అణుశక్తి విభాగం
కొవిడ్ మహమ్మారిపై పోరాడేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందించేందుకు అణు ఇంధన శాఖ సహకరిస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
Posted On:
07 MAY 2021 4:16PM by PIB Hyderabad
భాభా అటామిక్ సెంటర్ అణు ఇంధన శాఖ (డిఎఇ) కొవిడ్ చికిత్సకు సంబంధించిన పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలుస్తుందని కేంద్ర అభివృద్ధి ఈశాన్య ప్రాంత (డీఓ ఎన్ఈఆర్)(ఇండిపెండిండెంట్ చార్జ్ ఎంఓఎస్) పిఎంఓ, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షశాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించించారు. ఆయన డిపార్ట్మెంట్ సీనియర్ అధికారులతో శుక్రవారం ఆన్‌లైన్ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ కొవిడ్-19 సమయంలో ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను ప్రశంసించారు.
కోబాల్ట్ మూలాన్ని ఉపయోగించి పిపిఇ కిట్ల స్టెరిలైజేషన్ కోసం తయారు చేసిన ప్రోటోకాల్ వల్ల వాటిని తిరిగి ఉపయోగించుకునే అవకాశం ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. హెఫా ఫిల్టర్ టెక్నాలజీని ఉపయోగించి ఎన్-99 మాస్కుల తయారు చేయడం గురించి మాట్లాడుతూ.. ఇవి ఎన్-95, ఎన్-99 మాస్కుల కంటే ఇవి ఉత్తమమని ఇప్పటికే మూడు స్వతంత్ర ప్రయోగశాలలు ధృవీకరించాయని వెల్లడించారు. హెఫా మాస్కులు ఎన్ -95 మాస్కుల కంటే మన్నికైనవి, చౌకైనవి కాబట్టి పెద్ద ఎత్తున వీటిని తయారు చేయడానికి ఈ టెక్నాలజీని బదిలీ చేశామని ప్రకటించారు. ఆర్టీ-పిసిఆర్ పరీక్షల కోసం అణు ఇంధన విభాగం విజయవంతంగా రసాయన కారకాలను అభివృద్ధి చేసిందన్నారు. రెస్పిరేటర్లు, రీఫర్, పోర్టబుల్ ప్లాస్మా స్టెరిలైజేషన్ వంటి వైద్య వ్యర్థాల తొలగింపు కోసం, ప్లాస్మా భస్మీకరణ కోసం కూడా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
అన్ని టాటా మెమోరియల్ హాస్పిటల్లో కొవిడ్ సోకిన కేన్సర్ రోగుల కోసం 600 పడకలలో 25 శాతం కేటాయించామని డాక్టర్ జితేంద్ర సింగ్కు సీనియర్ అధికారులు తెలియజేశారు. దాదాపు 6 ఎల్‌పిఎమ్‌ల కెపాసిటీల గల 5,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను టాటా మెమోరియల్ సెంటర్, టిఎంసీలు విదేశాల నుండి విరాళంగా స్వీకరిస్తున్నాయి. వీటిలో ఎక్కువ భాగం దేశంలోని ఇతర క్యాన్సర్ ఆసుపత్రులకు అందజేస్తారు.
కోవిడ్ -19 తీవ్రతకు జన్యుపరమైన గ్రహణశీలతను నిర్ణయించడానికి టాటా మెమోరియల్ హాస్పిటల్‌తో సహకారంతో “ నిఘా అధ్యయనం” జరుగుతోందని మంత్రి తెలియజేశారు. ఇది ఒక ప్రత్యేకమైన, అరుదైన అధ్యయనమని అని అభివర్ణించారు. ఫలితాలు అతి త్వరలో ప్రపంచ శాస్త్రీయ సమాజానికి అందిస్తారు. అంతేకాకుండా, కోవిడ్ -19 తీవ్రతను అంచనా వేయగల మౌఖిక సంకేతాల గురించి తెలుసుకోవడానికి మరో అధ్యయనం జరుగుతోంది.
గత ఏడాది జూన్‌లో కోవిడ్ బీప్‌ను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేసుకున్న డాక్టర్ జితేంద్ర సింగ్, ఐఐటి హైదరాబాద్, ఇఎస్ఐసి మెడికల్ కాలేజీ హైదరాబాద్ సహకారంతో డీఏఈ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ వైర్‌లెస్ ఫిజియోలాజికల్ కరోనా మానిటరింగ్ సిస్టమ్ అని వివరించారు. భారతదేశంలోని ప్రఖ్యాత సంస్థలు సమన్వయంతో పనిచేస్తే దేశం ఎదుర్కొంటున్న చాలా సవాళ్లకు పరిష్కారాలను ఎలా అందించవచ్చో చెప్పడానికి కోవిడ్ బీప్ ఒక చక్కటి ఉదాహరణ అని ఆయన అన్నారు. ఇలాంటి వాటి వల్ల నిజమైన ఆత్మనిర్భర్ భారత్ ఏర్పడుతుందని అన్నారు. ఈ సమావేశంలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పిసిఐఎల్) చైర్మన్ శర్మ, కార్యదర్శి కె. ఎన్. వ్యాస్, బార్క్ డైరెక్టర్ డాక్టర్ ఏకే మొహంతీ, డిపార్ట్మెంట్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1717096)
Visitor Counter : 215