శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
బయోటెక్నాలజీ, బయోమెడిసిన్ రంగాలలో అంకురిస్తున్న సమస్యలపై చర్చించిన బ్రిక్స్ సమావేశం
Posted On:
27 MAY 2021 5:09PM by PIB Hyderabad
బయోటెక్నాలజీ, బయోమెడిసిన్ వంటి వివిధ క్షేత్రాల్లో అంకురిస్తున్న సమస్యల గురించి ఆ అంశంపై బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం నిపుణులు చర్చించారు. ఐదు బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాకు చెందిన పరిశోధకులు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులు సహా 60మంది 25మే నుంచి 26 మే 2021 వరకు నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొన్నారు.
బయోటెక్నాలజీ, బయోమెడిసిన్ రంగంలోని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ హెల్త్ మెడిసిన్, సంక్రమించని వ్యాధులు, నరాలకు సంబంధిచిన వ్యాధులు, వ్యవసాయ సంబంధిత బయోటెక్నాలజీ (ఆగ్రో-బయోటెక్నాలజీ), ఆహారం, పౌష్ఠికత, కాన్సర్, కోవిడ్ అనంతర సుదీర్ఘ కాల సవాళ్ళు, సమస్యలు, కోవిడ్ 19 వైరస్ అణు వ్యాధికారకం మాలిక్యులార్ పాథోజెనెసిస్)పై బ్రిక్స్ దేశాల మధ్య భవిష్యత్ పరిశోధనలో దిశ, సహకారం గురించి వర్కింగ్ గ్రూప్ సభ్యులు సూచనలు చేశారు.
ఈ సమావేశానికి చైనా అంతర్జాతీయ సహకారం, శాస్త్ర, సాంకేతిక శాఖ (MOST)శాఖ ప్రాయోజితం చేయగా, చైనా నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ డెవలప్‌మెంట్ నిర్వహంచింది. భారత దేశం నుంచి శాస్త్ర సాంకేతిక శాఖ (డిఎస్‌టి), బయోటెక్నాలజీ శాఖ (డిబిటి) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ, ఆలిండియా ఇనిస్టట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బోధపూర్, ఇండియా, బెనారెస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ వంటి కీలక శాస్త్రీయ సంస్థలు పాల్గొన్నాయి.
కోవిడ్ అనంతర సవాళ్ళను, పరిష్కరించడం, సంక్రమితం కాని వ్యాధులనను నిర్వహించడం (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) వంటి వాటిని ప్రతిష్ఠాత్మక కార్యక్రమంగా చేపట్టవలసిందిగా బ్రిక్స్ కన్సోర్షియంకు ప్రతిపాదించగా, ఆరోగ్యవంతమైన ఆహారం, పౌష్ఠికత కోసం స్థిరమైన ఆగ్రో-బయోటెక్నాలజీ. న్యూరోరీహాబిలిటేషన్ కోసం అత్యాధునిక వర్చువల్ రియాలిటీ అసిస్టెడ్ టెక్నాలజీని ప్రతిపాదించింది.కాగా, కాన్సర్ పరిశోధనను ప్రతిష్ఠాత్మక కార్యక్రమంగా చేయాలని చైనా ప్రతిపాదించింది.
తదుపరి సమావేశాన్ని 2021రెండవ భాగంలో ప్రకటించవచ్చని, ఇందులో వర్కింగ్ గ్రూప్ చేసిన సూచనలను పొందుపరుస్తామని బ్రిక్స్ సమావేశాల నిర్వహణ సెక్రెటేరియేట్ ప్రతినిధి తెలిపారు.
భారతదేశానికి అంతర్జాతీయ సహకార డివిజన్ (డిఎస్‌టి) అధిపతి, సలహాదారు డాక్టర్ సంజీవ్ కుమార్ వార్ష్నే నాయకత్వం వహించారు. బ్రిక్స్ బహుళార్ధక ప్రాజెక్టులకు సాయం చేసేందుకు నిధులు సహా వనరుల సహపెట్టుబడులు పెట్టేందుకు భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కోవిడ్-19 పై పోరాటం, మహమ్మారికి తమ సంసిద్ధత గురించి తమ అనుభవాలను ప్రతి బ్రిక్స్ దేశం పంచుకుంది. వారు ఇతర బ్రిక్స్ దేశాలతో సహకరించేందుకు అవకాశాలు సహా తమ వర్తమాన పని, సంయుక్త ఫండింగ్ క్షేత్రాలలో తమ ఆసక్తులు/ ప్రయోజనాలను వెల్లడించారు. పరిశోధనా కార్యకలాపాలను ప్రముఖంగా పేర్కొంటూ తమ బలాలను, తమ మైలురాళ్ళను, బయోటెక్నాలజీ, బయోమెడిసిన్ లో తమ విజయాలను వారు వివరించారు.
బ్రిక్స్ దేశాలకు చెందిన కీలక సంస్థలైన ది తైంజీన్ మెడికల్ యూనివర్సిటీ కాన్సర్ ఇనిస్టిట్యూట్ అండ్ హాస్పిటల్, తైంజీన్, చైనా, పీకింగ్ యూనివర్సిటీ, చైనా, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ, చైనా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్నొవేషన్, దక్షిణ ఆఫ్రికా, స్కోలోవో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (స్కోల్‌టెక్), రష్యా, ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ రియోడి జెనీరో, బ్రెజిల్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఎస్ఎఎంఆర్‌సి), దక్షిణ ఆఫ్రికా ఈ సమావేశంలో పాల్గొన్నాయి.
అన్ని బ్రిక్స్ దేశాలు అనుసరిస్తున్న బ్రిక్స్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్ కేలండర్ యాక్టివిటీస్ 2020-21లో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. భారత దేశం జనవరి 2021 నుంచి బ్రిక్స్ కు అధ్యక్షత వహిస్తోంది. మంత్రిత్వ స్థాయి సమావేశాలు, సీనియర్ అధికారుల సమావేశాలు, వివిధ రంగాలకు చెందిన సమావేశాలు, కాన్ఫరెన్సులు సహా 100 కార్యక్రమాలను బ్రిక్స్ 2021 కేలెండర్‌లో భాగంగా నిర్వహించనున్నారు.
***
(Release ID: 1722295)
Visitor Counter : 190