రైల్వే మంత్రిత్వ శాఖ
86 రైల్వే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు
ఇప్పటికే పనిచేస్తున్న నాలుగు ప్లాంట్లు, 52 ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు
వివిధ దశల్లో 30 ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ
దేశం వివిధ ప్రాంతాల్లో ఉన్న86 రైల్వే ఆసుపత్రుల్లో భారీగా పెరిగిన పడకల సంఖ్య
కోవిడ్ రోగుల కోసం 2539 నుంచి 6972కి పెరిగిన పడకల సంఖ్య
62 నుంచి 296కి పెరిగిన ఇన్వాసివ్ వెంటిలేటర్ల సంఖ్య
ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను మంజూరు చేయడానికి 2 కోట్ల రూపాయల వరకు నిధులను విడుదల చేయడానికి జనరల్ మేనేజర్లకు అధికారాలు
Posted On:
18 MAY 2021 1:17PM by PIB Hyderabad
కోవిడ్-19 కట్టడి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలలో భారత రైల్వేలు పూర్తి స్థాయిలో వివిధ మార్గాల్లో తమ వంతు సహాయ సహకారాలను అందజేస్తున్నాయి. అవసరమైన ప్రాంతాలకు అత్యంత వేగంగా ఆక్సిజన్ తరలిస్తున్న రైల్వేలు మరోవైపు ప్రయాణీకులు సరకులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఇదేసమయంలో తన సిబ్బందికి అవసరమైన వైద్య సౌకర్యాలను అందించే అంశంపై రైల్వేశాఖ దృష్టి సారించింది.
తన ఉద్యోగుల కోసం రైల్వేశాఖ దేశం వివిధ ప్రాంతాల్లో 86 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. వీటిలో మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొని రావడానికి రైల్వే శాఖ బృహత్తర ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది. దీనిలో భాగంగా అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంటులు ఏర్పాటుకానున్నాయి. ఇప్పటికీ నాలుగు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. 52 ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు అయ్యాయి. మిగిలిన 30 ప్లాంట్ల ఏర్పాటు అంశం వివిధ దశల్లో వుంది. కోవిడ్ ఆసుపత్రులుగా సేవలు అందిస్తున్న అన్ని రైల్వే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రెండు కోట్ల రూపాయల వరకు నిధులను విడుదల చేసే అధికారాన్ని జనరల్ మేనేజర్లకు రైల్వేలు కల్పించాయి. రైల్వే బోర్డు దీనికి సంబంధించి 2021 మే నాల్గవ తేదీన 2020 / F (X) II / PW / 3 / పీటీ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొనే వచ్చే అంశంపై కూడా రైల్వేశాఖ దృష్టి సారించింది. కోవిడ్ చికిత్స అందించడానికి పడకల సంఖ్యను 2539 నుంచి 6972కి పెంచారు. ఇదేవిధంగా కోవిడ్ ఆస్పత్రుల్లో ఐసీయూ పడకల సంఖ్యను 273 నుంచి 573కి పెంచడం జరిగింది.
వెంటిలేటర్ల సంఖ్యని 62 నుంచి 296కి పెంచిన అధికారులు బిపాప్ యంత్రాలు, ఆక్సిజన్ సాంద్రతలు, ఆక్సిజన్ సిలిండర్లు వంటిముఖ్యమైన వైద్య పరికరాలు మరింతగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్ బారిన పడిన రైల్వే ఉద్యోగులు అవసరమైతే వైద్యుల సిఫార్సు మేరకు ఎంపానెల్డ్ ఆసుపత్రులలో చేరడానికి అనుమతి ఇస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే ఆసుపత్రుల్లో ఏర్పాటవుతున్న సౌకర్యాలు అత్యవసర చికిత్సను అందించడానికి ఉపయోగపడతాయి.
***
(Release ID: 1719612)
Visitor Counter : 218