యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
2011 అర్జున అవార్డు గ్రహీత వి తేజస్విని బాయికి రూ .2 లక్షల సహాయం ఆమోదించిన క్రీడా మంత్రిత్వ శాఖ
Posted On:
21 MAY 2021 12:08PM by PIB Hyderabad
2011 లో అర్జున అవార్డును గెలుచుకున్న కర్ణాటకకు చెందిన వి తేజస్విని బాయికి రెండు లక్షల రూపాయలను సహాయంగా అందించాలన్న ప్రతిపాదనకు కేంద్ర యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 2010, 2014 ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన భారత జట్టులో తేజస్విని సభ్యురాలిగా ఉన్నారు.
కోవిడ్19 సమయంలో సమస్యలను ఎదుర్కొంటున్న మాజీ అంతర్జాతీయ క్రీడాకారులను ఆదుకోవడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మరియు యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వశాఖలు సంయుక్తంగా క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జాతీయ సంక్షేమ నిధి నుంచి ఆర్ధిక సహకారాన్ని అందిస్తున్నాయి.
మే 1 న తేజస్విని మరియు ఆమె భర్త కోవిడ్ -19 బారిన పడ్డారు. కొద్దిగా దగ్గు ఉన్నప్పటికీ ఇంట్లోనే తేజస్వినికోలుకుంటున్నారు. తేజస్విని భర్త నవీన్ మే 11 న వైరస్ బారిన పడి మరణించారు. “నవీన్ వయస్సు 30 సంవత్సరాలే. తన తండ్రి మరణం తరువాత ఆయన ఆందోళనకి గురయ్యాడు . భయం మరియు ఒత్తిడికి గురై ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ”అని తేజస్విని పేర్కొన్నారు. ఆర్థిక సహాయంపై స్పందించిన తేజస్విని "నేను దీనిని ఊహించలేదు. కానీ క్రీడా మంత్రిత్వ శాఖ, సాయ్ మరియు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్పందించి ఈ సహకారాన్ని అందించాయి. మాకు ఇలాంటి సహకారం అందడం ఇదే మొదటిసారి. మాలో చాలా మందికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. మాకు సరైన సహాయం లభిస్తే ఆనందంగా ఉంటుంది ”అని అన్నారు.
కర్ణాటక స్పోర్ట్స్ కమిటీ సభ్యుడు మరియు అర్జున అవార్డు గ్రహీత హొన్నప్ప గౌడ తనకు దీనిపై సమాచారం అందించారని తేజస్విని తెలిపారు. తనకు అందిన ఆర్థిక సహకారాన్ని పిల్లల భవిష్యత్తును ఉపయోగిస్తానని తేజస్విని అన్నారు . "నేను నా 5 నెలల శిశువును జాగ్రత్తగా చూసుకోవాలి. పాపకి తల్లినీతండ్రిని నేనే. నా బిడ్డ కోసం ఏదైనా చేయవలసి ఉంటుంది, ”ఆమె అన్నారు.
***
(Release ID: 1720601)
Visitor Counter : 171