ఉక్కు మంత్రిత్వ శాఖ
విశాఖపట్నంలో ఆర్ .ఐ.ఎన్.ఎల్ జుంబో కోవిడ్ కేర్ ఫెసిలిటీని జాతికి అంకితం చేసిన శ్రీ ధర్మేంద్రప్రధాన్.
సహకార ఫెడరలిజానికి ఇది గుర్తుగా నిలుస్తుందన్న శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
30 MAY 2021 12:16PM by PIB Hyderabad
విశాఖపట్నం ఆర్.ఐ.ఎన్.ఎల్ స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్‌లో , ఆక్సిజన్ సరఫరా సదుపాయం కలిగిన 300 పడకల జుంబో కోవిడ్ కేర్ కేంద్రాన్ని కేంద్ర పెట్రోలు, సహజవాయు , స్టీలు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన వర్చువల్ సమావేశంలో ఉక్కు శాఖ సహాయమంత్రి శ్రీ ఫగన్ సింగ్ కులస్తే, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఎ. కాళీకృష్ణ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ పరిశ్రలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ ఎం. గౌతమ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పంచాయతి రాజ్ , గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి శ్రీ పి.రామచంద్రారెడ్డి, పార్లమెంటు సభ్యులు, ఎం.ఎల్.ఎలు , భారత ప్రభుత్వ ఉక్కు శాఖ కార్యదర్శి, భారత ప్రభుత్వ అధికారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు, ఆర్ ఐ ఎన్.ఎల్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
ఆర్ ఐఎన్ ఎల్‌వద్ద కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు, సహకార ఫెడరలిజానికి గొప్ప ఉదాహరణ అని శ్రీ ప్ర ధాన్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమం, వారి బాగోగులు ప్రభుత్వం బాధ్యత అన్నారు. ఇందుకు రాష్ట్రప్రభుత్వం , జిల్లా పాలనా యంత్రాంగం మద్దతునిచ్చిందని, దీనితో ప్రధానమంత్రి దార్శనికత అయిన జహన్ బీమార్, వహిన్ ఉపచార్ అన్నది సత్వరం పి.ఎస్.యు అమలు చేయడానికి వీలైందన్నారు. ప్రధానమంత్రి పిలుపుమేరకు మేం స్టీలు ప్లాంట్లకు దగ్గరలోనే ఆక్సిజన్ సరఫరాతో కూడన జుంబో కేర్ సెంటర్ల ఏర్పాటుకు స్టీలు కంపెనీలను సన్నద్ధం చేశాం అని ఆయన అన్నారు.
మనం కోవిడ్ రెండోవేవ్ మధ్యలో ఉన్నామని శ్రీ ప్రధాన్ అన్నారు. చాలావరకు మనం ఆక్సిజన్ ,రెమిడిసివర్, ఇతర మందుల అందుబాటుకు సంబంధించిన సవాలు నుంచి బయటపడ్డాం. ఇప్పుడు మరోసవాలు మనదేశంలో భారీ సంఖ్యలోని ప్రజలకు వాక్సిన్ వేయడం. మన దేశీయ ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తి సామర్ధ్యాన్ని భారీగా పెంచుతున్నారు. అంతర్జాతీయ వాక్సిన్ ఉత్పత్తిదారులతో చర్చలు కొనసాగుతున్నాయి. జూన్ తర్వాతి నుంచి వాక్సిన్ సరఫరా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఆర్ఐఎన్ఎల్ చుట్టుపక్కల ప్రజలకు వాక్సిన్ వేసేందుకు రాష్ట్రప్రభుత్వం సహకారంతో మరింత వాక్సిన్‌ను కొనుగోలు చేయాల్సిందిగా ఆర్ ఐ ఎన్ ఎల్‌ను కోరుతున్నాను అని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు
కోవిడ్ మహమ్మారి సమయంలో స్టీలు ఉత్పత్తి ప్లాంట్లు ప్రజలకు అండగా ఉన్నందుకు కేంద్ర మంత్రి , స్టీలు ప్లాంట్లను అభినందించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు ద్రవరూప ఆక్సిజన్ ను అందించేందుకు దేశ ప్రజలకు అండగా విధినిర్వహణలో ఆర్.ఐ.ఎన్.ఎల్ కూడా విశేష కృషి చేసిందని ఆయన కొనియాడారు. ఆర్.ఐ.ఎన్.ఎల్ నుంచి తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 23న 100 టన్నుల ఎల్.ఎం.ఓతో మహారాష్ట్రకు చేరుకున్నదని ఆయన అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆర్.ఐ.ఎన్.ఎల్ 6,500 టన్నుల ఎల్.ఎం.ఓను సరఫరా చేసిందని, మొత్తంగా 15,000 మెట్రిక్ టన్నుల ఎల్.ఎం.ఓను ఆర్ ఐఎన్ఎల్ సరఫరా చేసిందని ఆయన చెప్పారు. ఇది ఊహించని మహమ్మారి సమయంలో ఇదొక గొప్ప సేవగా ఆయన అభివర్ణించారు.
ప్రస్తుతం ఏర్పాటు చేసిన 300 పడకల ఆస్పత్రి కేవలం ప్రారంభం మాత్రే నని ఆయన అన్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్ , ఈ ప్రాంతంలో కోవిడ్ -19 మహమ్మారి సమయంలో అత్యంత అవసరమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలకు ఊతం ఇచ్చిందని చెప్పారు. కొత్త బిఒఒ ప్లాంటు కార్యకలాపాలను ప్రారంభించేందుకు కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన చెప్పారరు. దీనితో త్వరలోనే 100 మెట్రిక్ టన్నుల ద్రవరూప ఆక్సిజన్‌ను అదనంగా ఉత్పత్తి చేయడానికి వీలు కలుగుతుందని అన్నారు. రెండవదశలో కోవిడ్ కేర్ సెంటర్ సామర్థ్యాన్ని 1000 పడకల కేంద్రంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు.
ప్రస్తుతం , 100 పడకలను ట్రైనీ హాస్టల్ -1లో ఏర్పాటు చేయగా మరో 200 పడకలను గురజాడ కళాక్షేత్రంలో ఏర్పాటు చేశారు. ఇవన్నీ అంతర్గతంగా రూపొందించారు. గురజాడ కళాక్షేత్రంలోని అన్ని పడకలకు ఆక్సిజన్ సరఫరా కు వీలుగా సెంట్రల్ ఆక్సిన్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ సరఫరాకు సిలిండర్ బ్యాంక్ కూడా ఉంది. దీనిని సంస్థలోని ఉద్యోగులే డిజైన్ చేసి ఏర్పాటు చేశారు.
*****
(Release ID: 1722894)
Visitor Counter : 195