వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచే చర్యలను గురించి యుఎస్‌టీఆర్‌తో వాణిజ్య, పరిశ్రమల మంత్రి చర్చ‌

Posted On: 14 MAY 2021 8:24PM by PIB Hyderabad

 

కేంద్ర వాణిజ్య, పరిశ్రమ, రైల్వే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్, 2021 మే 14న అమెరికా వాణిజ్య ప్రతినిధి అంబాసిడర్ కేథరీన్ థాయ్‌తో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు.
కోవిడ్- 19 మహమ్మారి వ్యాప్తిపై యుద్ధంలో భాగంగా స‌మీకృత మ‌రియు స‌మాన‌ ప‌ద్ధ‌తిలో వ్యాక్సిన్ లభ్యతను పెంచడం పైన‌ ఈ సమావేశం దృష్టి సారించింది.
నిరు పేదలకు టీకాలు వేయడం, వారి ప్రాణాల‌ను కాపాడట‌మ‌నే సవాలును స్వీకరించడానికి గాను.. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి కొన్ని టీఆర్ఐపీఎస్ నిబంధనలను మాఫీ చేయాలన్న భారతప్రతిపాదన కూడా ఈ స‌మావేశంలో చర్చించబడింది. భారతదేశ ప్రతిపాదనకు అమెరికా మద్దతు ప్రకటించినందుకు యుఎస్‌టీఆర్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ల అవసరం ఉన్నందున.. వ్యాక్సిన్ తయారీదారుల సరఫరా చైన్‌ను తెరిచి, హద్దు లేకుండా ఉంచాలని మంత్రి పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ల‌ లభ్యత పెంచడం, ప్రాణాలను కాపాడటం అనే సాధారణ సంకల్పానికి కృషి చేయడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.

                             

*****


(Release ID: 1718771) Visitor Counter : 180