శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ అనంతర ప్రపంచంలో శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణలతో సన్‌రైజ్ రంగాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్న ప్రముఖులు.
Posted On:
27 MAY 2021 5:37PM by PIB Hyderabad
కోవిడ్ మహమ్మారికి ఆవలివైపు-- సైన్స్ విధాన సమన్వయం అనే అంశంపై జరిగిన ఆన్‌లైన చర్చలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ, కోవిడ్ అనంతర ప్రపంచంలో భవిష్యత్ వృద్ధి, ప్రగతికి సన్‌రైజ్ రంగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, దీనిని సైన్స్ టెక్నాలజీ మాత్రమే సాధించగలదని వారు అన్నారు.
“ కోవిడ్ -19 సాధారణ జీవనాన్ని దెబ్బతీసింది. ఆర్ధిక వ్యవస్థలకు విఘాతం కలిగించింది. అదే సమయంలో ఇది మంచి అవకాశానికి సంబంధించి ఆశావహ పరిస్థితి. మార్పునకు, మెరుగైన భవిష్యత్‌కు ఆశ కల్పిస్తోంది. దీనిని కేవలం సైన్స్ , టెక్నాలజీ ద్వారా మాత్రమే సాధించగలం. ఇదే భవిష్యత్‌కు కీలకం. అది సుదూర ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ కావచ్చు, టెలిమెడిసిన్ లేదా మారుమూల ప్రాంతాల గ్రామాలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు కావచ్చు లేదా ఆన్‌లైన్ విద్య లేదా మరేదైనా కావచ్చు అని నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ అన్నారు. ప్రజలు కోవిడ్‌కు సంబంధించన ప్రొటొకాల్స్ పాటించాలని, వాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.
ప్రస్తుత మహమ్మారి సమయంలో జెనోమ్ క్రమం వంటివి ఎంతో కీలకమైనవని అంటూ, ఇది కోవిడ్ -19 సహా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలదన్నారు. వేగవంతమైన కమ్యూనికేషన్‌కు 5జి టెక్నాలజీ , మొబైల్ టెక్నాలజీ ని , ప్రపంచ టెక్నాలజీని సత్వరం మార్చగలదని అన్నారు. అలాగే కృత్రిమ మేధ ( ఎఐ) భారతదేశ ప్రగతిని వేగవంతం చేసేందుకు శక్తి కలిగి ఉందన్నారు.
డిఎస్‌టి స్వర్ణోత్సవ సిరీస్ లో భాగంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ , టెక్నాలజీ కమ్యూనికేషన్ , విజ్ఞాన్ ప్రసార్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆన్‌లైన్ ద్వారా ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు.
ఈ కార్యక్రమంలో డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్‌టి) కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ, గత 50 సంవత్సరాలలో డిఎస్‌టి కృషి, ప్రత్యేకించి గత ఏడాది కాలంగా కోవిడ్ -19 మహమ్మారి సమయంలో దేశంలో సైన్స్, టెక్నాలజీ మౌలికసదుపాయాలను బలోపేతం చేసేందుకు ఇది సాగించిన కృషి గురించి ప్రమఖంగా ప్రస్తావించారు. డిఎస్‌టి కి సంబంధించిన నాలుగు ముఖ్యమైన విధానాల గురించి ఆయన ప్రస్తావించారు. అలాగే రానున్న సైన్స్ , టెక్నాలజీ ఇన్నొవేషన్ పాలసీ (ఎస్‌టి.ఐ.పి) 2021 గురించి, సరళీకృత జియో స్పేషియల్ డాటా పాలసీ, రానున్న సైంటిఫిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(ఎస్ ఎస్ ఆర్ ల గురించి ప్రస్తావించారు. ఇవి సమాజానికి సాధికారత కల్పిస్తాయన్నారు..
కోవిడ్ -19 మహమ్మారపై పోరాటంలో డిఎస్టి పాత్ర గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సైన్స్ టెక్నాలజీలో స్త్రీ పురుష అంతరానికి సంబంధించిన సమస్యను ఎదుర్కొనేందుకు డిఎస్‌టి తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు.సైబర్ ఫిజికల్ వ్యవస్థ (సిపిఎస్) 25 హబ్‌లతో పాటు పరిశ్రమ, అకాడమియా, స్టార్టప్‌లతో కలిసి పనిచేస్తున్నదన్నారు. ప్రతి ఒక్కదానిపై దాని ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు. విద్య, ఆర్ధిక వ్యవస్థపై నిర్ణయం తీసుకోవడంపై దీని ప్రభావం ఉంటుందని అన్నారు.
కోవిడ్ 19- 2.0 కు సంబంధించి మాట్లాడుతూ, డిఎస్‌టి కార్యదర్శి, కోవిడ్ -19 ఉత్పరివర్తనాలు భవిష్యత్‌లో కూడా ఏర్పడుతూ ఉంటాయని, మనం ఆ ఉత్పరివర్తనాలను విశ్లేషిస్తూ ఉండాలని, అలాగే ఆరోగ్యం పై వాటి ప్రభాం, వాటి తీవ్రత గమనిస్తుండాలని అన్నారు. అదే సమయంలో కోవిడ్ -19 ప్రోటోకాల్‌ను తగిన విధంగా పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించగలమని ప్రొఫెసర్ శర్మ అన్నారు.
దేశంలో కోవిడ్ 2.0 ప్రస్తుత సవాలును ఎదుర్కొనేందుకు స్టార్టప్ ఆధారిత పరిష్కారాలకు మద్దతు నిచ్చేందుకు సత్వర ప్రతిస్పందనగా నిధి ఫర్ కోవిడ్ 2.0 అనే కొత్త చొరవ గురించి ఆయన వివరించారు.
ఈ కార్యక్రమం కింద, దేశం కోవిడ్ పై సాగిస్తున్న పోరులో భాగంగా , నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ,వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేయాల్సిందిగా భారతీయ స్టార్టప్‌లు, కంపెనీలను ఆహ్వానించడం జరుగుతుంది.
ఈ కొత్త చొరవ కింద , కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు,
కోవిడ్ -19 తొలి వేవ్‌లో, మూడు నాలుగు నెలల మద్దతుతో 100 స్టార్టప్‌లనుంచి ఫలితాలు రావడం చూశాం.
మేం కంపెనీలను గుర్తించాం, వీటినుంచి నెలలోనే సానుకూల ఫలితాలు రావడం మొదలైంది. మన సొంత టెక్నాలజీతో మనం ఎంతో చేయవచ్చు. మూడింట రెండోవంతు ధరకు మనం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్జిజన్ కాన్సన్ ట్రేటర్లను మనం తయారు చేయగలం. ఇది మనకు ఎన్నో భారీ అవకాశాలను ఇవ్వగలదు. దిగుమతి చేసుకుంటున్న ఎన్నోకీలక ఉపకరణాల తయారీకి అద్భుత అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రత్యేక వాల్వులు, జియోలైట్ మెటీరియల్స్ , చమురు లేకుండా, శబ్దం లేకుండా ఉండే చిన్నపాటి కంప్రెసర్లు, గ్యాస్ సెన్సర్లు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవి పలు రంగాలలో ఉపయోగపడతాయని డిఎస్‌టి కార్యదర్శి వివరించారు.
***
(Release ID: 1722363)
Visitor Counter : 168