ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రామ్ మనోహర్ లొహియా ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్


కోవిడ్ రోగుల చికిత్సా ఏర్పాట్లపై సమీక్ష

ఆరోగ్య రక్షణ కార్యకర్తల నిర్విరామ కృషికి
కేంద్రమంత్రి ధన్యవాదాలు

సత్వరం ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుపై ఆసుపత్రి సిబ్బంది సంతృప్తి

Posted On: 07 MAY 2021 3:35PM by PIB Hyderabad

కోవిడ్ వైరస్ తో తీవ్రంగా అస్వస్థులైన రోగుల చికిత్సకోసం న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు స్వయంగా సమీక్ష జరిపారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ బాధితుల చికిత్సా ఏర్పాట్లను కేంద్రమంత్రి కొంతకాలంగా స్వయంగా సమీక్షిస్తూ వస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇటీవల ఢిల్లీలోని లేడీ హార్డింగే వైద్య కళాశాల ఆసుపత్రిని కూడా డాక్టర్ హర్షవర్ధన్ సందర్శించారు.

   కోవిడ్-19 కేసులు ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోతున్న నేపథ్యంలో, దేశ రాజధానిలో నిరాటంకంగా అక్సిజన్ సరఫరా, ఆక్సిజన్, ఐ.సి.యు. సదుపాయం ఉన్న పడకలు,  మందుల ఏర్పాటు, శిక్షణ పొందిన మానవ వనరుల లభ్యత వంటి  అంశాలపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది.  ఆ సదుపాయాలను వెంటనే భారీ స్థాయిలో విస్తృతపరిచారు. కోవిడ్.కు సంబంధించి ఢిల్లీలో తలెత్తుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అందుకు తగినట్టుగా భారత ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. క్రమం క్రమంగా తగిన పరిష్కార చర్యలు తీసుకుంటోంది. దేశంలో కోవిడ్ వైరస్ మహమ్మారిపై పోరాటానికి కేంద్ర ప్రభుత్వం సారథ్యం వహిస్తోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహాయ సహకారాలతో “సంపూర్ణ స్థాయి ప్రభుత్వ చర్య” ద్వారా కేంద్రం ఈ పోరు కొనసాగిస్తోంది.

  రామ్ మనోహర్ లొహియా ఆసుపత్రి ఆవరణలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కూడా కేంద్రమంత్రి ఈ రోజు సందర్శించారు. అక్కడ వ్యాక్సిన్ తీసుకుంటున్న లబ్ధిదారులతో, వ్యాక్సినేషన్ అనంతరం పర్యవేక్షణ ప్రక్రియలో ఉన్న వారితో ఆయన ముచ్చటించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతా సజావుగా సాగుతోందని వారు ఈ సందర్భంగా కేంద్రమంత్రికి వివరించారు. టీకా తీసుకున్న తర్వాత ఆరోగ్యపరంగా తమకెలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదంటూ వ్యాక్సిన్ తీసుకున్న వారు తెలిపారు.

https://ci4.googleusercontent.com/proxy/zLjOA0Su-9YtItEsTG_X73O-Egs_9_CcXN6EVYSuTMwgi8tzurXgT7SzcBRIQXoZhmrIf6OOpwujdZNIVJdd0MxQjI7HzFZBD70IxSQMwNfgk6AeLDtwo52SKw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001GN2R.jpg

 అనంతరం ఆసుపత్రిలోని ఆరోగ్య రక్షణ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి నిరిరామంగా పనిచేస్తున్నందుకు వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైద్య సిబ్బంది సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రమంత్రి  తెలియజేశారు. ఈ నిర్ణయంతో వారిపై పనిభారం బాగా తగ్గే అవకాశం ఉందని కూడా చెప్పారు.

https://ci4.googleusercontent.com/proxy/DsJIZtKeLlUY_xACjkfCuidElRlFAj9faH3_c-ZYGMnH_-Dyxw6penmKHk7WQXQRcbjLey3Q2L9mOZIZHCYHjio8bod46MH0PQpinqWaOKP4mi4x1UyOm2kZ5A=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002ORVA.jpghttps://ci6.googleusercontent.com/proxy/_TCWSdljAxtz_WGDjkqJdSb7p89HfGKBJg7qwUGA_6Bb6sRKm0fBxfAH6BqIdexBVhxe9UtjlKLWq3dF9npYn0TGa3agZ6rRH5FD5tTCqPVLIucmCKhE-isN3w=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003Q2XK.jpg

   ఆసుపత్రిలో పడకల సదుపాయంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకలు, ఐ.సి.యు.-కృత్రిమ శ్వాస ఏర్పాట్లు ఉన్న పడకలు, తదిత ఏర్పాట్లను కూడా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.కె. సింగ్ రాణా మాట్లాడుతూ, కోవిడ్ బాధితుల సత్వర అవసరాలకు తగినట్టుగా పడకల లభ్యతను పెంపొందించేందుకు తీసుకున్న చర్యలను వివరించారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సకు కేటాయించిన రెండు భవనాల్లో తొలుత మొత్తం 172 పడకలు ఉండేవి. వాటిలో 158 పడకలు కోవిడ్ ఆక్సిజన్ సదుపాయం ఉన్నవి కాగా, 14 పడకలు ఐ.సి.యు. సదుపాయం ఉన్నవి. కేవలం వ్యాధి లక్షణాల ప్రాతిపదికగా కోవిడ్ అనుమానిత రోగులను చేర్చుకునేందుకు కేటాయించిన భవనంలో 44 పడకల సౌకర్యం ఉంది. వాటిలో 30 పడకలు ఆక్సిజన్ సదుపాయం ఉన్నవి కాగా, 14 పడకలు ఐ.సి.యు. సదుపాయం కలిగినవి. ఇటీవల కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిన నేపథ్యంలో కోవిడ్ రోగులకు అదనంగా మరో 33 ఆక్సిజన్ పడకలు, ధ్రువపడని రోగులకోసం10 కోవిడ్ ఐ.సి.యు. పడకలను చేర్చారు. దీనితో ఆసుపత్రిలో మొత్తం పడకల సంఖ్య 215కు చేరింది.

  కేంద్రమంత్రి సూచనలపై ఆసుపత్రిలో వెంటనే అదనంగా 200 కోవిడ్ పడకలను ఏర్పాటు చేసేందుకు  చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఇతర వ్యాధులు, రుగ్మతలకు సంబంధించిన రోగులను మరో చోటికి తరలించిన తర్వాత, సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ పడకలు ఎర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ పడకలన్నీ ఆక్సిజన్ సదుపాయంతో ఉంటాయని, వాటిలో కొన్నింటిని కోవిడ్ ఐ.సి.యు. పడకలుగా తీర్చిదిద్దుతామని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

.https://ci6.googleusercontent.com/proxy/J31o0OjIQwxJL3MTUNA5GH7K5KgEbwom_ve-QOmnUz7kzRgY2gL33Y0OuwWIgocmcNbk3r0RYPJ3xlQm_NxMsSsXKala9hyuJptkOtztRRuP3FPwB4uCqux_QA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004GEOT.jpg

   ఆసుపత్రి ఆవరణలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ.) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఉత్పాదనా ప్లాంటును తనిఖీ చేయడంతో డాక్టర్ హర్షవర్ధన్ తన సందర్శనను ముగించారు. ఆసుపత్రిలో రెండు ద్రవీకృత ఆక్సిజన్ చేంబర్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి 12 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో, మరొకటి 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. నిమిషానికి వెయ్యి లీటర్ల ప్రవాహ సామర్థ్యంతో కూడిన ఆక్సిజన్ ప్లాంటును సత్వరం ఏర్పాటు చేయడంపట్ల ఆసుపత్రి సిబ్బంది, రోగుల బంధువులు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది ప్రస్తుతం ఆక్సిజన్ అవసరాలను తీర్చగలదని వారు అభిప్రాయపడ్డారు.

  రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి సందర్శనలో కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెంట,.. ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.కె. రాణా, వైద్య విభాగం అధిపతి డాక్టర్ ఎం.పి.ఎస్. చావ్లా, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమిత్ సూరి, ఆసుపత్రి సీనియర్ అధికారులు, డి.ఆర్.డి.ఒ. అధికారులు ఉన్నారు.

 

****(Release ID: 1716943) Visitor Counter : 172