భారత పోటీ ప్రోత్సాహక సంఘం

అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ యొక్క అదనపు 25 శాతం వాటాను అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ కొనుగోలు చేయడానికి సీసీఐ ఆమోదం

Posted On: 18 MAY 2021 5:56PM by PIB Hyderabad

అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ యొక్క అదనపు 25 శాతం వాటాను అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ కొనుగోలు చేసేందుకు గాను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత కలయిక అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (అక్వైరర్) చేత అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ (టార్గెట్) యొక్క అదనపు 25 శాతం వాటాను పొందేందుకు వీలు క‌ల్పిస్తుంది. అక్వైరర్ దేశం ఒక ప్రైవేట్ మల్టీ-పోర్ట్ ఆపరేటర్. ఇది ప్రస్తుతం గుజరాత్, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,  ఒడిశా తదిత‌ర‌ ఆరు సముద్రతీర‌ రాష్ట్రాలలో 11 ఓడ రేవులలో భాగ‌స్వామ్యాన్ని క‌లిగి ఉంది. ఇది ఇప్పటికే టార్గెట్ యొక్క 75 శాతం వాటాను కలిగి ఉంది. ప్రతిపాదిత కలయిక ఫలితంగా అక్వైరర్ 100% వాటాను, టార్గెట్ యొక్క ఏకైక నియంత్రణను కలిగి ఉండ‌నుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్డ్-ఆపరేట్-షేర్-ట్రాన్స్ఫర్ రాయితీ విధానం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణపట్నం వద్ద ఉన్న అన్ని వాతావరణ, లోతైన నీటి బహుళ ప్రయోజన నౌకాశ్రయం యొక్క డెవలపర్ మరియు ఆపరేటర్‌గా టార్గెట్ నిమగ్నమై ఉంది. తాజా ప్ర‌తిపాద‌న‌కు
సంబంధించిన వివరణాత్మక ఆర్డర్ త్వ‌ర‌లో వెలువ‌డాల్సి ఉంది.
                       
                               

***



(Release ID: 1719789) Visitor Counter : 122