రైల్వే మంత్రిత్వ శాఖ
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ల ద్వారా 15000 మెట్రిక్ టన్నుల ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్ దేశవ్యాప్తంగా బట్వాడా
80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సహాయాన్ని నేడు అస్సాంకు అందచేసిన తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
1000 మెట్రిక్ టన్నులకు పైగార ఎల్ఎంఒ కర్నాటకకు బట్వాడా
936 ట్యాంకర్లతో 234 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లు ఇప్పటివరకూ 14 రాష్ట్రాలకు ఊరట కల్పించాయి
31 ట్యాంకర్ల ద్వారా 569 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఒతో ప్రయాణం సాగిస్తున్న 9 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, అస్సాం సహా 14 రాష్ట్రాలకు అందిన ఆక్సిజన్ ఊరట
614మెట్రిక్ టన్నులను మహారాష్ట్రలో, 3609 మెట్రిక్ టన్నులు ఉత్తర్‌ప్రదేశ్‌లో, 566 మెట్రిక్ టన్నులు మధ్యప్రదేశ్‌లో, 4300 మెట్రిక్ టన్నులను ఢిల్లీకి 1759మెట్రిక్ టన్నులు హర్యానా, 1063 మెట్రిక్ టన్నులు కర్ణాటక, 98 మెట్రిక్ టన్నులు రాజస్థాన్‌కు, 320 మెట్రిక్ టన్నులు ఉత్తరాఖండ్, 857 మెట్రిక్ టన్నులు తమిళనాడు, 642 మెట్రిక్ టన్నులు ఆంధ్రప్రదేశ్, 153 మెట్రిక్ టన
Posted On:
23 MAY 2021 1:41PM by PIB Hyderabad
అన్ని ఆటంకాలను అధిగమించి, నూతన పరిష్కారాలను కనుగొంటూ భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఒ)ను చేరవేస్తూ ఉపశమనాన్ని కల్పించే తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
ఇప్పటివరకూ, భారతీయ రైల్వేలు 936 ట్యాంకర్ల ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు 15284మెట్రిక్ టన్నుఎల్ఎంఒను చేరవేసింది.
ఇప్పటివరకూ వివిధ రాష్ట్రాలకు ఊరటను కల్పిస్తూ ఇప్పటి వరకూ 234 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న విషయం గమనార్హం.
ఈ ప్రకటన వెలువడే సమం వరకూ,31 ట్యాంకర్లలో 569 మెట్రిక్ టన్నుల ఎల్ ఎంఒను మోసుకుని 9 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రయాణం చేస్తున్నాయి.
దాదాపు 80 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఒను 4 ట్యాంకర్లలో అస్సాంకు మోసుకువెడుతున్న తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం ఉదయం 11.30 గంటలకు అస్సాం చేరుకుంది.
దాదాపు 1000 మెట్రిక్ టన్నులకు పైగా ద్రవరూపంలో ని మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఒ)ను ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు కర్నాటకకు బట్వాడా చేశాయి.
ప్రస్తుతం ప్రతిరోజూ 800 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్ఎంఒను దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు చేరవేస్తున్నాయి.
ఆక్సిజన్ కోరుతున్న రాష్ట్రాలకు సాధ్యమైనంత స్వల్ప సమయంలో ఎంత సాధ్యమైతే అంత ఎల్ఎంఒను చేరవేసేందుకు భారతీయ రైల్వేలు కృషి చేస్తోంది.
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ఆక్సిజన్ ఊరట ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, అస్సాం సహా 14 రాష్ట్రాలకు అందింది.
ఈ ప్రకటన వెలువడే సమయం వరకూ, 614మెట్రిక్ టన్నులను మహారాష్ట్రలో, 3609 మెట్రిక్ టన్నులు ఉత్తర్‌ప్రదేశ్‌లో, 566 మెట్రిక్ టన్నులు మధ్యప్రదేశ్‌లో, 4300 మెట్రిక్ టన్నులను ఢిల్లీకి 1759మెట్రిక్ టన్నులు హర్యానా, 1063 మెట్రిక్ టన్నులు కర్ణాటక, 98 మెట్రిక్ టన్నులు రాజస్థాన్‌కు, 320 మెట్రిక్ టన్నులు ఉత్తరాఖండ్, 857 మెట్రిక్ టన్నులు తమిళనాడు, 642 మెట్రిక్ టన్నులు ఆంధ్రప్రదేశ్, 153 మెట్రిక్ టన్నలు పంజాబ్, 246 మెట్రిక్ టన్నులు కేరళ, 976 మెట్రిక్ టన్నులు తెలంగాణ, 80 మెట్రిక్ టన్నులు అస్సాంకుచేర్చింది.
సాధ్యమైనంత త్వరగా ఆక్సిజన్ సహాయం అందించేందుకు రైల్వేలు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ సరుకు రవాణా రాష్ట్రాలలో తలెత్తుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని భిన్న మార్గాలను రైల్వేలు సిద్ధం చేసింది. ఎల్ఎంఒను మోసుకు వచ్చేందుకు రైల్వేలకు రాష్ట్రాలకు ట్యాంకర్లను అందిస్తున్నాయి.
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ బట్వాడాలను 29 రోజు కిందట అంటే ఏప్రిల్ 24వ తేదీన మహారాష్ట్రకు 126 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఒతో బయలుదేరిన విషయం గమనార్హం.
దేశం నలుమూలలా ప్రయాణిస్తూ, పశ్చిమంలోని హాపా& బరోడా, ముంద్రా, తూర్పులో ఉన్న రూర్కెలా, దుర్గాపూర్, టాటానగర్, అంగల్ వంటి ప్రాంతాల నుంచి ఆక్సిజన్ ను తీసుకొని ఉత్తరాఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాలకు బట్వాడా చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని సంక్లిష్ట కార్యకలాప మార్గానికి ప్రణాళికలు వేసుకొని నిర్వహిస్తోంది.
సాధ్యమైనంత త్వరగా ఆక్సిజన్ సహాయం అందించేందుకు రైల్వేలు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ సరుకు రవాణా రైళ్ళను నడిపేందుకు నూతన ప్రమాణాలు, ముందెన్నడూ లేని బెంచ్ మార్కులను సృష్టిస్తోంది. కీలకమైన ఈ సరుకు రవాణా రైళ్ళు దీర్ఘ దూరాలు వెళ్ళేటప్పుడు సగటే వేగం గంటకు 55 కిలోమీటర్లకుపైన ఉంటుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన గ్రీన్ కారిడార్‌లో అత్యంత ప్రాధాన్యత భావనతో నడిపేటప్పుడు, వివిధ జోన్లకు చెందిన కార్యాచరణ బృందాలు ఆక్సిజన్ గమ్యానికి అతితక్కువ సమయంలో చేరుకునేందుకు రోజులో 24 గంటలూ అత్యంత సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితుల్లో పని చేస్తున్నారు. సిబ్బంది వివిధ సెక్షన్లలో మారుతుండడంతో సాంకేతిక నిలుపుదలలు ఒక నిమిషానికి తగ్గాయి.
ఆక్సిజన్ రైళ్ళు నిరాటంకంగా పరుగులు తీసేందుకు అత్యంత అప్రమత్తంగా ఉంటూ పట్టాలను ఆటంకాలు లేకుండా ఉంచుతున్నారు.
ఇతర సరుకు రవాణా వేగం తగ్గకుండా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా ఆక్సిజన్‌ను రవాణా చేయడం అనేది క్రియాశీల వ్యాయామం, గణాంకాలు ఎప్పటికప్పుడూ తాజా పరుస్తున్నారు. మరింత సరుకుతో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు నేటి రాత్రి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయని అంచనా.
***
(Release ID: 1721222)
Visitor Counter : 190