పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
గోవా విమానాశ్రయం నుంచి కొనసాగుతున్న వైద్య అత్యవసరాల నిరాటంక బట్వాడా
Posted On:
07 MAY 2021 10:15AM by PIB Hyderabad
అత్యవసర వైద్య పరికరాలు, మందులను నిరాటకంగా బట్వాడాను సుగమం చేస్తూ కోవిడ్-19పై పోరాటంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గోవా అంతర్జాతీయ విమానాశ్రయం, ఆయా సంస్థల ఫ్రంట్‌లైన్ కరోనా యోధులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
కోవిడ్-19పై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వడానికి జాతి వ్యాప్త లాక్‌డౌన్ నడుమ మొత్తం దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు అత్యవసర వైద్య కార్గో (సరుకు)ను రవాణా చేసేందుకు ఉద్దేశించిన 8 లైఫ్ లైన్ ఉదాన్ విమానాలకు గోవా విమానాశ్రయం తన సేవలను అందించింది. దేశంలోకి వచ్చిన 2.15 మెట్రిక్ టన్నుల, 3.96 మెట్రిక్ టన్నుల బయిటకు వెళ్ళే సరుకు మొత్తాన్ని నిర్వహించింది. జనవరి, ఫిబ్రవరి 2021 నెలల్లో గోవా రాష్ట్రానికి వచ్చిన మూడు లాట్లు, పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు వచ్చిన ఒక లాట్‌లను గోవా విమానాశ్రయం నిర్వహించింది.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా ముందెన్నడూ లేనివిధంగా ఏర్పడిన పరిస్థితిని పరిష్కరించేందుకు గోవా అంతర్జాతీయ విమానాశ్రయం తన మిషన్‌ను బలోపేతం చేయడం ద్వారా అత్యవసర వైద్య అవసరాలైన కోవిడ్ వాక్సిన్లు, ఫాబిఫ్లూ మందులు, కోవిడ్-19 టెస్టింగ్ కిట్లు, ఇతర అత్యవసరాలను నిరాటకంగా సరఫరా చేస్తూ, తన కార్యక్రమాన్ని ఆపలేదు. మహమ్మారి రెండవ దశలో గోవా రాష్ట్రానికి కోవిడ్ వాక్సిన్ రావడానికి గోవా విమానాశ్రయం సౌలభ్యాన్ని కల్పించింది. ఇది రాష్ట్రంలోకి వచ్చే సరుకును అందుకోవడంలో భాగంగా చేసి, పంపిన సరుకు వేగవంతంగా బయిటకు పంపి, సాధ్యమైనంత తక్కువ సమయంలో అది ఆరోగ్య అధికారులకు అప్పగించింది.
చెన్నై నుంచి 13 బాక్సుల కోవిడ్ వాక్సిన్ (కోవిషీల్డ్)ను 18.04.2021న అందుకున్నారు.
ముంబై నుంచి 9 బాక్స్‌ల కోవిడ్ వాక్సిన్ (కోవిషీల్డ్)ను 30.04.2021న అందుకున్నారు.
ఢిల్లీ నుంచి 122 కెజీల కోవిడ్-19 టెస్టింగ్ కిట్లను 23.04.2021న అందుకున్నారు.
రాష్ట్రంలోకి వచ్చే సరుకుకు అదనంగా, గ్లెన్ మార్క్ ఉత్పత్తి అయిన ఫాబిఫ్లూ మందులను బయిటకు వెళ్ళే సరుకుకు సౌలభ్యం కల్పించడంలో గోవా విమానాశ్రయం కీలక పాత్ర పోషించింది. బయిటకు వెళ్ళే కార్గో అహ్మదాబాద్, బెంగళూరు, ఛెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, జైపూర్, హైదరాబాద్, ఇందోర్, నాగ్‌పూర్ సహా దేశంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేయడంలో పాత్ర పోషించింది. బయిటకు వెళ్ళే సరుకులో భాగంగా మొత్తం 31,955 కిలోల ఫాబిఫ్లూ మందులు గోవా విమానాశ్రయం నుంచి రవాణా అయ్యాయి. ఒకమాదిరి నుంచి తేలికపాటి కోవిడ్ లక్షణాలు కలిగిన రోగుల చికిత్స కోసం ఫాబిఫ్లూ ఉపయోగిస్తారు. అతి చిన్న రాష్ట్రమైనప్పటికీ గోవా కోవిడ్-19పై పోరాటంలో ముందు వరుసలో నిలిచి ప్రముఖ పాత్ర పోషిస్తోంది, గోవా అంతర్జాతీయ విమానాశ్రయం 24x7 అందుకు ద్వారంగా పనిచేస్తోంది.
అదనంగా, ఎఎఐ ఉద్యోగులు, ఎయిర్ లైన్స్, ఏజెన్సీలు, విమానాశ్రయంలో పని చేస్తున్న ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు గోవా ప్రభుత్వ భాగస్వామ్యం, మద్దతుతో కోవిడ్ వాక్సినేషన్ శిబిరాన్ని నిర్వహించేందుకు గోవా విమానాశ్రయం కృషి చేస్తోంది.
***
(Release ID: 1716767)
Visitor Counter : 244