ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కొవిడ్-19 నివారణకు సొంత వైద్యంపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హెచ్చరించారు

ఎండివోఎన్‌ఇఆర్ తన అధికారులు మరియు సిబ్బంది కోసం కొవిడ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది

Posted On: 20 MAY 2021 6:03PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డోనెర్), ఎంవోఎస్‌ పిఎంఓ, సిబ్బంది, ప్రజా మనోవేదనలు, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్షమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లోఅధికారులకు కోవిడ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహమ్మారికి సంబంధించిన ఆచరణాత్మక అంశాలను చర్చించడంతో పాటు, వీడియో ప్రదర్శన కూడా జరిగింది. కొవిడ్-19కు సొంతవైద్యంపై ఆయన హెచ్చరించాడు.

డోనర్ యొక్క అధికారులు మరియు సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆయన.. కొవిడ్ సోకిన వ్యక్తుల కోసం ప్రొఫెషనల్ మెడికల్ కన్సల్టేషన్ కోసం సలహా ఇచ్చారు. వాస్తవాలను తనిఖీ చేయకుండా కొవిడ్ నివారణలపై సమాచారాన్ని పంచుకోవద్దని ఆయన సామాన్యులను కోరారు.

ఎండివోఎన్‌ఇఆర్‌కు చెందిన 18 ప్లస్ ఆఫీసర్లు మరియు సిబ్బందికి త్వరితగతిన టీకాలు వేయడంపై ఒత్తిడి తెచ్చిన డాక్టర్ జితేంద్ర సింగ్.. ప్రజలకు అనుకూలమైన పద్ధతిలో మంత్రిత్వ శాఖలో ప్రత్యేక టీకా శిబిరాలను త్వరగా నిర్వహించాలని సీనియర్ అధికారులను ఆదేశించారు. ఇలాంటి శిబిరాల్లో కుటుంబ సభ్యులు, సిబ్బందికి టీకాలు వేసే అవకాశాలను అన్వేషించాలని ఆయన కోరారు. వైద్య మరియు పరిపాలనా చర్యలతో పాటు, కొవిడ్ కమ్యూనిటీ నిర్వహణ కూడా అంతే ముఖ్యమైనదని మరియు అవి సామరస్యంగా పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు. అవసరమైన మందులు మరియు ఆక్సిజన్‌ను అనవసరంగా నిల్వ చేయడం గురించి అవగాహన కల్పించాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు.

మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి కొవిడ్ యొక్క ప్రాబల్యం మరియు అవసరమైన సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల గురించి మొత్తం 8 ఈశాన్య రాష్ట్రాల నుండి రోజువారీ నివేదికలు తీసుకుంటున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో తగినంత ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని, కొత్త ప్లాంట్లను కూడా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.

కోవిడ్ సంబంధిత మౌలిక సదుపాయాలను భర్తీ చేయడంలో మరియు పెంచడంలో డోనర్ మరియు ఎన్‌ఇసి మంత్రిత్వ శాఖ చురుకైన చర్యలు తీసుకుంటున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. కొవిడ్ మరియు ఆరోగ్య సంబంధిత ప్రతిపాదనలను ప్రాధాన్యత ప్రాతిపదికన పంపమని ఆయన మరోసారి ఈశాన్య రాష్ట్రాలను కోరారు. కేంద్రంలో ఇటువంటి ప్రతిపాదనలను త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అడ్మిషన్ల సామర్థ్యం పెంపు, 100 పడకల ఆస్పత్రుల ఏర్పాటుకు సంబంధించి మణిపూర్ మరియు మిజోరాం నుండి వచ్చిన తాజా ప్రతిపాదనలకు మంత్రిత్వ శాఖ త్వరలోనే సమాధానం ఇస్తుందని చెప్పారు.

కోవిడ్ -19 వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడటానికి గ్యాప్ ఫండింగ్ కోసం గత మార్చిలో ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రూ .25 కోట్ల యునైటెడ్ ఫండ్‌ను సమర్థవంతంగా ఉపయోగించారని అనేక ఆసుపత్రులలో కీలకమైన ఆరోగ్య పరికరాల కొనుగోలుకు అది వరంగా మారిందని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు.

మాస్క్‌లు, భౌతిక దూరం, చేతుల పరిశుభ్రత వంటి కొవిడ్‌ భద్రతా చర్యల గురించి అధికారులు మరియు సిబ్బందికి ఎయిమ్స్ సీనియర్ రెసిడెంట్‌ డాక్టర్ లక్ష్మణ్ వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. టీకా రకం గురించి అనవసరంగా చింతించకుండా వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని డాక్టర్ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. వైరస్‌ సంక్రమణనుండి అది రక్షణ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

***(Release ID: 1720399) Visitor Counter : 40