వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఉద్యానవన ఉత్పత్తులపై దృష్టి సారిస్తూ రెండో వర్చువల్ ట్రేడ్ ఫెయిర్‌ను ఏర్పాటు చేసిన ఏపీఈడీఏ
ప్రపంచ ప్రతిస్పందనను ప్రోత్సహించేలా వర్చువల్ ట్రేడ్ ఫెయిర్ నిర్వహణ
Posted On:
27 MAY 2021 5:27PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి విస్తరణ సమయంలో భారతదేశ వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్యం పెంచడానికి ఏపీఈడీఏ ఈ రోజు
రెండవ వర్చువల్ ట్రేడ్ ఫెయిర్‌ను (వీటీఎఫ్) ప్రారంభించింది. దేశ ఉద్యాన ఉత్పత్తుల ప్రోత్సాహం కోసం.. రెండవ వర్చువల్ ట్రేడ్ ఫెయిర్ ఈ రోజున ప్రారంభించబడింది. మూడు రోజుల పాటు జరగనున్న (మే 27-29, 2021) ఈ
ట్రేడ్ ఫెయిర్ ప్రపంచ దిగుమతిదారుల కోసం భారతదేశం యొక్క ప్రత్యేకమైన పండ్లు, కూరగాయలు వివిధ ప్రాంతాల నుండి సేకరించిన పూల సాంస్కృతిక ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. దాదాపు 471 కంటే ఎక్కువ మంది ప్రదర్శకులు లేదా ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో భాగంగా వర్చువల్ ప్లాట్‌ఫాంలో ప్రదర్శనకు ఉంచుతున్నారు. దాదాపు 543 మంది సందర్శకులు / దిగుమతిదారులు వీటీఎఫ్‌లో తమత భాగస్వామ్యాన్ని నమోదు చేసుకున్నారు.
తాజా కూరగాయలు, తాజా మామిడి పండ్లు, తాజా దానిమ్మ, ద్రాక్ష మరియు ఇతర తాజా పండ్ల ప్రదర్శనకారులు, ఎగుమతిదారులు తమతమ ఉత్పత్తులను
ప్రపంచ దిగుమతిదారులకు వర్చువల్ ట్రేడ్ ఫెయిర్‌లో ప్రదర్శించారు. భారత దేశం, సింగపూర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, నైజీరియా, బహ్రెయిన్, ఇజ్రాయెల్, సురినామ్, ఆఫ్ఘనిస్థాన్, జపాన్, ఐస్లాండ్, మాల్దీవులు, బ్రూనై సందర్శకులు ఇప్పటికే వీటీఎఫ్‌లో పాల్గొన్నారు.
అంతకుముందు, గత ఏడాది మార్చి 10-12వ తేదీల మధ్య ఏపీఈడీఏ తొలి
వీటీఎఫ్‌ను నిర్వహించింది. అప్పట్లో తొలి వీటీఎఫ్ ప్రదర్శనను 404 మందికి పైగా సందర్శకులను ఆకర్షించింది. ఈ మెగా వర్చువల్ ఈవెంట్ కోసం.. 313 ప్రదర్శనకారులు నమోదు చేయబడ్డారు. ఇక్కడ బాస్మతి బియ్యం, నాన్-బాస్మతి బియ్యం, మిల్లెట్లు, గోధుమ, మొక్కజొన్న, వేరుశనగ, ఇతర ముతక ధాన్యాలు తదితర విభాగాల నుండి ఉత్పత్తులను ప్రదర్శించడానికి 128 స్టాల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. వీటీఎఫ్ సమయంలో ప్రదర్శించబడే వివిధ రకాల ఈ ఉత్పత్తి వర్గాలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులు ఆసక్తి చూపారు. భౌతిక ప్రయాణం, వాణిజ్యంపై కోవిడ్-19 సంబంధితమైన పలు పరిమితుల కారణంగా, భారతదేశ వ్యవసాయ, ప్రాసెస్ చేసిన వివిధ ఆహార ఉత్పత్తుల ఎగుమతులను కొనసాగించడానికి, ఎగుమతి పాదముద్రలను విస్తరించడానికి.. కొత్త మార్కెట్లను అన్వేషించడానికి ఏపీఈడీఏ ఈ వీటీఎఫ్ భావనను ప్రారంభించింది. కోవిడ్-19
పూర్వం ఏపీఈడీఏ ద్వారా వ్యవసాయ, వివిధ ఆహార పదార్థాల ఎగుమతులను ప్రోత్సహించడంలో వాణిజ్య ఉత్సవాలు, ప్రదర్శనలు కీలకమైనవి. వీటీఎఫ్‌లో ఇంటరాక్టివ్ టెక్నాలజీని ఉపయోగించి వాణిజ్య సౌకర్యాల ఏర్పాట్లు జరుగుతూ వస్తున్నాయి. వీటీఎఫ్ వద్ద ఎగుమతిదారులు, దిగుమతిదారుల సమావేశాలు ఆడియో మరియు వీడియో సెషన్ల ద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా జరిగాయి. ఈ ఫెయిర్ ఫెసిలిటీ వర్క్‌షాప్‌లు, ప్రొడక్ట్ లాంచ్‌లు, లైవ్ స్ట్రీమ్‌లు మరియు వెబ్‌నార్‌లను అందించింది. వర్చువల్ మీట్ ప్రైవేట్ సమావేశాలతో పాటు వ్యక్తిగతీకరించిన సమావేశాలను సులభతరం చేసింది. ఎగుమతిదారులు, దిగుమతిదారుల మధ్య ఆన్‌లైన్ పరస్పర చర్యలు మరియు అటువంటి పరస్పర చర్య సమయంలో మార్పిడి చేయబడిన డేటా సురక్షితం మరియు సంబంధిత పార్టీలు మాత్రమే యాక్సెస్ చేసుకొనేలా ఏర్పాట్లూ చేయడమైంది.. ఇటువంటి వర్చువల్ సంఘటనలు ఖర్చుతో కూడుకున్న, ఉత్పాదక ప్లాట్‌ఫాంలను కూడా అందిస్తాయి. ఇక్కడ కొనుగోలుదారులు, అమ్మకందారులు వాణిజ్య ముఖాముఖితో చర్చలు జరపవచ్చు లేదా చర్చించవచ్చు. ఏపీఈడీఏ తన ప్రాసెస్ సిస్టమ్‌ను ఆన్‌లైన్‌లో తయారుచేయడం, గుర్తించదగిన సామర్థ్యాన్ని అమలు చేయడం.. మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం వంటి వాటిలో గతంలో ఐటీ చొరవ తీసుకోవడంలో ముందుంది.
*****
(Release ID: 1722353)
Visitor Counter : 210