రక్షణ మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ సముద్ర సేతు II లో భాగంగా బ్రూనై మరియు సింగపూర్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లు మరియు వెంటిలేటర్లతో సహా ముఖ్యమైన కోవిడ్ సహాయ సామగ్రితో విశాఖపట్నం చేరుకున్న ఐఎన్ఎస్ జలశ్వా
Posted On:
23 MAY 2021 7:10PM by PIB Hyderabad
భారత నావికాదళం ప్రారంభించిన కోవిడ్ సహాయ ఆపరేషన్ 'సముద్ర సేతు II' లో భాగంగా బ్రూనై మరియు సింగపూర్ ల నుంచి ఐఎన్ఎస్ జలశ్వా 18 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, 3650 ఆక్సిజన్ సిలిండర్లు మరియు 39 వెంటిలేటర్లతో సహా ఇతర వైద్య సామగ్రితో ఈ రోజు ( 23 న) విశాఖపట్నం చేరుకుంది. జలశ్వా తీసుకునివచ్చిన 18 క్రయోజెనిక్ ట్యాంకులలో 15 ట్యాంకులు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో నిండి ఉన్నాయి.
ఆక్సిజన్ కంటైనర్లు మరియు వెంటిలేటర్లతో సహా కోవిడ్ సహాయక సామగ్రిని భారత నౌకా దళ నౌకలు దేశానికి తీసుకునివస్తున్నాయి. వీటిని వివిధ రాష్ట్రాలలోని ప్రభుత్వ సంస్థలు, స్వచ్చంధ సంస్థలకు అందజేస్తున్నారు.
***
(Release ID: 1721218)
Visitor Counter : 166