రైల్వే మంత్రిత్వ శాఖ

తుపాను రానున్న‌ప్ప‌టికీ, పెనుగాలల‌ను జ‌యించి, దేశానికి 150 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను అందించేందుకు గుజ‌రాత్ నుంచి తెల్ల‌వారుజామునే 2 ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌ల‌ను బ‌య‌లుదేర‌దీసిన భార‌తీయ రైల్వేలు


10000 మెట్రిక్ ట‌న్నుల ఎల్ఎంఒ బ‌ట్వాడా మైలురాయిని దాటిన ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌లు

బొకారో నుంచి పంజాబ్ వెడుతున్న తొలి ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ 41.07 ఎంటిల ఆక్సిజ‌న్ నింపిన రెండు ట్యాంక‌ర్ల‌తో నేడు గ‌మ్యం చేర‌నుంది

521 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ ను మ‌హారాష్ట్ర‌లో, 2652 మెట్రిక్ ట‌న్నులు యుపిలో, 431 ట‌న్నులు ఎంపిలో, 1290 మెట్రిక్ ట‌న్నులు హ‌ర్యానాలో, 564 మెట్రిక్ ట‌న్నులు తెలంగాణ‌లో, 40 మెట్రిక్ ట‌న్నులు రాజ‌స్థాన్‌లో, 361 మెట్రిక్ ట‌న్నులు క‌ర్నాట‌క‌లో, 200 ఎంటిలు ఉత్త‌రాఖండ్‌లో, 231 ఎంటీలు త‌మిళ‌నాడులో, 40ఎంటీలు పంజాబ్‌లో, 118 ఎంటీలు కేర‌ళ‌లో, దాదాపు 3734 ఎంటీలు ఢిల్లీలో భార‌తీయ రైల్వేల అంద‌చేత‌

Posted On: 17 MAY 2021 4:06PM by PIB Hyderabad

 ఆటంకాల‌ను అధిగ‌మించి, నూత‌న ప‌రిష్కారాల‌ను క‌నుగొంటూ భార‌తీయ రైల్వేలు దేశం వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల‌కు ద్ర‌వ‌రూపంలోని మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను (ఎల్ఎంఒ)ను బ‌ట్వాడా చేయ‌డం ద్వారా ఊర‌ట‌ను క‌ల్పిస్తూ త‌న ప్రయాణాన్ని కొన‌సాగిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ, 600 ట్యాంక‌ర్ల‌లో 10300 మెట్రిక్ ట‌న్నుల ఎల్ఎంఒను దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు భార‌తీయ రైల్వేలు బట్వాడా చేసింది.  
గ‌త కొన్ని రోజులుగా ప్ర‌తి రోజూ దేశవ్యాప్తంగా 80 మెట్రిక్ ట‌న్నుల ఎల్ఎంఒను ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ లు బ‌ట్వాడా చేస్తున్నాయి. 
తుఫాను సూచ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ, పెనుగాలల‌ను జ‌యించి, దేశానికి 150 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను అందించేందుకు రైల్వేలు గుజ‌రాత్ నుంచి 2 ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌ల‌ను తెల్ల‌వారుజాము నుంచి న‌డుపుతోంది. 
ఒక ఆక్సిజ‌న్ ఎక్స్ ప్రెస్ తెల్ల‌వారుజ‌మున 4 గంట‌ల‌కు వ‌డోద‌రా నుంచి  2 ఆర్ఒఆర్ఒ ట్ర‌క్కులు, 45 మెట్రిక్ ట‌న్నుల‌ను ఢిల్లీ ప్రాంతానికి అందించేందుకు బ‌య‌లుదేరింది.
మరొక ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ ఉద‌యం 5.30 గంట‌ల‌కు 106 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ తో నింపిన 6 ట్యాంక‌ర్ల‌తో యుపి & ఢిల్లీ ప్రాంతంలో బ‌ట్వాడా చేసేందుకు హ‌పా నుంచి బ‌య‌లుదేరింది.  
బొకారో నుంచి పంజాబ్ వెళ్ళే తొలి ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ సోమ‌వారం సాయంత్రం 7 గంట‌ల‌కు 41.07 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ నిండిన రెండు ట్యాంక‌ర్ల‌తో ఫిల్లౌర్ చేరుకోనుంది. 
ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌లు 23 రోజుల కింద అంటే 24 ఏప్రిల్ 2021న 126 మెట్రిక్ ట‌న్నుల లోడుతో ప్రారంభ‌మైన విష‌యం గ‌మ‌నార్హం. 
కేవ‌లం 23 రోజు కాలంలోనే, 13 రాష్ట్రాల‌లో 10300 మెట్రిక్ ట‌న్నుల మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను బ‌ట్వాడా చేసేందుకు రైల్వేలు త‌న ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ ల కార్య‌క‌లాపాల‌ను పెంచింది. 
దేశం న‌లుమూల‌లా తిరుగుతూ, భార‌తీయ రైల్వేలు ప‌శ్చిమంలో హాపా&ముంద్రా నుంచి, తూర్పులోని రూర్కేలా, దుర్గాపూర్‌, టాటాన‌గ‌ర్‌, అంగుల్ నుంచి ఆక్సిజ‌న్ ను తీసుకుని, ఉత్త‌రాఖండ్‌, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఎంపి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, హ‌ర్యానా, తెలంగాణ‌, పంజాబ్‌, కేర‌ళ‌, ఢిల్లీ, యుపిల‌కు సంక్లిష్ట‌మైన నిర్వ‌హ‌ణ మార్గ ప్ర‌ణాళిక‌ల‌తో బ‌ట్వాడా చేస్తోంది. 
సాధ్య‌మైనంత వేగంగా ఆక్సిజ‌న్ సాయం అందేలా చేసేందుకు, ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ స‌రుకు రైళ్ళ‌ను న‌డిపేందుకు రైల్వేలు నూత‌న ప్ర‌మాణాల‌ను, ముందెన్న‌డూ లేని మైలురాళ్ళ‌ను సృష్టిస్తోంది. ఈ కీల‌క‌మైన స‌రుకు రైళ్ళు దూర ప్రాంతాల‌కు వెళ్ళేట‌ప్పుడు స‌గ‌టు వేగం గంట‌కు 55 కిమీ పైన ఉంది. అధిక ప్రాధాన్య‌త క‌లిగిన గ్రీన్ కారిడార్ పై అత్యంత అత్య‌వ‌స‌ర భావ‌న‌తో న‌డుస్తూ, ఆక్సిజ‌న్ సాధ్య‌మైనంత వేగంగా ఆక్సిజ‌న్ గ‌మ్యాన్ని చేరుకునేందుకు వివిధ జోన్ల‌కు చెందిన నిర్వాహ‌క బృందాలు ఇర‌వై నాలుగు గంట‌లూ స‌వాళ్ళ‌తో కూడిన ప‌రిస్థితుల్లో ప‌నిచేస్తున్నారు.  వివిధ సెక్ష‌న్ల‌లో సిబ్బంది మారుతున్నందున సాంకేతిక నిలుపుద‌ల‌లు 1 నిమిషానికన్నా త‌క్కువ‌గా ఉన్నాయి. 
ప‌ట్టాల‌పై మ‌రే ఇతర రైలు ప్ర‌యాణించకుండా ఖాళీగా ఉంచ‌డ‌మే కాక‌, ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌లు వేగంగా ప‌రుగులుతీసేందుకు అత్యంత అప్ర‌మ‌త్త‌త‌ను నిర్వ‌హిస్తున్నారు. 
ఇదంతా కూడా ఇత‌ర స‌రుకు కార్య‌క‌లాపాల వేగం త‌గ్గ‌కుండా ఉండే విధంగా చేస్తున్నారు. 
ఇప్ప‌టివ‌ర‌కూ 160 ఆక్సిజ‌న్ ఎక్స‌ప్రెస్‌లు త‌మ ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకొని, అనేక రాష్ట్రాల‌కు ఊర‌ట‌ను అందించాయి. 
ఆక్సిజ‌న్ కోరుతున్న రాష్ట్రాల‌కు సాధ్య‌మైనంత త‌క్కువ స‌మ‌యంలో ఎల్ఎంఒను బ‌ట్వాడా చేయాల‌ని భార‌తీయ రైల్వేలు కృషి చేస్తోంది. 
ఈ క‌థ‌నం రాస్తున్నంత‌వ‌ర‌కు, 521 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ ను మ‌హారాష్ట్ర‌లో, 2652 మెట్రిక్ ట‌న్నులు యుపిలో, 431 ట‌న్నులు ఎంపిలో, 1290 మెట్రిక్ ట‌న్నులు హ‌ర్యానాలో, 564 మెట్రిక్ ట‌న్నులు తెలంగాణ‌లో, 40 మెట్రిక్ ట‌న్నులు రాజ‌స్థాన్‌లో, 361 మెట్రిక్ ట‌న్నులు క‌ర్నాట‌క‌లో, 200 ఎంటిలు ఉత్త‌రాఖండ్‌లో, 231 ఎంటీలు త‌మిళ‌నాడులో, 40ఎంటీలు పంజాబ్‌లో, 118 ఎంటీలు కేర‌ళ‌లో, దాదాపు 3734 ఎంటీలు ఢిల్లీలో భార‌తీయ రైల్వేల అందించాయి. 
తాజా ఆక్సిజ‌న్‌ను తీసుకుని ప్ర‌యాణించ‌డ‌మ‌నేది అత్యంత క్రియాశీల‌మైన వ్యాయామం, గ‌ణాంకాలను ఎప్ప‌టిక‌ప్పుడు తాజా ప‌రుస్తున్నాయి. నేటి రాత్రి మ‌రిన్ని ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌లు త‌మ ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌నున్నాయి.
వివిధ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా ప్రాంతాల‌తో భిన్న మార్గాల‌ను రూపొందించి,  రాష్ట్రాల‌కు అవ‌స‌రంప‌డిన‌ప్పుడు బ‌య‌లుదేరేందుకు త‌న‌ను తాను సిద్ధంగా ఉంచుకుంటోంది. ఎల్ఎంఒను తీసుకువ‌చ్చేందుకు రైల్వేల‌కు రాష్ట్రాలు ట్యాంక‌ర్ల‌ను అందిస్తున్నాయి. 

***
 



(Release ID: 1719425) Visitor Counter : 155