విద్యుత్తు మంత్రిత్వ శాఖ

బెంగ‌ళూరులో కోవిడ్ -19 వాక్సినేష‌న్ క్యాంప్ ను ఏర్పాటు చేసిన ప‌వ‌ర్‌గ్రిడ్

Posted On: 26 MAY 2021 3:05PM by PIB Hyderabad

ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ప‌వ‌ర్‌గ్రిడ్‌) త‌న సిబ్బందికి , వారి కుటుంబ స‌భ్యుల‌కు కోవిడ్ 19 మ‌హ‌మ్మారి నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు దేశ‌వ్యాప్తంగా ప‌లు వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ది. ప‌వ‌ర్‌గ్రిడ్‌కు చెందిన అన్ని ఎస్టాబ్లిష్‌మెంట్ల‌లో వాక్సినేష‌న్ క్యాంప్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా భార‌త ప్ర‌భుత్వానికి  విద్యుత్ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన మ‌హార‌త్న సిపిఎస్‌యు.

బెంగ‌ళూర‌రులోని ప్రాంతీయ కేంద్ర కార్యాల‌యం, ద‌క్షిణాది రీజియ‌న్ -2 వ‌ద్ద వాక్సినేష‌న్ క్యాంప్‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ప్రాంతీయ హెడ్ క్వార్ట‌ర్స్ కు చెందిన‌ ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్  ఉద్యోగులు , వారిపై ఆధార‌ప‌డిన వారు. వారిపై ఆధార‌ప‌డ‌ని కుటుంబ స‌భ్యులు, ఎల‌హంక స‌బ్ స్టేష‌న్‌, బిదాడి స‌బ్ స్టేష‌న్ , సోమ‌న్‌హ‌ల్లి స‌బ్ స్టేష‌న్ తోపాటు ఎఎంసి, సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవ‌ర్లు,  క్యాంటీన్‌, ట్రాన్సిట్ క్యాంప్ సిబ్బంది కోసం  దీనిని ఏర్పాటు చేశారు.
సుమారు 110 మంది సిబ్బంది, వారిపై ఆధార‌ప‌డిన కుటుంబ స‌భ్యులు, పోస్కో కాంట్రాక్టు సిబ్బంది, ఎస్‌.ఎర్‌పిసి కి చెందిన వారు ఈ క్యాంప్‌లో పాల్గొన్నారు. దీనిని మ‌ణిపాల్ హాస్పిట‌ల్స్‌, బెంగ‌ళూరు స‌హ‌కారంతో ఏర్పాటు చేశారు. ఇందులో 250 డోస్‌ల వాక్సిన్‌ను వేశారు.

***



(Release ID: 1721994) Visitor Counter : 139