రైల్వే మంత్రిత్వ శాఖ
విస్తృత సేవలు అందిస్తున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 727కు పైగా ట్యాంకర్ల ద్వారా 11800 మెట్రిక్ టన్నుల
లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ ఎం ఓ) బట్వాడా చేసిన ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు
ఇప్పటివరకు 196 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు తమకు నిర్దేశించిన ప్రయాణాలు పూర్తిచేశాయి
ఇప్పుడు ప్రతి రోజూ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు జాతిజనుల కోసం దాదాపు 800 మెట్రిక్ టన్నుల వైద్య చికిత్సకు అవసరమైన (ఎల్ ఎం ఓ) ఆక్సిజన్ ను బట్వాడా చేస్తున్నాయి
ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ద్వారా 13 రాష్ట్రాలకు ఆక్సిజన్ సహాయం అందుతోంది. ఆ రాష్ట్రాలు: ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ , ఆంద్ర ప్రదేశ్, రాజస్థాన్ , తమిళనాడు, హరియాణా, తెలంగాణ, పంజాబ్ , కేరళ , ఢిల్లీ & ఉత్తరప్రదేశ్
మహారాష్ట్రలో 521 మెట్రిక్ టన్నులు, ఉత్తరప్రదేశ్ లో దాదాపు 2979 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్ లో 498 మెట్రిక్ టన్నులు, హరియాణాలో 1507 మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 653 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్ లో 97 మెట్రిక్ టన్నులు , ఉత్తరాఖండ్ లో 200 మెట్రిక్ టన్నులు, తమిళనాడులో 440 మెట్రిక్ టన్నులు, ఆంద్ర ప్రదేశ్ లో 227 మెట
Posted On:
19 MAY 2021 5:45PM by PIB Hyderabad
అన్ని అడ్డంకులను అధిగమించి కొత్త పరిష్కారాలను కనుగొంటూ ఎల్ఎంఓను అందజేస్తూ భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ఊరటను కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 727కు పైగా ట్యాంకర్ల ద్వారా 11800 మెట్రిక్ టన్నుల
లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ ఎం ఓ) ను భారతీయ రైల్వేలు అందజేయశాయి.
ఇప్పటివరకు 196 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు తమకు నిర్దేశించిన ప్రయాణాలు పూర్తిచేసి వివిధ రాష్రాలకు ఊరట కలిగించాయి.
ఈ ప్రకటన విడుదల చేసే సమయానికి 11 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు వైద్య చికిత్సకు అవసరమైన 717 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ (ఎల్ ఎం ఓ) నింపిన 43 ట్యాంకర్లతో గమ్యస్థానాల వైపు పరుగులు తీస్తున్నాయి.
గత కొద్దిరోజులుగా ప్రతి రోజూ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు జాతిజనుల కోసం దాదాపు 800 మెట్రిక్ టన్నుల ఎల్ ఎం ఓ ను
బట్వాడా చేస్తున్నాయి
ఆక్సిజన్ సరఫరా చేయవలసిందిగా కోరిన రాష్ట్రాలకు ఎలాంటి జాప్యం లేకుండా అనతికాలంలోనే వీలయినంత ఎక్కువ ఎల్ ఎం ఓ పంపిణీ చేయాలన్నది భారతీయ రైల్వేల ప్రయత్నం
ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ద్వారా ఆక్సిజన్ సహాయం అందుతోన్న 13 రాష్ట్రాలు: ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ , ఆంద్ర ప్రదేశ్, రాజస్థాన్ , తమిళనాడు, హరియాణా, తెలంగాణ, పంజాబ్ , కేరళ , ఢిల్లీ & ఉత్తరప్రదేశ్
ఈ ప్రకటన విడుదల చేసే సమయానికి, మహారాష్ట్రలో 521 మెట్రిక్ టన్నులు, ఉత్తరప్రదేశ్ లో దాదాపు 2979 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్ లో 498 మెట్రిక్ టన్నులు, హరియాణాలో 1507 మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 653 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్ లో 97 మెట్రిక్ టన్నులు , ఉత్తరాఖండ్ లో 200 మెట్రిక్ టన్నులు, తమిళనాడులో 440 మెట్రిక్ టన్నులు, ఆంద్ర ప్రదేశ్ లో 227 మెట్రిక్ టన్నులు, పంజాబ్ లో 81 మెట్రిక్ టన్నులు, కేరళలో 117 మెట్రిక్ టన్నులు మరియు ఢిల్లీలో 3978 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్ ను ఇప్పటివరకు దించడం జరిగింది.
ఆక్సిజన్ సరఫరా చేయడం, ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడపడం నిరంతరం మారే చైతన్యవంతమైన పని. ఇప్పుడు కూడా ఆక్సిజన్ లోడింగ్ జరుగుతూనే ఉంటుంది. మరిన్ని ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ల ప్రయాణం రాత్రి పొద్దుపోయాక మొదలవుతుంది.
ఆక్సిజన్ సరఫరా ప్రదేశాలతో రైల్వేలు వివిధ రూట్లను రూపొందించాయి. తద్వారా రాష్ట్రాలలో ఉన్నట్టుండి ఏర్పడే అవసరాలను తీర్చడానికి రైల్వేలు సన్నద్ధంగా ఉంటాయి. వైద్య చికిత్సకు అవసరమైన ఆక్సిజన్ తేవడానికి అవసరమైన ట్యాంకర్లను రాష్ట్రాలు భారతీయ రైల్వేలకు సమకూరుస్తాయి.
****
(Release ID: 1720114)
Visitor Counter : 208