ఆయుష్
ఆయుష్ సంజీవని ఆప్‌ను, రిపోసిటరీ పోర్టల్‌ను గురువారం ప్రారంభించనున్న ఆయుష్ మంత్రి
Posted On:
26 MAY 2021 8:05PM by PIB Hyderabad
కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (ఇన్‌ఛార్జి) కిరణ్ రిజుజీ గురువారం ఆయుష్ క్లినికల్ కేస్ రిపోజిటరీ (ఎసిసిఆర్ - కేసుల చికిత్సకు సంబంధించిన సమాచారం ఉంచేందుకు ఉద్దేశించినది)ని, ఆయుష్ సంజీవినీ ఆప్ మూడవ వర్షన్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయుష్ రంగం మరొక మైలు రాయిని చేరుకోనుంది.
ఆయుష్ వైద్యులను, సాధారణ ప్రజలకు మద్దతుగా వ్యవహరించే వేదికగా ఆయుష్ క్లినికల్ రిపోజిటరీ పోర్టల్ (https://accr.ayush.gov.in/) వ్యవహరించనుంది. ఆయుష్ వైద్యులు భారీ స్థాయిలో సాధించిన చికిత్సా ఫలితాలకు సంబంధిచిన సమాచారాన్ని కూర్చడమే ఈ పోర్టల్ లక్ష్యం. సమాచారాన్ని మాత్రమే కాక విశ్లేషణ పరిశోధనలను అందరికీ చేరవేసేందుకు సౌలభ్యాన్ని కల్పించనుంది. వివిధ వ్యాధులకు సంబంధించిన ఆయుష్ చికిత్సా పద్ధతుల బలాలను కూడా గ్రంథస్థం చేయనుంది.
వైద్య సమాజానికి, ప్రజలకు మాత్రమే కాక ఆయుష్కు సంబంధించిన అన్ని స్రవంతుల బలమైన శాస్త్రీయ పునాదులను విస్తరింపచేసేందుకు ఈ పోర్టల్ తోడ్పడి, లబ్ధి చేకూర్చనుంది. ఎసిసిఆర్ పోర్టల్‌లో కీలక లక్షణం ఏమిటంటే, ఆయుష్ విధానాల ద్వారా కోవిడ్ 19కు చేసిన చికిత్సకు సంబంధించిన వివరాలను ప్రచురించేందుకు, నమోదు చేసేందుకు ఒక అంకితమైన విభాగం ఉంది.
ఆయుష్ సంజీవని ఆప్ (మూడవ వర్షన్) ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ లో, ఐఒఎస్‌లో లభ్యం కానుంది. ఈ వర్షన్‌లో అసింప్టమాటిక్ (లక్షణాలు కనిపించని), తేలికపాటి లక్షణాలు కలిగిన కోవిడ్ 19 కలిగిన రోగులకు చికిత్స చేయడంలో ఆయుష్ 64, కబుసుర కుడనీర్ మందులతో సహా తీసుకున్న ఆయుష్ చొరవలు ప్రముఖ అధ్యయన/ ప్రచురణలు అందుబాటులో ఉండనున్నాయి. హోం ఐసొలేషన్‌లో ఉన్న కోవిడ్ రోగులకు ఉచితంగా ఈ రెండు ప్రభావవంతమైన ఆయుష్ సూత్రీకరణలను జాతీయ పంపిణీ ప్రచారం ద్వారా ఆయుష్ మంత్రిత్వ శాఖ అందిస్తున్న విషయం గమనార్హం.
ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఫేస్ బుక్, యూట్యూబ్ సోషల్ మీడియల్స్ పై మధ్యాహ్నం 3.30 గంటల నుంచి లైవ్‌గా వీక్షించవచ్చు.
***
(Release ID: 1722043)
Visitor Counter : 272