విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఆక్సిజ‌న్ ప్లాంట్‌కు, స‌మీప ప్రాంతాల‌కు ప్రామాణిక‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా కోసం నాగాలాండ్ లోని రిఫ‌ర‌ల్ హాస్పిట‌ల్ స‌బ్ స్టేష‌న్‌ వ‌ద్ద ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ను ప్రారంభించిన ప‌వ‌ర్‌గ్రిడ్

Posted On: 24 MAY 2021 1:57PM by PIB Hyderabad

విద్యుత్ మంత్రిత్వ శాఖ  కింద ప‌ని చేస్తున్న భార‌త ప్ర‌భుత్వ మ‌హార‌త్న‌, ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్  ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పవ‌ర్‌గ్రిడ్‌) మ‌హమ్మారి కాలంలో ప్రామాణిక‌మైన  విద్యుత్‌ను త‌న ప్ర‌సార నెట్‌వ‌ర్క్ ద్వారా అందించేందుకు 24x7 సానుకూలంగా ప‌ని చేస్తున్న‌ది. 
విద్యుత్తు అంతరాయాల సందర్భాలను తగ్గించేందుకు, నాగాలాండ్ లోని ఏకైక ఆక్సిజన్ ప్లాంట్‌కు సమర్థవంతమైన విద్యుత్ సరఫరాకు హామీ ఇవ్వ‌డానికి, నాగాలాండ్ ప్రభుత్వంతో పాటుగా  నాగాలాండ్ విద్యుత్ శాఖ (డోపిఎన్) రెఫరల్ హాస్పిటల్ , దీమాపూర్ వద్ద 10 మెగా వోల్ట్ ఆంపియర్స్ (ఎంవిఎ) ట్రాన్స్‌ఫార్మర్‌ను స‌బ్‌ స్టేషన్, ప్రారంభించ‌వ‌ల‌సిందిగా పవర్‌గ్రిడ్‌ను కోరారు.
ప్ర‌స్తుత ప‌రిస్థితిలో చేసిన విజ్ఞ‌ప్తికి స్పందిస్తూ, ప‌వ‌ర్‌గ్రిడ్ బృందం త‌క్ష‌ణ కార్యాచ‌ర‌ణ‌లోకి దూకి, రెండు రోజుల‌లోప‌ల, అంటే  22.05.2021న సాయంత్రం7.30 గంట‌ల‌కు విద్యుత్ ట్రాన్స‌ఫార్మ‌ర్నువిజ‌య‌వంతంగాప్రారంభించారు. ఇది ఆక్సిజ‌న్ ప్లాంట్‌కేకాక చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల‌కు  కూడా ప్రామాణిక‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రాకు దారి తీస్తుంది. 
ప‌వ‌ర్‌గ్రిడ్ 33/11 కెవి రిఫ‌ర‌ల్ హాస్పిట‌ల్ నాగాలాండ్‌లో ప్రారంభించిన కొత్త విద్యుత్ ట్రాన్స‌ఫార్మ‌ర్ ప్ర‌స్తుతం నాగా యునైటెడ్ గ్రామం వ‌ద్ద గ‌ల బిఎంఎ లిక్విడ్ ప్లాంట్‌కు ప్రామాణిక‌మైన విద్యుత్ వ్య‌వ‌స్థ‌కు అద‌నం అవుతుంది. ఇంత‌కు ముందు, ఇది 5 ఎంవిఎ ట్రాన్స‌ఫార్మ‌ర్ ద్వారా విద్యుత్‌ను పొందుతోంది. ట్రాన్స‌ఫార్మ‌ర్‌ను ప్రారంభించ‌డం వ‌ల్ల గుణాత్మ‌క‌మైన విద్యుత్ రోజులో ఇర‌వై నాలుగు గంట‌లూ స‌బ్ స్టేష‌న్‌లోని 11 కెవి ఔట్‌గోయింగ్ రోంగ్మీ ఫీడ‌ర్ ద్వారా ఆక్సిజ‌న్ ప్లాంట్‌కు ప్ర‌స్తుతం అందుతుంది.
క‌ఠిన‌మైన లాక్ డౌన్ స‌మ‌యంలో కోవిడ్ 19 ప్రోటోకాళ్ళ‌ను పాటిస్తూ నార్త్ ఈస్ట‌ర్న్ రీజియ‌న్ ప‌వ‌ర్ సిస్టం ఇంప్రూవ్‌మెంట్  (ఈశాన్య‌ప్రాంత మెరుగైన విద్యుత్ వ్య‌వ‌స్థ -ఎన్ఇఆర్‌పిఎస్ఐపి) ప్రాజెక్టు  ప‌వ‌ర్ గ్రిడ్ ఇంజ‌నీర్లు ప‌నుల‌ను పూర్తి చేశారు.  ఎన్ఇఆర్‌పిఎస్ఐపి, దేశ ఈశాన్య ప్రాంత ఆర్థిక అభివృద్ధి ఉద్దేశించిన భార‌త ప్ర‌భుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర రంగ‌ ప్ర‌ణాళిక. 
ఈ ప‌థ‌కాన్ని ప‌వ‌ర్ గ్రిడ్ ద్వారా, ల‌బ్ధిదారులైన ఆరు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మ‌ణిపూర్‌, మేఘాల‌య‌, మిజోరాం, నాగాలాండ్‌, త్రిపురల‌తో క‌లిసి అమ‌లు చేస్తున్నారు. ఈశాన్య‌ప్రాంత సంపూర్ణ ఆర్ధిక అభివృద్ధి సాధించ‌డం, రాష్ట్రాల‌లో ప్ర‌సారాన్ని బ‌లోపేతం చేయ‌డం, ఈశాన్య‌ప్రాంతంలో మౌలిక స‌దుపాయాల వ్యాప్తి భార‌త ప్ర‌భుత్వ ప్రాజెక్టు ప్ర‌ధాన ల‌క్ష్యం. ఈ ప‌థ‌కం అమ‌లు ప్రామాణిక‌మైన విద్యుత్ గ్రిడ్‌ను సృష్టించ‌డ‌మే కాక‌,  నిర్మించ‌నున్న లోడ్ సెంట‌ర్ల తో ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాల అనుసంధాన‌త‌ను మెరుగుప‌ర‌చ‌డం, త‌ద్వారా ఈశాన్య‌ప్రాంతంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో గ్రిడ్ అనుసంధాన‌త లాభాల‌ను అందిస్తుంది. మ‌హ‌మ్మారి కాలంలో విద్యుత్ ట్రాన్స్‌మిష‌న్ చేయ‌డం కోసం దేశ సేవ‌కు త‌మ దృఢ‌మైన అంకిత భావంలో భాగంగా ప‌వ‌ర్ గ్రిడ్ బృందం చేయ‌వ‌లసిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేస్తోంది. 

 

***
 



(Release ID: 1721332) Visitor Counter : 143