రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ప్రజలకు ఈద్‌-ఉల్‌-ఫితర్‌ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

Posted On: 13 MAY 2021 7:43PM by PIB Hyderabad

ఈద్‌-ఉల్‌-ఫితర్‌ సందర్భంగా, రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

    "ఈద్‌-ఉల్‌-ఫితర్‌ సందర్భంగా దేశ ప్రజలందరికీ, ముఖ్యంగా ముస్లిం సోదరసోదరీమణులకు శుభాభినందనలు." 

    "పవిత్రమైన రంజాన్‌ నెలలో ప్రజలు ఉపవాసం ఉంటారు, ప్రతిరోజు ప్రార్థనలు చేస్తారు, అల్లాకు విధేయత ప్రకటిస్తారు. రంజాన్ నెల ముగింపును సూచించే ఈద్-ఉల్-ఫితర్ పవిత్ర పండుగను సోదరభావం, సామరస్యం బలోపేతానికి నిదర్శనంగా జరుపుకుంటారు. మానవ సేవకు పునఃఅంకితం కావడానికి, ఇబ్బందుల్లో ఉన్నవారి అవసరాలు తీర్చడానికి ఒక సందర్భం ఈద్-ఉల్-ఫితర్".

    "కొవిడ్‌ నిబంధనలు, మార్గదర్శకాలను పాటిస్తూ; సమాజం, దేశ శ్రేయస్సు కోసం పని చేయడానికి మనమందరం సంకల్పించుకుందాం” అని తన సందేశంలో రాష్ట్రపతి పేర్కొన్నారు.

రాష్ట్రపతి సందేశాన్ని హిందీలో చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

 

******
 


(Release ID: 1718412) Visitor Counter : 137