పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ట్రివేండ్రం విమానాశ్రయం నుంచి నిరాటకంగా వైద్య సంబంధిత అత్యవసర పరికరాల బట్వాడా కొనసాగింపు
మొత్తం 300 ఆక్సిజన్ కాన్సనట్రేటర్లు, 180 ఆక్సిజన్ సిలెండర్ల రవాణా
Posted On:
20 MAY 2021 4:07PM by PIB Hyderabad
వైద్య సంబంధిత అత్యవసర పరికరాల నిరాటంక బట్వాడాకు సౌకర్యం కల్పించడం ద్వారా కోవిడ్ -19పై పోరాటంలో ట్రివేండ్రం విమానాశ్రయం, దాని ఫ్రంట్ లైన్ కరోనా యోధులు చురుకైన పాత్రను పోషిస్తున్నారు.
ట్రివేండ్రం విమానాశ్రయం ద్వారా 19 మే 2021వరకు వివిధ ఎయిర్‌లైన్ల ద్వారా మొత్తం 313 పెట్టెల (9.76 మెట్రిక్ టన్నుల) కోవిడ్ -19 వాక్సిన్‌లను రవాణా చేశారు. ఆక్సిజన్ సంక్షోభాన్ని అధిగమించేందుకు 300 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను, 180 ఆక్సిజన్ సిలెండర్లను సి 17, ఎఎన్ 32 వంటి భారతీయ వైమానిక దళ విమానాలు 19 మే 2021 వరకు ట్రివేండ్రం ద్వారా కేరళలో బట్వాడా చేశాయి.
ఇవే కాకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను అనుసరించి ట్రివేండ్రం విమానాశ్రయం ప్రయాణీకుల సురక్షితంగా ప్రయాణం కోసం కోవిడ్ 19 సంబంధిత మార్గదర్శకాలను, ప్రోటోకాళ్ళను అమలు చేస్తోంది.కోవిడ్‌కు తగిన ప్రవర్తనను అనుసరించమని, గుంపులను తగ్గించేందుకు దఫాలవారీగా సమయాన్ని పాటించవలసిందిగా ప్రయాణీకులకు, భాగస్వాములకు, పర్యాటకులకు, సిబ్బంది తదితరులందరికీ విమానాశ్రయ సిబ్బంది నిరంతర విజ్ఞప్తులు చేస్తోంది. కోవిడ్ కు తగిన ప్రవర్తన గురించి చైతన్యం సృష్టించేందుకు, ప్రయాణీకుల భద్రత కోసం, విమానాశ్రయంలోని టెర్మినళ్ళ వద్ద వివిధ ఎలక్ట్రానిక్, శాశ్వత డిస్ప్లేల ద్వారా సందేశాన్ని అందిస్తోంది.
అన్ని విమానాశ్రయాలు తమకు సాధ్యమైన ప్రతి యుద్ధంలోనూ పాల్గొని, ప్రయత్నిస్తున్నాయి. ట్రివేండ్రం విమానాశ్రయం ఎఎఐ ఉద్యోగులు, ఇతర భాగస్వాముల కోసం రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అన్ని రక్షణ చర్యలనూ పరిగణనలోకి తీసుకుని కోవిడ్ -19 వాక్సినేషన్ శిబిరాన్ని నిర్వహించింది.
***
(Release ID: 1720392)
Visitor Counter : 205