భారత ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన మండలులకు శాసన సభ్యులచే (ఎమ్మెల్యేలు) జరగాల్సిన ద్వైవార్షిక ఎన్నికలు వాయిదా
Posted On:
13 MAY 2021 4:02PM by PIB Hyderabad
స్థానిక శాసన సభ్యులచే ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎన్నికైన 03 (ముగ్గురు) సభ్యులు, తెలంగాణ శాసన మండలికి ఎన్నికైన 06 (ఆరుగురు) సభ్యుల పదవీ కాలం వరుసగా 31.05.2021, 03.06.2021 తేదీల్లో ముగియనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
నియోజకవర్గం యొక్క తరగతి
|
రిటైర్మెంట్ తేదీ
|
సీట్ల సంఖ్య
|
ఎలక్టర్లు
|
ఆంధ్రప్రదేశ్
|
ఎంఎల్ఏలతో
|
31.05.2021
|
03
|
శాసనసభ సభ్యులు
|
తెలంగాణ
|
ఎంఎల్ఏలతో
|
03.06.2021
|
06
|
శాసనసభ సభ్యులు
|
2. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 16 లోని నిబంధనల ప్రకారం, సభ్యుల పదవీకాలం ముగియడంతో ఖాళీగా ఉండబోయే రాష్ట్ర శాసనమండలి స్థానాలను, ద్వివార్షిక ఎన్నికలను నిర్వహించడంతో నింపాలి. ఈ ఎన్నికల్ని ఆయా సభ్యుల పదవీకాలం గడువు ముగిసేందుకు ముందు నిర్వహించాలి.
3. ఈ విషయాన్ని కమిషన్ ఈ రోజు సమీక్షించింది. దేశంలో కోవిడ్ రెండో దశ వ్యాప్తి వేగంగా జరుగుతున్నందున మహమ్మారి తగ్గుముఖం పట్టేంత వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన మండలులకు నిర్ధారిత ద్వైవార్షిక ఎన్నికలను నిర్వహించడం సముచితం కాదని నిర్ణయించింది. కోవిడ్-19 వ్యాప్తి తగ్గడం ఈ ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా మారేంత వరకు ఎన్నికలు సరికాదని కమిషన్ అభిప్రాయపడింది.
***
(Release ID: 1718369)
Visitor Counter : 128