రైల్వే మంత్రిత్వ శాఖ

కోవిడ్ మహమ్మారి విసురుతున్న సవాళ్లలో కూడా రైల్వే చక్రాలు పురోగతివైపు దూసుకెళ్తున్నాయి. బొగ్గు రవాణాలో గత సంవత్సరంతో పోలిస్తే 54 శాతం, 2019–20తో పోలిస్తే 1.4శాతం పురోగతిని కనబర్చాయి.


లోడింగ్ పరంగానే కాకుండా ఆదాయాల పరంగా కూడా భారతీయ రైల్వే అత్యధిక సరుకు రవాణా గణాంకాలను నమోదు చేస్తూనే ఉంది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే ఇప్పటి వరకు మొత్తం 185.04 మిలియన్ టన్నులు సరుకు రవాణా చేసింది. ఇది 2019 సంవత్సరంతో పోలిస్తే.. 10.37 శాతం అధికం. 2019లో ఈ సమయానికి 167.66 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసింది.


2020లో ఇదే సమయానికి 116.1 మెట్రిక్ టన్నులు లోడింగ్ గణాంకాలను నమోదు చేసింది. దీనితో పోల్చిన ఈ ఏడాది లోడింగ్ 59.38 శాతం ఎక్కువ.

ఈ ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే సరుకు రవాణా చేయడం ద్వారా రూ.18542.8 కోట్లు ఆదాయం పొందింది. 2019తో పోలిస్తే ఇది 4.92 శాతం అధికం. 2019లో రూ.17674 కోట్లు ఆర్జించింది. 2020తో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 75.93 శాతం ఎక్కువ. 2020లో రూ.10540.1 కోట్ల ఆదాయాన్ని పొందింది.

సెప్టెంబర్ 20 నుండి మే 21 వరకు వరుసగా వరుసగా తొమ్మిది నెలల్లో అత్యధికంగా లోడింగ్ గణాంకాలు నమోదవుఉన్నాయి.

Posted On: 21 MAY 2021 5:57PM by PIB Hyderabad

కోవిడ్ సవాళ్లు ఉన్నప్పటికీ  భారత రైల్వే 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో సరుకు రవాణా చేస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే 2020, 2019 సంవత్సరాల లోడింగ్ గణాంకాలను అధిగమించింది. 2021లో 185.04 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేయగా.. 2020లో 116.1 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసింది. ఇక 2019లో  167.66 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసింది. గత సంవత్సరాలతో పోలిస్తే వరుసగా 59.38 శాతం, 10.37 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే సరుకు రవాణా ద్వారా రూ.18542.8 కోట్లు సంపాదించింది., సరుకు రవాణా ద్వారా 2019లో సంపాదించిన ఆదాయంతో పోలిస్తే ఇది 4.92% ఎక్కువ. ఇదే సమయానికి 2020( రూ.10540.1 కోట్లు) కంటే రూ.17647 కోట్లు ఎక్కువ (75.93శాతం) ఆదాయం పొందింది.

భారతీయ రైల్వే 2020 సెప్టెంబర్ నుండి 2021 మే వరకు వరుసగా 9 నెలల్లో అత్యధిక లోడింగ్ గణాంకాలను నమోదు చేసింది.

భారతీయ రైల్వేల సరుకు రవాణా లోడింగ్ 2019 & 2020 సంవత్సరపు లోడింగ్,  ఆదాయాలను మే 2021 నెలలో మిషన్ మోడ్‌లో దాటింది.

బొగ్గు రంగం నిరంతర వృద్ధిని చూపుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత రైల్వే 88.15 మెట్రిక్ బొగ్గును లోడ్ చేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 54.03% (57.23 మెట్రిక్ టన్నులు), 2019 లోడింగ్ (86.94 మెట్రిక్ టన్నులు) తో పోలిస్తే 1.39% ఎక్కువ.


మే 2021 నెలలో (ఇప్పటి వరకు) భారత రైల్వే లోడింగ్ 73.45 మిలియన్ టన్నులు. ఇది గత సంవత్సరం లోడింగ్ (50.66 మిలియన్ టన్నులు) తో పోలిస్తే 44.99% ఎక్కువ. ఇదే కాలానికి 2019 లోడింగ్ గణాంకాల (66.61 మెట్రిక్ టన్నులు) కంటే ఇది 10.27% ఎక్కువ.

భారతీయ రైల్వే రవాణా చేసిన 73.45 మిలియన్ టన్నుల్లో..  35.62 మిలియన్ టన్నుల బొగ్గు, 9.77 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం, 3.38 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 2.22 మిలియన్ టన్నుల ఎరువులు, 2.02 మిలియన్ టన్నుల మినరల్ ఆయిల్, క్లింకర్స్ మినహా 3.15 మిలియన్ టన్నుల సిమెంట్.

2021 మేలో భారత రైల్వే సరుకు రవాణా ద్వారా పొందిన ఆదాయం  రూ. 7368.00 కోట్లు. ఇది గత సంవత్సరపు ఆదాయంతో పోలిస్తే 62.20% ఎక్కువ. గత సంవత్సరం ఆదాయం రూ. 4541.21 కోట్లు. 2019 ఆదాయం రూ .7021.75 కోట్లతో పోలిస్తే ఇది 4.93% ఎక్కువ.

సరుకు రవాణాలో పురోగతి సాధించడానికి భారతీయ రైల్వే అనేక రాయితీలు, తగ్గింపులు కూడా ఇవ్వడం విశేషం.

సరుకు రవాణా రైళ్ల వేగం ఇప్పటికే ఉన్న నెట్‌వర్క్‌లో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసిందని చెప్పవచ్చు.

తన శక్తిసామర్థ్యాలను పెంచుకోవడానికి భారతీయ రైల్వే కోవిడ్ 19 పరిస్థితులను అన్నిరకాలుగా ఉపయోగించుకుంది. 

***



(Release ID: 1720764) Visitor Counter : 145