ఉక్కు మంత్రిత్వ శాఖ
4686 మెట్రిక్ టన్నుల ప్రాణాలను కాపాడే ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసిన స్టీల్ ప్లాంట్లు
వాయురూపంలో ఆక్సిజన్ అందుబాటుతో 9,100 పడకలతో ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్న స్టీలు ప్లాంట్లు
Posted On:
12 MAY 2021 6:19PM by PIB Hyderabad
ఈ సంక్షోభ కాలంలో దేశ సేవ నిమిత్తం ఉక్కు పరిశ్రమంతా ఐక్యంగా నిలిచింది. మే 10వ తేదీన ఉక్కు పరిశ్రమలు 4688 మెట్రిక్ టన్నుల జీవితాన్ని కాపాడే ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్ ను సరఫరా చేశాయి. ఇందులో ఎస్ఎఐఎల్ 1193 మెట్రిక్ టన్నులు, ఆర్ ఐఎన్ఎల్ 180 మెట్రిక్ టన్నులు, టాటా గ్రూప్ 1425 మెట్రిక్ టన్నులు, జెఎస్‌డబ్ల్యు 1300 మెట్రిక్ టన్నులను సరఫరా చేయగా, మిగిలినది ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని స్టీలు పరిశ్రమలు సరఫరా చేశాయి. దేశంలో ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్ మొత్తం ఉత్పత్తి, రోజుకి 9500 మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇది వ్యవస్థాపక సామర్ధ్యంలో 130% వినియోగసామర్ధ్యాన్న పట్టి చూపుతోంది. ఎల్ఎంఒ జాతీయ ఉత్పత్తిలో దాదాపుగా సగం వంతుకు స్టీల్ ప్లాంట్లే దోహదం చేస్తున్నాయి.
నైట్రొజెన్, ఆర్గాన్ ఉత్పత్తిని తగ్గించడం, దాదాపుగా ఎక్కువ ప్లాంట్లలో కేవలం ఎల్ఎంఒను మాత్రమే ఉత్పత్తి చేయడం వంటి వివిధ చొరవలను తీసుకోవడం ద్వారా స్టీలు పరిశ్రమలు ఎల్ఎంఒ సరఫరాను పెంచగలిగాయి. సాధారణంగా, వారు 3.5 రోజుల భద్రతా నిల్వలను తమ నిల్వ ట్యాంకులలో ఉంచాలి, అది ఆవిరి రూపంలో మారినప్పుడు ఆక్సిజన్ ప్లాంట్లలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని ఉపయోగిస్తారు. ఉక్కు మంత్రిత్వ శాఖ నిరంతరం ఉక్కు ఉత్పత్తిదారులతో సంప్రదింపులలో ఉండటంతో, ఎల్ ఎంఒ సరఫరా చెప్పుకోదగినంతగా పెరిగి ఈ భద్రతా నిల్వలు 0.5 రోజులకు తగ్గాయి.
ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులు, దానికి అనుబంధ ప్రభుత్వ రంగ సంస్థలతో గత సోమవారం కేంద్ర ఉక్కు శాఖ, పిఎన్‌జి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్ సరఫరా, స్టీల్ ప్లాంట్ల ద్వారా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల పెంపుకు జరుగుతున్న కృషిని ఆయన సమీక్షించారు.
స్టీల్ ప్లాంట్లు 8,100 పడకలతో (ఎఎంఎన్ఎస్ - హజీరా, జెఎస్‌డబ్ల్యు -దోల్వి & విజయనగర్, జిందాల్ - హిసార్, హెచ్‌జెడ్ఎల్ -ఉదయ్ పూర్, ఎస్ఎఐఎల్ - రూర్కేలా, భిలాయ్, బొకారో, దుర్గాపూర్, బర్న్‌పూర్, ఆర్ఐఎన్ఎల్ -వైజాగ్, టాటా- కళింగనగర్, జెఎస్ఆర్, అంగుల్) వాయు రూపంలో ఉన్న ఆక్సిజన్ గల ప్లాంట్లకు సమీపంలో ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాయి.
వారు చేస్తున్న సేవలకు ప్రశంస వ్యక్తీకరణంగా అందరు భాగస్వాములకు టీకా వేసేందుకు చమురు, వాయువు, ఉక్కుకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రావాలని ప్రధాన్ కోరారు. ఇది ఉద్యోగుల, భాగస్వాముల ఉత్సాహాన్ని పెంచి, కోవిడ్ 19 పై పోరాటాన్ని బలోపేతం చేయడమే కాక, ప్రపంచంలోనే అతి పెద్ద వాక్సినేషన్ డ్రైవ్ వేగవంతం కావడానికి తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
***
(Release ID: 1718166)
Visitor Counter : 150