విద్యుత్తు మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి ముందు వరుసలో నిలుస్తున్న ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్‌లోని ఎన్‌టిపిసి స్టేషన్లు
Posted On:
08 MAY 2021 2:59PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి సెకెండ్ వేవ్‌పై పోరాటం చేసేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, విద్యుత్ ఉత్పత్తిలో దిగ్గజమైన ఎన్‌టిపిసి లిమిటెడ్ తన మద్దతును ఇస్తోంది. డబ్ల్యుఆర్ 2కు చెందిన అన్ని స్టేషన్లు, ప్రాజెక్టులు తమతమ జిల్లాలో జిల్లా యంత్రాంగానికి కోవిడ్-19పై పోరాటానికి తోడ్పాటును అందించేందుకు చురుకుగా సహకరిస్తున్నాయి.
కరోనావైరస్ మహమ్మారి మార్చి 2020లో విరుచుకుపడటం, ఫలితంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో కూడా విద్యుత్ ఉత్పత్తి రంగ సిబ్బంది విద్యుత్తు జాతీయ గ్రిడ్‌కు నిరంతరం సరఫరా అవుతూ, ఇళ్ళలో దీపాలు వెలుగుతూ, అత్యవసర సేవలు నిరాటంకంగా కొనసాగేందుకు సమర్ధవంతంగా పని చేశారు.
పిపిఇ కిట్లు, వెంటిలేటర్లను సేకరించేందుకు జిల్లా పాలనా నయంత్రాంగానికి ఆర్ధిక సహాయం చేయడంతో పాటుగా సిపట్‌లోని ఎన్‌టిపిసి, మస్తూరీలో కోవిడ్ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జిల్లా పాలనా యంత్రాంగానికి ఆర్ధిక సహాయం చేస్తోంది.
కోవిడ్-19పై పోరాటం చేసేందుకు కోర్బాలోని జిల్లా కోవిడ్ ఆసుపత్రికి సిటి స్కాన్ మెషీన్‌ను సమకూర్చేందుకు కోర్బా స్టేషన్ ముందుకు వచ్చింది. అంతేకాకుండా, వారు సమీప గ్రామాలలో శానిటైషన్ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.
సార్స్ కోవ్-2 నేపథ్యంలో వెంటిలేటర్లను కొనుగోలు చేసేందుకు రాయగఢ్ జిల్లా కలెక్టరుకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఎన్‌టిపిసి లారా ముందుకు వచ్చింది. క్లిష్ట సమయంలో అందరం కలిసి ఉన్నాం. తమ సమాజ సంక్షేమానికి ఎన్‌టిపిసి కట్టుబడి ఉంది, ఇటువంటి సమయంలో కోవిడ్-19కు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు మేం చేయగలిగింది చేస్తున్నామని రెడ్ (వెస్ట్ 2) సంజయ్ మదన్ చెప్పారు.
ఎంపి గదార్వారా, ఖర్గాన్ లోని డబ్ల్యుఆర్ 2 స్టేషన్లు కూడా కోవిడ్ -19పై పోరాటంలో చురుకైన పాత్రను పోషిస్తున్నాయి. ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి, సనావర్ లో 20 పడకలకు ఆక్సిజన్ సెంట్రల్ లైన్ పనికి ఖర్గాన్ తోడ్పాటు అందిస్తోంది. ఇదే కాకుండా, ఎన్‌టిపిసి డబ్ల్యుఆర్ 2కు చెందిన అన్ని స్టేషన్లు మాస్కులు, పిపిఇ కిట్, హాండ్ గ్లోవ్స్, తలకు పెట్టుకునే కవచాలు, శానిటైజర్లు, థర్మామీటర్లను పంచుతున్నాయి.
***
(Release ID: 1717277)
Visitor Counter : 211