వ్యవసాయ మంత్రిత్వ శాఖ

స్థానికులకు తిరిగి జీవనోపాధిని కల్పించనున్న అగరుబత్తి రంగం


భారతీయ అగరుబత్తి ప్రపంచవ్యాప్తంగా అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి

దేశీయ అగరుబత్తి పరిశ్రమను బలోపేతం చేయడానికి జాతీయ వెదురు మిషన్ ఎంఐఎస్ మాడ్యూల్‌ను ప్రారంభించింది

Posted On: 11 MAY 2021 12:55PM by PIB Hyderabad

అగరుబత్తి కర్ర ఉత్పత్తి కోసం స్టిక్ తయారీ యూనిట్లను సమన్వయం చేయడానికి, ముడి పదార్థాల లభ్యత, యూనిట్ల పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం, మార్కెటింగ్ మొదలైనవాటిని కలపడానికి ఒక ఎంఐఎస్  (మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) ఆధారిత రిపోర్టింగ్ వేదికను జాతీయ వెదురు మిషన్ ప్రారంభించింది. ఈ మాడ్యూల్ సాయంతో ఉత్పత్తి యూనిట్ల నుండి సజావుగా సేకరణను ప్రారంభించడానికి పరిశ్రమతో ఉన్న అనుసంధానాలను మెరుగ్గా సమన్వయం చేస్తారు. సమాచార అంతరాలను పూడ్చుతారు.  గ్లోబల్ మార్కెట్లలో భారతీయ అగరుబత్తిని ఎక్కువగా కోరుకుంటున్నందున, ‘వోకల్ ఫర్ లోకల్’ , ‘మేక్ ఫర్ ది వరల్డ్’ లకు మరింత మద్దతు ఎలా ఇవ్వవచ్చో అంచనా వేయడానికి అన్ని ఎన్బీఎం రాష్ట్రాలు అన్ని యూనిట్ల వివరాలను డాక్యుమెంట్ చేసే పనిలో ఉన్నాయి.

జాతీయ వెదురు మిషన్ (ఎన్‌బిఎం), చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఇ), ఖాదీ , గ్రామ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) పథకాలతో పాటు రాష్ట్రాలు, పరిశ్రమ భాగస్వాములతో కలిసి భారతదేశం ఆత్మ నిర్భర్‌గా మారడానికి కేంద్రీకృత మద్దతును పెంచింది. దీనివల్ల అగరుబత్తి రంగం, స్థానిక సమాజాలకు జీవనోపాధిని తిరిగి కల్పించడమేకాదు.. ఈ రంగాన్ని కూడా ఆధునీకరించగలుగుతారు. అగరుబత్తి రంగం సాంప్రదాయకంగా స్థానిక శ్రామికశక్తికి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించింది, అయితే పుల్లలు, , ముడిపదార్థాల చౌక దిగుమతుల వల్ల మనదేశంలో తయారీ  తగ్గిపోయింది. 2019 లో ఎన్‌బిఎం ఒక సమగ్ర అధ్యయనం నిర్వహించింది. దీని తరువాత ముడి బత్తుల దిగుమతులపై పరిమితులు విధించారు. రిస్ట్రిక్టెట్ కేటగిరీలోకి మార్చారు. పుల్లలపై దిగుమతి సుంకాన్ని జూన్ 2020 లో 25% కి పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న విధాన చర్యలు స్థానిక అగరబత్తుల తయారీ రంగానికి ఊపునిచ్చాయి.  

 ఎన్బీఎం   నేపథ్యం

ఆధునిక జాతీయ వెదురు మిషన్ (ఎన్‌బిఎమ్) 2018-19లో ఏర్పాటయింది. వెదురు రంగం   సమగ్ర అభివృద్ధి కోసం ఒక హబ్ (పరిశ్రమ) లో క్లస్టర్ ఆధారిత విధానం ద్వారా ప్రారంభమయింది. భాగస్వామ్యపక్షాలకు అన్ని రకాల సహకారాలు అందించడం ద్వారా ఎన్నో అవకాశాలను ఉపయోగించుకునేలా చేసింది.  రైతులను మార్కెట్లకు అనుసంధానించింది. భారతీయ వెదురు ఉత్పత్తులకు దేశవిదేశీ మార్కెట్లలో అపార అవకాశాలు ఉన్నాయి. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో, ఆధునిక ప్రాసెసింగ్‌తో , విదేశాలకు అవసరాలపై అవగాహన కల్పించడం ఈ రంగాన్నో ప్రోత్సహిస్తున్నారు. దేశీయ పారిశ్రామిక కార్యకలాపాలను మెరుగుపర్చడానికి మిషన్ తన తగిన నిర్ణయాలు తీసుకుంటున్నది. అలాగే సాంకేతిక సంస్థల మద్దతుతో , పథకాలతో  రైతు ఆదాయాన్ని పెంచుతుంది.  ప్రత్యక్ష రాయితీ కింద రైతులకు హెక్టారుకు రూ .1.00 లక్షల చొప్పున సబ్సిడీ ఇస్తున్నారు. ప్రభుత్వ సంస్థలకు 100 శాతం ఇస్తున్నారు.  వివిధ ఉత్పత్తి అభివృద్ధి విభాగాలను ఏర్పాటు చేయడానికి వ్యవస్థాపకులకు కూడా రాయితీలు ఇస్తున్నారు. మిషన్ ప్రస్తుతం మొత్తం 9 ఈశాన్య రాష్ట్రాలతో సహా 21 రాష్ట్రాల్లో అమలవుతోంది.  సంబంధిత రాష్ట్ర వెదురు మిషన్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. వాణిజ్యపరంగా అవసరమైన జాతుల తోటలను చేపట్టడానికి, సాధారణ సదుపాయాల కేంద్రాల నిర్మాణాలకు , ఇతర పంటకోత యూనిట్ల ఏర్పాటుకు, రైతులకు నాణ్యమైన సామగ్రిని అందుబాటులో ఉంచడం వంటి చర్యలు తీసుకోవాలని  ఎన్బిఎం రాష్ట్రాలకు సూచించింది. దీనివల్ల కొత్త పరిశ్రమలతోపాటు పాత వాటికి, రైతులకు, భారతీయ వెదురు పరిశ్రమకూ మేలు జరుగుతుంది.

***


(Release ID: 1717819) Visitor Counter : 297