విద్యుత్తు మంత్రిత్వ శాఖ
కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో సమాజంతో చేతులు కలిపిన విద్యుత్ రంగ సిపిఎస్‌యులు
Posted On:
16 MAY 2021 12:15PM by PIB Hyderabad
కోవిడ్ మహమ్మారిపై పోరాటం చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్నతమ ప్రతిఒక్క ఉద్యోగిని, పొరుగున ఉన్న సమాజాన్ని చేరుకునేందుకు బహుముఖ వ్యూహాలను విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న సిపిఎస్‌యులు (కేంద్రప్రభుత్వ నిర్వహణలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు) రూపొందిస్తున్నాయి.
అత్యంత ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలపై రోగుల భారాన్ని తగ్గించేందుకు సిపిఎస్‌యులు కలిసి 200 ప్రాంతాలలో కోవిడ్ సంరక్షణ కేంద్రాలను, అత్యంత ఇన్ఫెక్షన్ రేటు ఉన్న ప్రాంతాలలో ఆక్సిజన్ సౌకర్యంతో కోవిడ్ కేర్ శిబిరాలను ఏర్పాటు చేశాయి. తమ స్వంత సిబ్బందితో పాటుగా కాంట్రాక్టు ఉద్యోగులు, వారి కుటుంబాలు, ఒక మాదిరిగా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు వీటిని ఉపయోగించ్చుకోవచ్చు.
దేశరాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లోని వివిధ ప్రాంతాలలో ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటు, మాస్కులు, శానిటైజర్ల పంపిణీ, ఆక్సిజన్ సౌకర్యంతో పడకలు, వాక్సినేషన్ శిబిరాల నిర్వహణ చేయడమే కాకుండా, సాధారణ పౌరుల కోసం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందచేత, ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు చేస్తూ తమ బాధ్యతను నిర్వరిస్తున్నాయి. పైన పేర్కొన్న పనులనే కాక, విద్యుత్ సిపిఎస్‌యులు పిఎం-కేర్స్ నిధికి రూ. 925 కోట్లను విరాళం ఇవ్వడం ద్వారా బలమైన మద్దతును ఇచ్చాయి.
ఉత్తర్ ప్రదేశ్‌లోని సిద్దార్ధ నగర జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేయడం కోసం సిద్దార్ధనగర్ (యుపి) జిల్లా మేజిస్ట్రేట్‌కు రూ. 41.89 లక్షల రూపాయలను సిఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత)లో భాగంగా నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పిసి) అందిస్తోంది. అలాగే, ఉత్తర్ ప్రదేశ్లోని దియోరియా జిల్లా ఆసుపత్రిలోని కోవిడ్ కేందరానికి 60 ఆక్సిజన్ సిలెండర్ల కోసం సిఎస్ ఆర్ రూపంలో దియోరియా డిఎంకు రూ. 45 లక్షల రూపాయలను అందిస్తోంది.
సిఎస్ఆర్ కింద ఫరీదాబాద్‌లోని బాద్షా ఖాన్ (బి.కె.) జిల్లా ఆసుపత్రికి నిమిషానికి 1000 లీటర్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగిన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఎన్‌హెచ్‌పిసి ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది, త్వరలోనే ఖరారు కానుంది. ఎనిమిదది వారాలలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
విద్యుత్ రంగ మరొక సిపిఎస్‌యు అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి), ఎన్‌సిఆర్‌లో బాట్లింగ్ సౌకర్యం ఉన్న రెండు పెద్ద ఆక్సిజన్ ప్లాంట్లు సహా, 11 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల కోసం ఆర్డర్లను ఇచ్చాయి. అంతేకాకుండా, సిఎస్ఆర్ కింద ఇతర రాష్ట్రాలలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి తోడ్పాటును అందించడమే కాక, ఇతర రాష్ట్రాలలో ఎనిమిది భిన్న ప్రాంతాలలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది.
విద్యుత్ మంత్రిత్వ శాఖ మరొక భారీ సిపిఎస్‌యు అయిన ఆర్ఇసి లిమిటెడ్ (ఆర్ఇసిఎల్) తన సిఎస్ఆర్ అంగమైన-ఆర్ఇసి ఫౌండేషన్ పూణెలోని దాల్వా ఆసుపత్రిలో 150కెవి జనరేటర్ ప్లాంటును, నిమిషానికి 1700 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం గల జనరేటర్ ప్లాంట్ (ఫుల్ అసెంబ్లీ)ను ఏర్పాటు చేసేందుకు రూ. 2.21 కోట్ల ఆర్ధిక సహాయం అందించింది. మరొక సిఎస్ఆర్ చొరవలో భాగంగా, ఆర్ఇసి ఫౌండేషన్ ఉత్తరాఖండ్‌లోని ఉద్దంసింగ్ నగర్‌లో కోవిడ్ చికిత్సా కేంద్రంగా మార్చిన పండిత్ రామ్ సుమేర్ సుక్లా స్మృతి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి మద్దతు అందించింది. ఈ కేంద్రం 36 పడకల ఐసియు వార్డు సహా 300 పడకలు, ఐసొలేషన్ కేంద్రం, పరీక్షా కేంద్రం తదితర సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు జిల్లాలోని వైద్య మౌలికసదుపాయాలను బలోపేతం చేయడమే కాక, సకాలంలో తగిన వైద్య చికిత్స, సేవ అందించడం ద్వారా మహమ్మారిని ఎదుర్కోవడంలో స్థానిక పాలకులకు అవకాశాన్ని పెంచింది.
అంతేకాకుండా, సిఎస్ఆర్ కింద అదనంగా ఏడు ప్రాంతాలలో - ఉత్తరాఖండ్‌లోని పిత్తోడ్‌గఢ్ లో, ఖగారియాలోని బేస్ ఆసుపత్రిలో నిమిషానికి1000లీటర్లను ఉత్పత్తి సామర్ధ్యం గల, ఛాత్రాలోని జిల్లా ఆసుపత్రిలో నిమిషానికి 600లీటర్లను ఉత్పత్తి సామర్ధ్యం గల, హుంతేర్ గంజ్ సిహెచ్‌సిలో నిమిషానికి 600లీటర్లను ఉత్పత్తి సామర్ధ్యం గల, బారాన్‌లోని సివిల్ ఆసుపత్రిలో నిమిషానికి 400లీటర్లను ఉత్పత్తి సామర్ధ్యం గల, బరాన్ మల్లాపురంలోని జిల్లా ఆసుపత్రిలో నిమిషానికి 1250 లీటర్ల ఉత్పత్తి సామర్ధ్యం గల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు మద్దతు అందిస్తోంది.
సిఎస్ఆర్ చొరవలో భాగంగా, పిజిసిఐఎల్ (పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) రెండు ప్రాంతాలలో - జైసల్మేర్ (రాజస్థాన్), గురుగ్రాం (హర్యానా)లో ఆక్సిజన్ ప్లాంట్లనుః తావోదేవీ లాల్ స్టేడియంలో 2 x 50 Nm3ను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తోంది.
***
(Release ID: 1719136)
Visitor Counter : 142