భారత పోటీ ప్రోత్సాహక సంఘం

"యస్ అసెట్ మేనేజ్‌మెంట్‌ (ఇండియా) లిమిటెడ్", "యస్ ట్రస్టీ లిమిటెడ్‌"ను "జీపీఎల్ ఫైనాన్స్ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌" కొనుగోలు చేయడానికి సీసీఐ ఆమోదం

Posted On: 18 MAY 2021 6:03PM by PIB Hyderabad

"యస్ అసెట్ మేనేజ్‌మెంట్‌ (ఇండియా) లిమిటెడ్" (యస్‌ ఏఎంసీ), "యస్ ట్రస్టీ లిమిటెడ్‌" (యస్‌ ట్రస్టీ)ని "జీపీఎల్ ఫైనాన్స్ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌" ‍(జీపీఎల్‌) కొనుగోలు చేయడానికి "కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా" (‍సీసీఐ) ఆమోదించింది.

    ఈ ఒప్పందం ద్వారా; యస్‌ ఏఎంసీ, యస్‌ ట్రస్టీకి చెందిన 100 శాతం వాటాలు జీపీఎల్‌కు దక్కుతాయి. ఈ కొనుగోళ్ల ద్వారా, "యస్‌ మ్యూచువల్ ఫండ్‌"ను కూడా దక్కించుకుని, దాని ఏకైక స్పాన్సర్‌గా అవతరిస్తుంది.
 
    ఖాతాదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించని, వ్యవస్థాపరమైన ప్రాముఖ్యత లేని, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థగా రిజర్వ్‌ బ్యాంకు వద్ద జీపీఎల్‌ నమోదైంది. పెట్టుబడులు పెట్టే సంస్థగా దీనిని వర్గీకరించారు. ప్రధానంగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం, "వైట్ ఓక్ క్యాపిటల్‌"కు సేవలు అందించే వ్యాపారంలో ఈ సంస్థ ఉంది. వైట్ ఓక్ సమూహ సంస్థల్లో జీపీఎల్‌ కూడా ఒకటి. వైట్ ఓక్ సమూహ సంస్థలను శ్రీ ప్రశాంత్ ఖేమ్కా స్థాపించారు. పెట్టుబడుల నిర్వహణ, పెట్టుబడుల సలహాలను ఈ వ్యాపార సమూహం అందిస్తుంది.

    యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ సమూహ సంస్థల్లో యస్‌ ఏఎంసీ ఒకటి. యస్‌ మ్యూచువల్‌ ఫండ్‌కు ఆస్తుల నిర్వహణ/పెట్టుబడుల నిర్వహణ సంస్థగా ఇది వ్యవహరిస్తోంది.

    యస్‌ ట్రస్టీ కూడా యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ సమూహ సంస్థల్లో ఒకటి. యస్‌ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన ట్రస్ట్ ఫండ్‌కు ఇది ప్రత్యేక యజమాని. యూనిట్‌ హోల్డర్ల ప్రయోజనం కోసం అంతే మొత్తాన్ని ట్రస్టులో కొనసాగిస్తుంది.

    ఈ కొనుగోలుకు సంబంధించి, సీసీఐ నుంచి సవివర ఆదేశం వస్తుంది.

 

 

****


(Release ID: 1719784) Visitor Counter : 134