విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఐఆర్ఈడీఏ, ఎన్‌హెచ్‌పీసీకి చెందిన 300 మందికి పైగా ఉద్యోగులకు కోవిడ్ టీకాలు
Posted On:
09 MAY 2021 8:53AM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ఈడీఏ), జాతీయ జలవిద్యుత్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ఉద్యోగులకు కోవిడ్ టీకాలను ఇచ్చే కార్యక్రమం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సంయుక్తంగా 18-44 వయస్సు గల ఉద్యోగుల కోసం మే 7, 8 తేదీలలో న్యూఢిల్లీలోని ఐఆర్ఈడీఏ కార్పొరేట్ కార్యాలయంలో టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు.
విద్యుత్, పునరుత్పాదక ఇంధనం శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), నైపుణ్య అభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖల సహాయ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ సూచన మేరకు కోవిడ్-19 టీకా డ్రైవ్ పెద్ద ఎత్తున చేపట్టారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఐఆర్ఈడీఏ, ఎన్‌హెచ్‌పీసీలు, కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ఎంహెచ్ఏ, పీఎఫ్‌సీ, ఆర్ఈసీ, బీహెచ్ఈఎల్, బీబీఎంబీ, ఎంఎంటీసీ, ఎన్ఈఈపీసీఓ, పీటీసీ, ఎన్ఎస్‌పీసీఎల్, సీఈఏలకు చెందిన మొత్తం 317 మంది ఉద్యోగులు ఈ శిబిరంలో టీకాలు వేశారు. కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌లు పెరుగుతుండడం, కోవిడ్ రెండో దశ వేగవంతమైన వ్యాప్తి నేపథ్యంలో ఆయా సంస్థలకు చెందిన ఉద్యోగులకు వేగంగా ఇమ్యూనైజింగ్ ప్రక్రియ చేపట్టారు. టీకా శిబిరంలో అన్ని రకాల భద్రతా ప్రోటోకాల్‌లు అనుసరించబడ్డాయి. ఈ సందర్భంగా ఐఆర్ఈడీఏ సీఎండీ శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ ప్రసంగించారు. “ఇది ఆరోగ్యకరమైన శ్రామిక శక్తికి రక్షణ, విశ్వాసాన్ని నిర్ధారించే ప్రయత్నం. ఇది వేగంగావంతమైన ఆర్థిక పునరుద్ధరణకు దారితీసి.. సాధారణ జీవితానికి సురక్షితంగా తిరిగి రావడానికి కూడా సహాయ పడుతుంది." అని అన్నారు. ఈ టీకా డ్రైవ్ నిర్వహణకు ఎన్‌హెచ్‌పీసీతో అపోలో హాస్పిటల్ సహకారానికి శ్రీ దాస్ కృతజ్ఞతలను తెలిపారు. కోవిడ్-19 కట్టడికిగాను మొదటి, రెండవ వ్యాప్తి దశలలో ఐఆర్ఈడీఏ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇది ఒక ఆదర్శప్రాయమైన ‘కోవిడ్ కేర్ రెస్పాన్స్ టీం’ ను ఏర్పాటు చేసింది. జూన్ 2020 నుండి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిన ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల సంరక్షణ దిశగా చర్యలు చేపడుతోంది. ఈ బృందం ఇప్పటివరకు 77 మంది ఉద్యోగులకు, దాదాపు 27 మంది ఉద్యోగుల కుటుంబాల వారికి, 17 మంది ఇతర వ్యక్తులకు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా సహాయం చేసింది. వారికి ఆహారం మరియు మందుల క్రమం తప్పకుండా పంపిణీ, ఆసుపత్రిలో చేర్చడం, ప్లాస్మా విరాళం, ప్రాణ వాయువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మొదలైన సహాయాన్ని కూడా అందించింది. 24x7 ప్రాతిపదికన నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవసరాన్ని నిర్ధారించే విధంగా విద్యుత్ రంగ సిబ్బంది భద్రత కోసం ఈ టీకా డ్రైవ్‌ను నిర్వహించారు.
***
(Release ID: 1717317)
Visitor Counter : 265