మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

పన్నెండో తరగతి పరీక్షలు, ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణపై చర్చించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో రేపు ఉన్నతస్థాయి సమావేశం


పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్ర విద్యాశాఖమంత్రి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాస్తారు

ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు.

Posted On: 22 MAY 2021 1:21PM by PIB Hyderabad

దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యాశాఖ మంత్రులు, విద్యాశాఖ కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల పరీక్షల బోర్డు చైర్పర్సన్లు, సంబంధిత అధికారులతో రేపు ఉన్నతస్థాయి వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పన్నెండో తరగతి పరీక్షలు, ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశ పరీక్షల ప్రతిపాదనలపై చర్చిస్తారు.

ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్', కేంద్ర మహిళా, శిశుశాఖ మంత్రి శ్రీమతి. స్మృతి జుబిన్ ఇరానీ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ ఈ సమావేశంలో పాల్గొంటారు.

విద్యార్థులు, టీచర్ల భద్రత, సంక్షేమాన్నిదృష్టిలో పెట్టుకొని  పరీక్షల నిర్వహణకు సంబంధించిన అవకాశాల కోసం  పాఠశాల విద్యా మరియు అక్షరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వశాఖ, సీబీఎస్ఈ అన్వేషిస్తున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. పరీక్షల తేదీలను ఖరారు చేసే విషయమై  విద్యాసంస్థలతో ఉన్నత విద్యాశాఖ కూడా చర్చలు జరుపుతోందని చెప్పారు.

కోవిడ్ 19 మహమ్మారి విద్యారంగంతోపాటు మరెన్నో రంగాలను ప్రభావితం చేసిందని, విద్యారంగంలో ముఖ్యంగా బోర్డు పరీక్షలు, ప్రవేశ పరీక్షలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల విద్యాబోర్డులు, సీబీఎస్ఈ, ఐసీఎస్ బోర్డులు 2021 విద్యాసంవత్సరపు పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేసుకున్నాయన్నారు. అదేవిధంగా ప్రొఫెనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతోపాటు జాతీయస్థాయి పరీక్షలు నిర్వహించే వివిధ సంస్థలు కూడా పరీక్షలను వాయిదా వేసుకున్నాయని లేఖలో పేర్కొన్నారు.


పన్నెండో తరగతి పరీక్షల నిర్వహణ దేశవ్యాప్తంగా స్టేట్ బోర్డ్ పరీక్షలు మరియు ఇతర ప్రవేశ పరీక్షలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల్లో అనిశ్చితిని తగ్గించేలా నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారుల నుంచి సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి అభిప్రాయాలను తీసుకోవడం అవసరమని మంత్రి లేఖలో పేర్కొన్నారు.

అంతేకాకుండా అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లతోపాటు ఇతరుల నుంచి కూడా శ్రీ రమేష్ పోఖ్రియాల్ ట్విటర్ ద్వారా అభిప్రాయాలను కోరారు.

“తన ప్రియమైన విద్యార్థుల కెరీర్ను ప్రభావితం చేసే ఏ నిర్ణయం అయినా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సంబంధిత అధికారులతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని గౌరవ ప్రధానమంత్రి భావిస్తున్నారు. ఇదే విషయమై ఇటీవలే నేను పలు రాష్ట్రాల విద్యా కార్యదర్శులతో సమావేశం నిర్వహించాను.’’

- డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ @DrRPNishank, May 22, 2021

***



(Release ID: 1720903) Visitor Counter : 189