రైల్వే మంత్రిత్వ శాఖ
224 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ల ద్వారా 884కు పైగా ఆక్సిజన్ టాంకర్లలో 14,500 మెట్రిక్‌టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్‌ను ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు దేశంలోని వివిధ ప్రాంతాలకు కర్తవ్యనిష్ఠతొ రైల్వే చేరవేస్తోంది.
8 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు 563 మెట్రిక్‌టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్‌ను 35 ట్యాంకర్లలో గమ్యస్థానాలకు చేర్చే క్రమంలో ఉన్నాయి.
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ల ద్వారా ఆక్సిజన్ 13 రాష్ట్రాలకు ఉపశమనం కలిగించింది. ఇందులో ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణా, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.
614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను మహారాష్ట్రకు అందించడం జరిగింది. అలాగే సుమారు 3463 మెట్రిక్‌టన్నులు ఉత్తరప్రదేశ్‌కు, 566 మెట్రిక్ టన్నులు మధ్యప్రదేశ్‌కు , 4278 మెట్రిక్ టన్నులు ఢిల్లీకి, 1689 మెట్రిక్‌టన్నులు హర్యానాకు, 98 మెట్రిక్ టన్నులు రాజస్థాన్‌కు, 943 మెట్రిక్ టన్నులు కర్ణాటకకు, 320 మెట్రక్ టన్నులు ఉత్తరాఖండ్‌కు, 769 మెట్రిక్ టన్నులు తమిళనాడుకు, 571 మెట్రిక్ టన్నులు ఆంధ్రప్రదేశ్‌కు, 153 మెట్రిక్‌టన్నులు పంజాబ్కు ,246 మెట్రిక్‌టన్నులు కేరళకు, 772 మెట్రిక్ టన్నులు తెలంగాణకు రవాణా చేయడం జరిగింది.
Posted On:
22 MAY 2021 4:02PM by PIB Hyderabad
అన్ని రకాల అడ్డంకులను అధిగమిస్తూ, వినూత్న పరిష్కారాలతో భారతీయ రైల్వే, దేశంలోని వివిధ ప్రాంతాలకు ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ సరఫరాను కొనసాగించడం ద్వారా వివిధ రాష్ట్రాలకు ఉపశమనం కలిగిస్తున్నది. ఇప్పటివరకు భారతీయ రైల్వే సుమారు 14,500 మెట్రిక్ టన్నుల ద్రవరూప ఆక్సిజన్‌ను 884కుపైటా టాంకర్లద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేసింది.
ఇప్పటివరకూ 224 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లు ద్రవరూప వైద్య ఆక్సిజన్‌ను గమ్యస్థానాలకు చేర్చి వివిధ రాష్ట్రాలకు ఉపశమనం కలిగించాయి.
ఈ ప్రకటన విడుదలయ్యే సమయానకి ఆక్సిజన్ నింపుకున్న 8 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు 563 మెట్రిక్‌టన్నులకు పైగా ద్రవరూప మెడికల్ ఆక్సిజన్‌ను 35 ట్యాంకర్లలో తరలిస్తున్నాయి.
ప్రస్తుతం ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు రోజూ 800 మెట్రిక్ టన్నులకు పైగా ద్రవరూప మెడికల్ ఆక్సిజన్‌ను దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నాయి.
ద్రవరూప వైద్య ఆక్సిజన్(ఎల్.ఎం.ఓ) సరఫరా కోరుతున్న రాష్ట్రాలకు వీలైనంత తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ ఎల్.ఎం.ఓ ను అందించేందుకు భారతీయ రైల్వే గట్టి కృషి చేస్తున్నది.
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ల ద్వారా ఆక్సిజన్ 13 రాష్ట్రాలకు చేరి ఉపశమనం కలిగించింది. ఈ 13 రాష్ట్రాలలో ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణా, పంజాబ్ , కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.
ఈ ప్రకటన విడుదలయ్యే సమయానికి మహారాష్ట్రకు 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ చేరవేయడం జరిగింది. అలాగే ఉత్తరప్రదేశ్‌కు సుమారు 3,463 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్‌కు 566 మెట్రిక్ టన్నులు , ఢిల్లీకి 4,278 మెట్రిక్ టన్నులు, హర్యానాకు 1698 మెట్రిక్‌టన్నులు, రాజస్థాన్ కు 98 మెట్రిక్ ట్నులు, కర్ణాటకకు 943 మెట్రిక్ టన్నులు, ఉత్తరాఖండ్‌కు 320 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 769 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 571 మెట్రిక్ టన్నులు, పంజాబ్‌కు 153 మెట్రిక్ టన్నులు, కేరళకు 246 మెట్రిక్ టన్నులు, తెలంగాణాకు 772 మెట్రిక్ టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్‌ను చేరవేయడం జరిగింది.
రైల్వే విభాగం ఆక్సిజన్ సరఫరా ప్రాంతాలకు సంబంధించి వివిధ రూట్‌మ్యాప్‌లను రూపొందించింది. ఆయా రాష్ట్రాల అత్యవసర అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రైల్వే సిద్ధంగా ఉంది.. రాష్ట్రాలు ద్రవరూప వైద్య ఆక్సిజన్ సరఫరాకు రైల్వేశాఖకు ట్యాంకర్లను అందజేస్తాయి.
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు 28 రోజుల క్రితం అంటే ఏప్రిల్ 24న మహారాష్ట్రనుంచి 126 మెట్రిక్ టన్నుల లోడ్‌తో ప్రయాణం ప్రారంభించాయి. అప్పటి నుంచి వివిధ రాష్ట్రాలకు ద్రవరూప ఆక్సిజన్‌ను రైల్వే శాఖ రవాణా చేస్తోంది.
దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ద్రవరూప ఆక్సిజన్‌ను సేకరించి వివిధ రాష్ట్రాలకు రైల్వే తరలిస్తోంది . పశ్చిమాన హాపా, బరోడా, ముంద్రా నుంచి, తూర్పున రూర్కేలా, దుర్గాపూరర్, టాటానగర్, అంగుల్‌నుంచి ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణా, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సంక్లిష్ట మార్గాలలో సైతం వీటిని తరలిస్తోంది.
ఆక్సిజన్ సరఫరా వీలైనంత తక్కువ సమయంలో గమ్యస్థానం చేరేలా చేసేందుకు రైల్వే కొత్త ప్రమాణాలను పాటిస్తోంది. అలాగే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను పంపడంలో మున్నెన్నడూ లేనంతటి లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నది. ఆక్సిజన్ రవాణా చేసే కీలక రైళ్ల సగటు వేగం చాలా సందర్భాలలో సుదూర ప్రాంతాలకు వెళ్లేసందర్భంలో గంటకు 55 కిలోమీటర్లకు మించిన వేగంతో వెళుతున్నాయి. అత్యంత సత్వరం ఆక్సిజన్‌ను గమ్యస్థానం చేర్చేందుకు గ్రీన్‌కారిడార్‌లో వీటిని నడుపుతున్నారు. వివిధ ప్రాంతాలలోని నిర్వహణా బృందాలు ఇందుకు నిరంతరం పనిచేస్తున్నాయి. ఆక్సిజన్ వీలైనంత వేగంగా తక్కువ సమయంలో గమ్యస్థానం చేర్చేలా చేసేందుకు వీరు కృషి చేస్తున్నారు. సాంకేతికంగా ఈ రైళ్ల నిలుపుదల సమయాన్ని సిబ్బంది వివిధ సెక్షన్లలో మారడానికి పట్టే సమయాన్ని ఒక నిమిషానికి తగ్గించారు
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు దూసుకుపోయేందుకు అత్యంత జాగరూకతతో ట్రాక్‌లను పరిశీలిస్తున్నారు.
అదే సమయంలో ఇతర సరకు రవాణా కార్యకలాపాల వేగం తగ్గకుండా కూడా చూస్తున్నారు.
ఆక్సిజన్ సరఫరా చాలా డైనమిక్ వ్యవహారం. ఇందుకు సంబంధించిన గణాంకాలను ఎప్పటికప్పుడు తాజా గా ఉంచాల్ఇ ఉంటుంది. ఈరోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత మరింత ద్రవరూప ఆక్సిజన్‌తో, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
***
(Release ID: 1720996)
Visitor Counter : 228