విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఎన్‌టీపీసీ బొంగైగావ్‌లో కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభం
Posted On:
26 MAY 2021 10:30AM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ, కోవిడ్ మహమ్మారిపై తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు గాను సంస్థలోని ఉన్న నిపుణులు పూర్తి అంకితభావంతో అందివస్తున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని తగు చర్యలు చేపడుతున్నారు. కోవిడ్‌కు వ్యాప్తికి వ్యతిరేకంగా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ,
ఎన్‌టీపీసీ బొంగైగావ్ మెడికల్ సెల్.. ఈ రోజు ఎన్‌టీపీసీ బొంగైగావ్ కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించింది. అపోలో టెలిహెల్త్ సర్వీసెస్ వారి సహకారంతో ఈ కేంద్రం పని చేస్తుంది. అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించిన 2021 మే 25న ఎన్‌టీపీసీ సంస్థ సీజీఎం శ్రీ సుబ్రతా మండల్ ప్రారంభించారు. కోవిడ్ కేసులను మారుమూల ప్రాంతాలలో నిర్వహించడానికి ఈ కేంద్రం అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది. ఈ కోవిడ్ సంరక్షణ కేంద్రంలో పది కోవిడ్ చికిత్స వినియోగపు పడకలు ఉన్నాయి. ఇందులో జ్వరమానిని, ఎస్‌పీఓ2, హృదయ స్పందన రేటు, రక్తపోటు, శ్వాసకోశ రేటును.. నిరంతరం పర్యవేక్షించడానికి మల్టీపారా మానిటర్ కలిగి ఉంటుంది. తీవ్రమైన అనారోగ్య రోగుల నిజసమయ పర్యవేక్షణ కోసం ఇన్వాసివ్ వెంటిలేటర్లు, మల్టీ చానెల్ బెడ్‌సైడ్ మానిటర్‌లు, వెబ్‌క్యామ్‌తో చెన్నైలోని అపోలోకు అనుసంధానించబడిన ఎల్ఈడీ టెలివిజన్‌తో కూడిన ఒక ఈ-ఐసీయు కూడా ఈ కేంద్రంలో ఏర్పాటు చేయబడినాయి. నాన్ -ఇన్వాసివ్ వెంటిలేషన్ కోసం 2 బైపీఏపీ యంత్రాలతో పాటు, ఆక్సిజన్ సపోర్ట్ కోసం 7 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, డి-డైమర్, ట్రోపోనిన్, సీఆర్‌పీ, ఏబీజీ మరియు ఈసీజీలను అంచనా వేయడానికి పాయింట్-ఆఫ్-కేర్ డయాగ్నస్టిక్స్, అత్యవసర పరిస్థితులను సులభంగా తెలుసుకొనేందుకు గాను చక్రాలపై 2 బండి పల్స్ ఆక్సిమీటర్, ఐఆర్ థర్మామీటర్లు వంటి మందులు.. పరికరాలను ఏ విధమైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి వీలుగా ఈ కేంద్రంలో అమర్చారు. నమూనా సేకరణ కోసం రెండు కియోస్క్‌లతో పాటు, ఆరుగురు వైద్యులు, 10 మంది నర్సులు రోగులతో నిరంతరంగా సేవలను అందిచేలా ఏర్పాట్లు చేశారు.
***
(Release ID: 1722036)
Visitor Counter : 195