భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ఇన్‌గ్రామ్ మైక్రో ఐఎన్‌సీలో 100 శాతం షేరు హోల్డింగ్, పూర్తి నియంత్రణను ఐమోలా అక్విజిషన్ కార్పొరేషన్ పొందేందుకు సీసీఐ ఆమోదం
प्रविष्टि तिथि:
10 MAY 2021 9:15AM by PIB Hyderabad
ఇన్‌గ్రామ్ మైక్రో ఐఎన్‌సీలో 100 శాతం షేరు హోల్డింగ్, పూర్తి నియంత్రణను
ఐమోలా అక్విజిషన్ కార్పొరేషన్ పొందేందుకు చేసిన ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ఇన్‌గ్రామ్ మైక్రో ఐఎన్‌సీ దాని మాతృ సంస్థలైన (i) జీసీఎల్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఐఎన్‌సీ, జీసీఎల్ ఇన్వెష్ట్‌మెంట్ హోల్డింగ్ ఐఎన్‌సీ మరియు (ii) దాని ప్రత్యక్ష, పరోక్ష అనుబంధ సంస్థలలో (సమిష్టిగా ఇంగ్రామ్ మైక్రో అని పిలుస్తారు) 100 శాతం వాటా కొనుగోలుకు సంబంధించి సీసీఐ వద్ద ప్రతిపాదన చేయడమైంది. ఐమోలా అనేది ప్లాటినం ఈక్విటీ గ్రూపుకు చెందిన కొత్తగా విలీనము చేయబడిన సంస్థ.
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్, లాజిస్టిక్స్, మెటల్ సర్వీసెస్, తయారీ, పంపిణీతో సహా విస్తృతమైన వ్యాపారాలలో వినియోగదారులకు సేవలు మరియు పరిష్కారాలను అందించే సంస్థల విలీనం, సముపార్జన మరియు ఆపరేషన్ల విభాగంలో ప్లాటినం ఈక్విటీ గ్రూప్ ప్రత్యేకతను కలిగి ఉంది. ఇన్‌గ్రామ్ మైక్రో అనేది అమెరికా ప్రధాన కార్యాలయంగా గల ఐటీ సంస్థ, ఇది టెక్నాలజీ పంపిణీ, లాజిస్టిక్స్, క్లౌడ్ సొల్యూషన్స్, ఈ-కామర్స్ సరఫరా గొలుసు సేవల్లో ప్రత్యేకత కలిగి ఉంది. దీనికి సంబంధించి సీసీఐ యొక్క వివరణాత్మక అర్డర్ వెలువడాల్సి ఉంది.
****
(रिलीज़ आईडी: 1717488)
आगंतुक पटल : 216