రైల్వే మంత్రిత్వ శాఖ
అస్సాంలోని గౌహతి వద్ద 21, సిల్చార్ సమీపంలోని బదార్‌పూర్ వద్ద 20 ఐసోలేషన్ కోచ్‌లను అందుబాటులో తేనున్న రైల్వే శాఖ
- ఈ వారం ప్రారంభంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వపు డిమాండ్ మేరకు 19 ఐసోలేషన్ కోచ్‌లను సబర్మతి, చాండ్లోడియా వద్ద మోహరించిన రైల్వేశాఖ
- 378 పడకలతో కూడిన 21 కోవిడ్ సంరక్షణ కోచ్‌లు 70 పడకల సామర్థ్యం కలిగిన 5 కోవిడ్ కేర్ కోచ్‌లు వరుసగా పల్ఘర్, జబల్‌పూర్‌లో పనిచేస్తున్నాయి
- దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 17 స్టేషన్లలో దాదాపు 4700 పడకల సామర్థ్యం కలిగిన మొత్తం 298 ఐసోలేషన్ కోచ్‌లు అందుబాటులోకి..
- ఐసోలేషన్ వసతులతో కూడిన 70,000 పడకలు కలిగిన 4400 కన్నా ఎక్కువ కోవిడ్ కేర్ కోచ్‌లు రైల్వే ద్వారా అందుబాటులోకి..
- కోవిడ్ నేపథ్యంలో రైల్వేలు చేసిన పరిశుభ్రత, క్యాటరింగ్ ఏర్పాట్లపై రోగుల నుంచి సానుకూల స్పందన
Posted On:
07 MAY 2021 3:37PM by PIB Hyderabad
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మహమ్మారిపై నిరంతర పోరాటంలో భాగంగా భారతీయ రైల్వే వేగంగా చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగా దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తి మేరకు అవసరమైన ప్రదేశాలకు ఐసోలేషన్ కోచ్‌లను వేగంగా తరలించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సత్వర చర్యలు తీసుకుంటోంది. ఈ పని కోసం రైల్వే తన శక్తిని, అవసరమైన సామగ్రిని సమీకరించుకుంటోంది. ఐసోలేషన్ యూనిట్లుగా పనిచేయడానికి రైల్వే 7000 పడకలతో కూడిన 4400కి పైగా ఐసోలేషన్ కోచ్‌ల సముదాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అస్సాం రాష్ట్రం నుండి అందిన తాజా డిమాండ్లతో రైల్వే శాఖ 21 ఐసోలేషన్ కోచ్‌లను గౌహతికి, 20 ఐసోలేషన్ కోచ్‌లను అస్సాంలోని సిల్చార్ (ఎన్.ఎఫ్.రైల్వే) సమీపంలో బదార్‌పూర్‌కు తరలించింది. ఈ వారం ప్రారంభంలో సబర్మతి, చాండ్లోడియా, డిమాపూర్ వద్ద ఐసోలేషన్ కోచ్లను నియమించింది. రాష్ట్రాల డిమాండ్ ప్రకారం ప్రస్తుతం 4700 పడకలకు పైగా సామర్థ్యం కలిగిన 298 బోగీలను కోవిడ్ సంరక్షణ కోసం వివిధ రాష్ట్రాలకు రైల్వే అప్పగించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నుండి తాజాగా అందిన డిమాండ్ మేరకు రైల్వే శాఖ సబర్మతికి 10, చందోలియాకు 06 బోగీలను తరలించాయి. నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ ప్రకారం, రైల్వే శాఖ దిమాపూర్ వద్ద 10 ఐసోలేషన్ కోచ్లను ఏర్పాటు చేసింది. 70 పడకల సామర్థ్యముతో పాటుగా వైద్య సిబ్బందికి సౌకర్యంగా ఉండేలా ఒక కోచ్‌తో సహా జబల్పూర్ వద్ద మొత్తం 05 ఐసోలేషన్ కోచ్‌లు మోహరించబడ్డాయి. ఇప్పుడు ఈ కోచ్‌లు పూర్తిస్థాయిలో పని చేస్తూ సేవలందిస్తున్నాయి. జిల్లా అధికారులతో ఒప్పంద నిబంధనల ప్రకారం రైల్వేలు పాల్ఘర్ వద్ద వైద్య అవసరాల కోసం 21 కోచ్‌లను ఏర్పాటు చేసింది. తాజాగా ఇవి పని చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ఆరోగ్య అధికారుల అవసరం మేరకు ప్రాణ వాయువును అందించేందుకు వీలుగా
ఈ కోచ్‌లలో 2 జతల ఆక్సిజన్ సిలిండర్లను కూడా అందుబాటులో ఉంచారు.
ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రదేశాలలో ఐసోలేషన్ కోచ్‌ల వినియోగానికి సంబంధించిన తాజా సమాచారం ఈ కింది విధంగా ఉందిః
నంద్రుబార్ (మహారాష్ట్ర) వద్ద, గత రెండు రోజులలో 10 మంది కొత్తగా ఈ కోచ్‌లో చికిత్స నిమిత్తం చేరగా.. ఇంతకుముందు 10 మంది రోగులు ఈ ఐసోలేషన్ సదుపాయం నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఐసోలేషన్ కేంద్రంలో ప్రస్తుతం 26 మంది చికత్స పొందుతున్నారు. మొత్తంగా ఇక్కడ రాష్ట్ర ఆరోగ్య అధికారులు 88 మంది రోగులను డిశ్చార్జ్ చేయగా 114 మంది కోవిడ్ రోగులు ఇక్కడ చికిత్స కోసం చేరారు. రైల్వే 11 కోవిడ్ కేర్ కోచ్‌లను (ఒక కోచ్ వైద్య సిబ్బంది మరియు సామాగ్రి కోసం ప్రత్యేకంగా పనిచేస్తోంది) అజ్ని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోలో ఉంచారు. దీనిని నాగ్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్‌కు వారికి అప్పగించారు. ఇక్కడ ఇప్పటి వరకు మొత్తం 9 మంది రోగులు చికిత్స కోసం చేరారు. ఆరు మంది డిశ్చార్జ్ అయ్యారు.
- 2 కోచ్‌ల కోసం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన డిమాండ్‌కు సంబంధించి, పశ్చిమ రైల్వేలోని రత్లం డివిజన్ ఇండోర్ సమీపంలోని తిహి స్టేషన్ వద్ద 320 పడకల సామర్థ్యంతో కూడిన.. 22 కోచ్‌లను రైల్వే శాఖ మోహరించింది. ఇప్పటివరకు ఇక్కడ 19 మంది రోగులు చేరగా, 1 రోగి డిశ్చార్జ్ అయ్యారు. భోపాల్‌లో 20 బోగీలను మోహరించారు. ఈ సౌకర్యం వద్ద తాజా సమాచారం ప్రకారం 10 మంది రోగులతో సహా 28 ప్రవేశాలు జరిగాయి. ఈ రోజు నాటికి దాదాపు 18 మంది రోగులు ఈ బోగీ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ సౌకర్యంలో 302 పడకలను అందుబాటులో ఉంచారు.
- ఢిల్లీ ప్రభుత్వం కోరిక మేరకు 1200 పడకల సామర్థ్యం కలిగిన 75 కోవిడ్ కేర్ కోచ్‌ల రైల్వే అందించింది. షకుర్‌బస్తీ వద్ద 50 కోచ్‌లు, ఆనంద్ విహార్ స్టేషన్లలో 25 కోచ్‌లను అందుబాటులో ఉంచారు. ఇక్కడ ఇప్పటి వరకు
ఐదుగురు చికిత్స కోసం చేరి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 1200 పడకలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. తాజా రికార్డుల ప్రకారం పైన పేర్కొన్న రాష్ట్రాల్లో ఈ సదుపాయాల వినియోగం మెరుగ్గా ఉంది. ఈ సదుపాయాలలో మొత్తంగా 117 మంది చేరి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 60 మంది కోవిడ్ రోగులు ఐసోలేషన్ కోచ్‌లను ఉపయోగిస్తున్నారు.
- నార్త్ ఫ్రాంటియర్ రైల్వేలో అస్సాంలోని సిల్చార్ సమీపంలో గౌహతి మరియు బదర్పూర్ వద్ద ఇటీవల కోచ్‌లను మోహరించడంతో కలుపుకొని మొత్తం 4700 పడకలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.
- ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కోచ్‌ల సరఫరా గురించి అభ్యర్థించనప్పటికీ కూడా ఫైజాబాద్, భడోహి, వారణాసి, బరేలి & నజీబాబాద్‌లలో ఒక్కొక్క చోట 10 కోచ్‌లు ఏర్పాటు చేయడమైంది. ఇవి మొత్తం 800 పడకల (50 బోగీలు) సామర్థ్యమును కలిగి ఉన్నాయి.
***
(Release ID: 1716945)
Visitor Counter : 200