ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

శ్వాసను నిలిపి ఉంచే వ్యాయామం చేయండి, మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా చేయండి


శ్వాసను నింపి ఉంచగలిగే సమయం తగ్గితే - అది ముందస్తు హెచ్చరిక గా గుర్తించాలి

Posted On: 19 MAY 2021 12:52PM by PIB Hyderabad

కోవిడ్-19 యొక్క రెండవ దశలో అనుబంధ ఆక్సిజన్ కు డిమాండ్  భారీగా పెరిగింది.   ఈ దశలో శ్వాస తీసుకోలేకపోవడం సర్వ సాధారణ లక్షణంగా గమనించడం జరిగిందనీ, ఫలితంగా ఆక్సిజన్ అవసరం భారీ పెరగడానికి దారితీసిందనీ, నీతీ ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం), డాక్టర్ వి.కె. పాల్, గమనించారు.   90 శాతం కోవిడ్-19 రోగులు కొంత ఊపిరితిత్తుల ప్రమేయాన్ని అనుభవిస్తున్నారనీ, అయితే ఇది వైద్యపరంగా ముఖ్యమైన విషయం కాదనీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ సర్జరీ చైర్మన్, మేదాంత వ్యవస్థాపకుడు, ఊపిరితిత్తుల సంరక్షణ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ, డాక్టర్ అరవింద్ కుమార్, తెలియజేశారు.   10 నుండి 12 శాతం మంది రోగుల్లో న్యుమోనియా లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. ఫలితంగా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కు గురై,  అల్వియోలీ అనే, శ్వాసకోశం లోని  చిన్న గాలి సంచులు ఎర్రబడతాయి.   అప్పుడు, ఊపిరి అందక, మరింత తీవ్రమైన స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే, కోవిడ్-19 రోగులలో చాలా తక్కువ మందికి ఆక్సిజన్ మద్దతు అవసరం అవుతుంది. 

రోగుల ఆక్సిజన్ అవసరాన్ని తగ్గించడానికి మరియు వారి పరిస్థితిని పర్యవేక్షించడంలో సహాయపడే సాంకేతిక పరిజ్ఞానం అయిన శ్వాసను నింపి ఉంచే వ్యాయామం చేయవలసిన అవసరం ఉంది. 

శ్వాస ను నిలిపి ఉంచే ప్రక్రియ ఎలా సహాయపడుతుంది

తేలికపాటి లక్షణాలు ఉన్న రోగులకు,  ఈ వ్యాయామం ఎంతో మేలు చేస్తుందని, డాక్టర్ అరవింద్ చెప్పారు.  ఈ రోగులు వ్యాయామం చేస్తే, వారి అనుబంధ ఆక్సిజన్ అవసరమయ్యే అవకాశాలు తగ్గుతాయి.  రోగి యొక్క పరిస్థితిని పర్యవేక్షించడానికి ఈ వ్యాయామాన్ని ఒక పరీక్షగా ఉపయోగించవచ్చు.  శ్వాస నిలిపి ఉంచే సమయం తగ్గుతున్నట్లు గమనిస్తే, అది ముందస్తు హెచ్చరిక గా గుర్తించి, రోగులు, వెంటనే, తమ వైద్యుడిని సంప్రదించాలి.  అదేవిధంగా, ఒక రోగి, తాను శ్వాస నిలిపి ఉంచే సమయాన్ని క్రమంగా పెంచుకోగలిగితే, అది సానుకూల సంకేతంగా భావించవచ్చు.

ఆసుపత్రిలో చేరిన రోగులు మరియు ఇంట్లోనే ఆక్సిజన్‌ సౌకర్యాన్ని వినియోగించుకునే వారు కూడా, వారి వారి వైద్యులతో సంప్రదించి ఈ  వ్యాయామం చేయవచ్చు.  ఇది వారి ఆక్సిజన్ అవసరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆరోగ్యవంతులు కూడా శ్వాస నిలిపి ఉంచే ప్రక్రియను సాధన చేయవచ్చు.

శ్వాస నిలిపి ఉంచే వ్యాయామాన్ని ఎలా చేయాలి

*     నిటారుగా కూర్చుని, మీ చేతులను మీ తొడలపై ఉంచండి. 

*    మీ నోరు తెరిచి, వీలైనంత గాలిని లోపలి పీల్చి, ఛాతీని నింపండి.

*     మీ పెదాలను గట్టిగా మూసివేయండి. 

*     మీకు వీలైనంత ఎక్కువ సేపు, మీ శ్వాసను నిలిపి ఉంచండి. 

*     మీరు ఎన్ని సెకన్ల పాటు మీ శ్వాసను నిలిపి ఉంచగలరో తనిఖీ చేయండి. 

రోగులు గంటకు ఒకసారి ఈ విధానాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తే, క్రమంగా శ్వాస ను నిలిపి ఉంచగలిగే సమయం పెరుగుతుంది.  25 సెకన్లు మరియు అంతకంటే ఎక్కువ సేపు  శ్వాస నిలిపి ఉంచగలిగితే, వారు సురక్షితంగా ఉన్నట్లు భావించవచ్చు.  ఎక్కువ కష్టపడకుండా, ఈ ప్రక్రియలో అలసిపోకుండా జాగ్రత్త వహించాలి.

సంక్రమణను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం

కోవిడ్-19 మన ఊపిరితిత్తులపై అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుందన్న విషయం మనకు తెలుసు; దీనివల్ల ఊపిరి అందకపోవడం లేదా ఆక్సిజన్ స్థాయి తగ్గడం జరుగుతుంది.

మొదటి దశలో జ్వరం, దగ్గు, చాలా సాధారణ లక్షణాలు గా ఉన్నాయని,  అని డాక్టర్ అరవింద్ వివరించారు.  రెండవ దశలో, గొంతు నొప్పి, ముక్కు కారటం, కళ్ళు ఎర్రబడటం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, దద్దుర్లు, వికారం, వాంతులు, విరేచనాలు వంటి వివిధ రకాల లక్షణాలు కనిపిస్తాయి; అదేవిధంగా రోగి మూడు-నాలుగు రోజుల తర్వాత జ్వరం అనుభవిస్తాడు.  అప్పుడు రోగి కోవిడ్ పరీక్ష కోసం వెళతాడు, కాగా, నిర్ధారణకు కొంత సమయం పడుతుంది.  ఆ తర్వాత, కోవిడ్-19 నిర్ధారణ అయ్యే సమయానికి, సంక్రమణ సోకి ఐదారు రోజులు అవుతుంది, అదే సమయానికి, కొన్ని సందర్భాల్లో, ఊపిరితిత్తులు కూడా ప్రభావితమై ఉంటాయి.

కోవిడ్-19 సమయంలో ఊపిరితిత్తుల ప్రమేయాన్ని నిర్ణయించే కారకాలలో వయస్సు, బరువు, ఇప్పటికే ఉన్న ఊపిరితిత్తుల పరిస్థితి, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, హెచ్.ఐ.వి. సంక్రమణ, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, ధూమపాన అలవాట్లు, క్యాన్సర్ చికిత్స చరిత్ర,  స్టెరాయిడ్ల (ఉత్ప్రేరకాలు) వాడకం వంటివి ఉన్నాయని, డాక్టర్ అరవింద్, తెలియజేశారు. 

 

*****



(Release ID: 1720120) Visitor Counter : 3305