక్షణ కింద యాంటీ వైరల్ ఏజెంట్‌ల కోటింగ్, 3 డి ప్రింటింగ్ ఇందులో ఉంది. ఈ సంస్థ తమ మాస్కు ఉత్పత్తులను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసింది. వీరు 6 వేల యాంటీ వైరల్ కోటెడ్ మాస్క్‌లను దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థలకు అందజేశారు.
బెంగళూరుకు చెందిన ఎవోబి ఆటోమేషన్, రెండు వేరువేరు నమూనాలలో అల్ట్రావైలెట్ శాని,టైజర్లను తయారు చేసింది. ఇందులో ఒకటి పోర్టబుల్ మోడల్ .దీనిని ముంబాయి ,పూణె, దేశంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేశారు. ఈ సంస్థ 500 యువి శానటైజరర్ బాక్స్ లు అమ్మింది. వివిధ సంస్థల నుంచి ఈ సంస్థ మరిన్ని ఆర్డర్లు అందుకుంటున్నది.
డిజిటల్ ఇమేజింగ్, బ్యాటరీ బ్యాటరీ బ్యాకప్ కలిగిన పోర్టబుల్ ఎక్స్ రే మిషన్ ను కోయంబత్తూరు చెందిన అయటోమ్ ఎలక్ట్రిక్ ఇండియా తయారు చేఇంది. ఇది ఐసొలేషన్ వార్డులలోని వారికి , ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కోవిడ్ చికిత్సా కేంద్రాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇది పరిమిత విద్యుత్ లేదా విద్యుత్ లేకుండా కూడా మారుమూల ప్రాంతాలలో ఎక్స్‌రే ఇమేజింగ్ సదుపాయాన్ని ఇది కలిగిస్తుంది. ఆస్పత్రి సెట్టింగ్‌లో డిజిటల్ చెస్ట్ ఎక్స్‌రె యంత్రం తొలి వర్షెన్‌ను కూడా ప్రయోగాత్మకంగా ఆస్పత్రులలో ఇది ఏర్పాటు చేసింది.
పూణేకి చెందిన బ్రియోటా టెక్నాలజీస్ తక్కువ ఖర్చుకాగల చేతిలో ఇమిడే డిజిటల్ స్పైరోమీటర్ స్పైరో ప్రోను అభివృద్ధి చేసింది. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ను , దాని వల్ల ఊపిరితిత్తులపై పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి ఇది ఉపకరిస్తుంది. ఈ ప్రాడక్ట్ మోబైల్ యాప్ నేహా (నర్స్ ఎడ్యుకేటర్ , హెల్త్ అసిస్టెంట్ ద్వారా వస్తుంది. దీన ద్వారా ఊపిరితిత్తుల పరిస్థితి అంచనా వేయడానికి దానిని గమనించడానికి వెంటిలేటర్ వ్యవస్థ మద్దతుకు టెలిమెడిసిన్, టెలి కౌన్సిలింగ్ సదుపాయానికి ఉపకరిస్తుంది.
ఏజిస్ గ్రాహమ్ బెల్ అవార్డు 11 వ ఎడిషన్ టాప్ ఫైనలిస్టులలో ఉన్న కంపెనీ సేవ్ పేరుతో ప్రశ్నలు సమాధానాల పద్ధతిలో ఒక యాప్‌ను అభివృద్ధి చేసింది. వినూత్న డయాగ్నస్టిక్ సొల్యూషన్లకు సంబంధించిన అవార్డు ఇది. దీనిని ముంబాయ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసిజిఎం), కొన్ని ప్రైవేటు సంస్థలకు అందుబాటులోకి తేవడం జరిగింది. దీనివల్ల పేద ప్రజలలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి వీలు కలుగుతుంది ఈ యాప్ స్కోర్ ఆధారంంగా 100 మంది కి పైగా ప్రజలు ఎసిజిఎం, ఇతర ఆస్పత్రుల నుంచి అత్యవసర వైద్య సేవలు పొందగలిగారు. మీడియం కోవిడ్ లక్షణాలు కనిపించినవారిని వీడియో కాన్ఫరెన్సుద్వారా డాక్టర్ల సేవలు అందేట్టు చూడడం జరిగింది.
బెంగళూరుకు చెందిన కోకోస్లాబ్స్ ఇన్నొవేటివ్ సొల్యూషన్స్ అత్యంత ఖచ్చితత్వం తోకూడిన థర్మల్ అనలటిక్స్ ప్రాడక్ట్‌ను రూపొందించింది. ఇది శరీర ఉష్ణోగ్రతను గుర్తిస్తుంది. అలాగే ఫేస్ మాస్క్, సామాజిక దూరం పాటిస్తున్నారా లేదా గమనిస్తుంది. ఇండియాలో థర్మల్ అనలటిక్స్ సొల్యూషన్స్‌ను విడుదల చేసిన తొలి కంపెనీ ఇది. జనసమూహంలో ఆటొమేటిక్ టెంపరేచర్ గుర్తింపు చేపడుతుంది. దీనింతో వేచిఉండే సమయం, కోవిడ్ లక్షణాలు కలిగిన సమూహంలో తిరిగే పరిస్థితులనుంచి తప్పిస్తుందిఇ. ఒక్క రోజులో ఒక్క యూనిట్ ఇది పదివేల మందిని పరీక్షిస్తుంది. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్టాండ్లు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేయడానికి పనికివస్తుంంది. మాస్కు ధరించని వారు లేదా మాస్కు సరిగా ధరించని వారిని కూడా ఇది గుర్తిస్తుంది.
టిడిబి నుంచి మద్దతు లభించడంతో కంపెనీ నిధులను ఇతర కొత్త పరిష్కారాలను కనుగొనడానికి ఉపయోగించడానికి వీలు కలిగింది. ముఖాన్ని గుర్తుపట్టి అటెండెన్స్ తీసుకునే, థర్మల్ అనలిటిక్స్‌కూడా ఈ కంపెనీకి ఉంది. ఇది ఇతర కంపెనీలతో కలసి పనిచేస్తుంది. కోవిడ్ అనంతర కాలంలో తిరిగి కార్యాలయాలు తెరిచినపుడు కోవిడ్ ప్రొటోకాల్స్ ను దీనిని ఉపయోగించి పాటించడానికి అవకాశం కలుగుతుంది. ఆస్పత్రులకు కృత్రిమ మేధకు సంబంధించిన సెన్సర్ ద్వారా ఆక్సిజన్ టాంకర్లలో ఆక్సిజన్ స్థాయిలను గుర్తించి సిబ్బందిని ముందుగానే అప్రమత్తం చేస్తుంది. దీనివల్ల ఆక్సిజన్‌ను సకాలంలో తెప్పించి సిద్దం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇందుకు సంబంధించిన రియల్ టైమ్ సమాచారం అందుబాటులో ఉండేలా చేస్తుంంది. ఇది సంక్లిష్ట సమయాలలో తగినంత సరఫరాలు ఉండేలా చూస్తుంది.
***
(Release ID: 1722974)
Visitor Counter : 246