ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఔరంగాబాద్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటిలేటర్లపై తాజా సమాచారం


తయారీదారుల నుండి మార్గదర్శకత్వం లేకుండా ఆసుపత్రులలో తాత్కాలిక ఇన్స్టలేషన్

ఆక్సిజన్ మాస్క్ తగిన విధంగా అమర్చకపోవడం వల్లే ఒక వెంటిలేటర్‌ సక్రమంగా పనిచేయలేదు.

ఇవి సమర్థంగా పనిచేసేలా తయారీదారులు అన్ని రకాల సాంకేతిక సహాయాలు అందిస్తున్నారు

Posted On: 14 MAY 2021 7:34PM by PIB Hyderabad

గత సంవత్సరం నుండి ‘హోల్ ఆఫ్ గవర్నమెంట్’ విధానం ప్రకారం, ఆసుపత్రి సంరక్షణలోని  కొవిడ్ రోగులను సక్రమంగా చూసుకునేందుకు రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలే చేస్తున్న ప్రయత్నాలకు భారత ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచడానికి, కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుండి వెంటిలేటర్లతో సహా అవసరమైన వైద్య పరికరాలను రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు/ సెంట్రల్ హాస్పిటల్స్ / ఇన్స్టిట్యూట్లకు సేకరించి అందిస్తోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఇన్స్టాల్ చేసిన ‘మేక్ ఇన్ ఇండియా’ వెంటిలేటర్లు సరైన రీతిలో పనిచేయడం లేదని కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఈ వార్తలు నిరాధారమైనవి , తప్పుడు సమాచారంతో కూడుకున్నవి.

గత సంవత్సరం మహమ్మారి ప్రారంభంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో వెంటిలేటర్లు చాలా పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండేవి. అంతేగాక మనదేశంలో వెంటిలేటర్ల తయారీ చాలా తక్కువగా జరుగుతోంది. విదేశీ సరఫరాదారులు భారతదేశానికి పెద్ద మొత్తంలో వెంటిలేటర్లను సరఫరా చేసే స్థితిలో లేరు. అందుకే స్థానిక తయారీదారులను వెంటలేటర్లను తయారు చేయాలని ప్రభుత్వం ప్రోత్సహించింది. తయారీదారుల్లో చాలామంది మొదటిసారి వెంటిలేటర్లను రూపొందించారు. వెంటిలేటర్ నమూనాలు కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నాయి. సాంకేతిక ప్రదర్శనలు ఇచ్చారు.  క్లినికల్ ధ్రువీకరణలు పొందారు. డొమైన్ నాలెడ్జ్ నిపుణుల ద్వారా అందుబాటులో ఉన్న పరిమిత సమయంలో వారి ఆమోదం తరువాత ఈ వెంటిలేటర్లను వాడారు.

వెంటిలేటర్లను తీసుకున్న కొన్ని రాష్ట్రాలు వాటిని వారి ఆసుపత్రులలో ఇన్స్టాల్ చేయలేదు. దీంతో 2021 ఏప్రిల్ 11 న కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అటువంటి ఏడు రాష్ట్రాలకు లేఖ రాశారు. గత 4-5 నెలలుగా 50 కి పైగా వెంటిలేటర్లు నిరుపయోగంగా పడిఉన్నాయి. వెంటిలేటర్ల ఇన్స్టలేషన్ను వేగవంతం చేసి, సమర్థంగా ఉపయోగించుకోవాలని కోరారు.

జ్యోతి సీఎస్సీ తయారుచేసిన వెంటిలేటర్లను ఔరంగాబాద్ మెడికల్ కాలేజీకి సరఫరా చేశారు. "మేక్ ఇన్ ఇండియా" వెంటిలేటర్ల తయారీదారులలో జ్యోతి సీఎస్సీ ఒకటి. ఎంపవర్డ్ గ్రూప్ -3 ఆదేశాల మేరకు ఈ కంపెనీ కొవిడ్-19 నిర్వహణ కోసం అంతటా వెంటిలేటర్లను సరఫరా చేసింది.  రాష్ట్రాలు కోరినట్టుగా వాటికి వెంటలేటర్లను అందుబాటులో ఉంచారు. జ్యోతి సీఎస్సీకి  పీఎం కేర్స్ఫండ్ కింద నిధులు రాలేదు. ఔరంగాబాద్ మెడికల్ కాలేజీకి జ్యోతి సీఎస్సీ 150 వెంటిలేటర్లను సరఫరా చేసింది. 100 వెంటిలేటర్లు మొదటిసాసారి 2021 ఏప్రిల్ 19 న ఔరంగాబాద్ చేరుకున్నాయి. తరువాత రాష్ట్ర అధికారుల నుండి వచ్చిన సూచనల  ప్రకారం ఇన్స్టలేషన్ జరిగింది. మొదటి లాట్‌లోని  100 వెంటిలేటర్లలో 45 వెంటిలేటర్లను మెడికల్ కాలేజీల్లో ఏర్పాటు చేశారు. ఈ వెంటిలేటర్లకు సంబంధించి ఇన్స్టలేషన్ ,పనితీరు బాగుండటంతో ఆసుపత్రి అధికారులు సర్టిఫికెట్లు జారీ చేశారు. ఇన్స్టాల్ చేసిన ఈ 45 వెంటిలేటర్లలో, మూడింటిని రాష్ట్ర అధికారులు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో (సిగ్మా హాస్పిటల్) తిరిగి బిగించారు. ఈ ప్రైవేటు ఆసుపత్రులలో జ్యోతి సీఎస్సీ ఇంజనీర్లు వీటిని మళ్లీ ఇన్స్టాల్ చేశారు. విజయవంతంగా ఆరంభించి , ప్రదర్శించిన తరువాత కూడా ఆసుపత్రి అధికారులు ఇన్స్టలేషన్ , కమీషనింగ్ సర్టిఫికేట్ జారీ చేశారు.  45 వెంటిలేటర్లలో 20 వెంటిలేటర్లను రాష్ట్ర అధికారులు మరో ప్రైవేట్ ఆసుపత్రికి (ఎంజిఎం హాస్పిటల్) తిరిగి కేటాయించారు. జ్యోతి సీఎస్సీకి దీని గురించి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అందువల్ల, ఈ వెంటిలేటర్లను  జ్యోతి సిఎన్సి ఇంజనీర్లు ఇన్స్టాల్ చేయలేదు.  ఈ వెంటిలేటర్లను కొత్త ప్రదేశంలో ఏర్పాటు చేయడం రాష్ట్ర అధికారుల నిర్ణయం మేరకు జరిగింది. మొదటి దశలో  55 వెంటిలేటర్లను ఇతర ప్రదేశాలకు మళ్లించారు (బీడ్, ఉస్మానాబాద్, పర్భాని , హింగోలి). 50 వెంటిలేటర్లకు ఇన్‌స్టాలేషన్ , కమీషనింగ్ సర్టిఫికెట్లు సంబంధిత ఆసుపత్రి అధికారులు ఇచ్చారు. బీడ్ సివిల్ హాస్పిటల్‌లో అన్ఇన్‌స్టాల్ ఐదు వెంటలేటర్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఇన్స్టాల్ చేయడానికి ఆసుపత్రి అధికారుల ఆదేశాలు ఇంకా రాలేదు.

50 వెంటిలేటర్లలో రెండోబ్యాచ్ను 2021 ఏప్రిల్ 23 న ఔరంగాబాద్ మెడికల్ కాలేజీ , ఆసుపత్రికి పంపారు. అధికారులు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో (సిగ్మా హాస్పిటల్)  కేవలం రెండు వెంటిలేటర్లను మాత్రమే ఏర్పాటు చేశారు. వెంటిలేటర్లు సమర్థంగా పనిచేయడంతో వీటికి ఇన్‌స్టాలేషన్ , కమీషనింగ్ సర్టిఫికెట్లు కూడా సంబంధిత ఆసుపత్రి అధికారులు ఇచ్చారు.ఔరంగబాద్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని 48 వెంటిలేటర్లను ఇన్స్టాల్ చేసేందుకు జ్యోతి సిఎన్సి & హెచ్ఎల్ఎల్ కంపెనీలకు ఇంకా ఆదేశాలు రాలేదు.  వెంటిలేటర్లను విజయవంతంగా వ్యవస్థాపించిన నాలుగు రోజుల తరువాత, అంటే ఏప్రిల్ 23న ఇవి పనిచేయడం లేదంటూ ఫిర్యాదు వచ్చింది. ఎనిమిది వెంటిలేటర్లు పనిచేయడం లేదని టెలిఫోన్ ద్వారా ఫిర్యాదు అందింది. ఇంజనీర్లు సైటుకు వెళ్లి, మూడు వెంటిలేటర్లలో ఫ్లో సెన్సార్ (ప్రాక్సిమల్) ఇన్స్టాల్ కాలేదని కనుగొన్నారు. మొత్తం ఎనిమిది వెంటలేటర్లను  సర్వీస్ ఇంజనీర్లు రీకాలిబ్రేట్ చేశారు. ఒకే వెంటిలేటర్‌లో ఆక్సిజన్ సెల్ ఉన్నా, అది పనిచేయడం లేదు. దీంతో తాజాగా ఆక్సిజన్ సెల్ను రీఇన్స్టాల్ చేశారు. ఈ వెంటిలేటర్ కూడా సేవలు అందించడం మొదలుపెట్టింది. ఐసీయూలో రెండు వెంటిలేటర్లను ఉపయోగించినట్లు తెలియజేస్తూ 2021 మే 10 న జ్యోతి సీఎస్సీకి కాల్ వచ్చింది. వీటిలో, ఎన్ఐవి (నాన్-ఇన్వాసివ్ (బిపాప్) మోడ్‌లో ఒకటి, రోగి  శాచురేషన్ను నిర్ధారించలేకపోతోంది. దీన్ని ఐసీయూ వెలుపల తనిఖీ చేయవచ్చని అధికారులు తెలిపారు. సర్వీసు ఇంజనీర్ల బృందం దీనిని పరిశీలించింది. బాగానే పనిచేస్తున్నట్టు వాళ్లు గుర్తించారు. ఆసుపత్రి అధికారులు సంతృప్తి వ్యక్తం చేసిన తరువాత బృందం తిరిగి వెళ్లిపోయింది. దీనిని 2021 మే 12 రాత్రి నుంచి ఎన్ఐవి మోడ్‌లో రోగికి తిరిగి ఉపయోగిస్తున్నారు.   అవసరమైనంత పిఇఇపిని పొందలేకపోతున్నారని జ్యోతి సీఎస్సీ వారికి మే 13న టెలిఫోన్  ద్వారా సమాచారం ఇచ్చారు. సాంకేతిక బృందం మధ్యాహ్నం ఆసుపత్రిని సందర్శించింది. అయితే, అప్పటికీ అదే వెంటిలేటర్ రోగిపై ఇన్వాసివ్ మోడ్‌లో ఉంచారు. వెంటిలేటర్ రోగిపై ఇన్వాసివ్ (ఐవీ) మోడ్‌లో పనిచేస్తోంది. ఇది రోగికి సరిగ్గానే పనిచేస్తున్నట్టు గుర్తించారు.

 జ్యోతి ఇంజనీర్లు అప్పుడు ఫిర్యాదులు వచ్చిన పరికరాల బ్యాకప్ను, లాగ్ను తీసుకున్నారు. రోగికి ముసుగు సరిగ్గా పెట్టకపోవడంతో తలెత్తే అధిక లీకేజీ గురించి పరికరాలు నిరంతరం అలారం ఇస్తున్నాయని గమనించారు ( ముసుగు పరిమాణం సరిగా ఉండి , రోగికి అమర్చితే ఈ సమస్య పరిష్కారమవుతుంది)  లాగ్ బుక్ ద్వారా ఈ విషయాన్ని గమనించారు.  సర్వీస్ ఇంజనీర్ల బృందం ఇప్పటికీ ఆసుపత్రిలో ఉంది. ఎన్ఐవి మోడ్ ఉన్న రోగిపై వెంటిలేటర్ అమర్చిన వెంటనే, వారు అక్కడి ఆసుపత్రి అధికారులకు దీని పనితీరును చూపిస్తారు. ప్రస్తుతం వెంటిలేటర్ రోగిపై ఇన్వాసివ్ మోడ్‌లో ఉన్నాడు. అది బాగానే పనిచేస్తోంది.

ఔరంగాబాద్ జిఎంసి హాస్పిటల్  అప్పటికే అక్కడ ఏర్పాటు చేసిన  మొత్తం 22 వెంటిలేటర్లను ప్రదర్శించి, ఆసుపత్రి బృందం ముందు తిరిగి పనిచేయించాలని చేయాలని కోరింది. జ్యోతి సీఎస్సీ ఇంజనీర్ల బృందం ఈ రోజు , రేపు అవే పనులు చేస్తుంది.

వెంటిలేటర్ తయారుచేసే హెల్ప్‌లైన్ నంబర్లను మరోసారి తెలియజేస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు , కేంద్ర పాలిత ప్రాంతాలకు 2021 మే 9 న లేఖ రాసింది. ఇవి వెంటిలేటర్లకు అంటించిన స్టిక్కర్లపైన కూడా అందుబాటులో ఉన్నాయి. అదనంగా, ఏదైనా సాంకేతిక సమస్యలు వస్తే, రియల్టైంలో పరిష్కరించడానికి రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల సంబంధిత నోడల్ అధికారులు, యూజర్ హాస్పిటల్స్ ప్రతినిధులు , తయారీదారుల సాంకేతిక బృందాలతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. సమాచారం లోపాలను, సాంకేతిక అవాంతరాలను నివారించడానికి ఈ తయారీదారుల  ఈ–మెయిల్ ఐడిలను రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు అందించారు.

***



(Release ID: 1718773) Visitor Counter : 208