రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

లిక్విడ్ ఆక్సిజన్ (ఎల్‌వోఎక్స్‌) రవాణా అవసరం పెరగడం వల్ల "ప్రమాదకర కార్గో" రవాణా కోసం శిక్షణ పొందిన డ్రైవర్లకు పూల్‌ను ఏర్పాటు చేయాలని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు / యుటిలను కోరింది.

Posted On: 22 MAY 2021 12:24PM by PIB Hyderabad

ప్రస్తుత కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు లిక్విడ్ ఆక్సిజన్ (ఎల్‌వోఎక్స్‌)ను త్వరగా మరియు సజావుగా రవాణా చేయడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించబడింది. ఈ విషయంలో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రస్తుత నిబంధనల ప్రకారం మరియు సిఎంవిఆర్‌, 1989కు అనుగుణంగా, తగిన శిక్షణ పొందిన మరియు 'ప్రమాదకర కార్గో' లైసెన్స్ కలిగిన శిక్షణ పొందిన డ్రైవర్లకు మాత్రమే ఆక్సిజన్ (ఎల్‌వోఎక్స్‌) ట్రక్కుల్లో లిక్విడ్‌ను తరలించడానికి అనుమతి ఉంది. అందువల్ల, 24x7 ఆపరేషన్లను దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికే ఉన్న డ్రైవర్లను భర్తీ చేయగల శిక్షణ పొందిన డ్రైవర్ల యొక్క సమూహన్ని అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.

ఈ నేపథ్యంలో శిక్షణ పొందిన డ్రైవర్ల సమూహాన్ని సృష్టించాలని రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాలకు మంత్రిత్వ శాఖ సూచించింది. అలాంటి 500 మంది శిక్షణ పొందిన డ్రైవర్లను వెంటనే అందుబాటులో ఉంచాలని, రాబోయే రెండు నెలల్లో ఆ డ్రైవర్ల సంఖ్యను 2500 కు పెంచాలని సూచించారు.

అలాగే, అదనపు పూల్‌ను సృష్టించడానికి అనుసరించే వ్యూహంలో భాగంగా, ఈ క్రింది మార్గదర్శకాలు సూచించబడ్డాయి: -

a. ఒక చిన్న ప్రోగ్రామ్ మరియు అప్రెంటిస్‌షిప్ ద్వారా ప్రమాదకర రసాయనాలను మరియు ఎల్‌ఎంవోను నిర్వహించడానికి శిక్షణతో త్వరగా నైపుణ్యం కలిగిన డ్రైవర్ల ఎంపిక,

b. ప్రమాదకర రసాయనాలలో నైపుణ్యం కలిగిన హెచ్‌ఎంవి లైసెన్స్ హోల్డర్లు మరియు చిన్న (3/4 రోజులు) ప్రోగ్రామ్ మరియు అప్రెంటిస్‌షిప్ ద్వారా ఎల్‌ఎంవో నిర్వహణ.

లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (ఎల్‌ఎస్‌ఎస్‌సి), ఇండియన్ కెమికల్ కౌన్సిల్ (ఐసిసి), నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డిసి) & మెడికల్ ఆక్సిజన్ తయారీదారుల సహాయంతో ఇటువంటి శిక్షణా మాడ్యూల్స్ రూపొందించబడ్డాయి.

ఈ శిక్షణా కార్యక్రమాలను ఎంచుకోవడానికి హెచ్‌ఎంవి / ప్రమాదకర రసాయన లైసెన్స్ ఉన్న కొంతమంది స్థానిక డ్రైవర్లను సిఫారసు చేయాలని రాష్ట్రాలు / యుటిలు అభ్యర్థించబడ్డాయి.

అలాగే ఈ నైపుణ్యం కలిగిన డ్రైవర్ల జాబితా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంచబడుతుంది మరియు ఈ శిక్షణ పొందిన డ్రైవర్ల సేవలను క్రయోజెనిక్ ఎల్‌ఎంఓ ట్యాంకర్లను తీసుకెళ్లడానికి ఉపయోగించుకోవచ్చు.

కోవిడ్ సోకినట్లు గుర్తించినట్లయితే ఎల్‌వోఎక్స్‌ ట్యాంకర్ డ్రైవర్లకు ప్రత్యేక కోవిడ్ టీకా డ్రైవ్ మరియు ఆసుపత్రులలో ప్రవేశం మరియు చికిత్సలో ప్రాధాన్యత ఇవ్వవచ్చని సూచించబడింది.

 

***



(Release ID: 1720853) Visitor Counter : 201