శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

తమ సాంకేతికతలను మూడు ఎం.ఎస్.ఎం.ఈ. లకు బదిలీ చేసిన - సి.ఎస్.ఐ.ఆర్-సి.ఎమ్.ఈ.ఆర్.ఐ.

Posted On: 06 MAY 2021 10:07AM by PIB Hyderabad

సి.ఎస్.ఐ.ఆర్-కేంద్ర మెకానికల్ ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ, తన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సాంకేతికతనూ, అలాగే హై ఫ్లో రేట్ ఐరన్ రిమూవల్ ప్లాంట్ సాంకేతికతనూ, దృశ్యమాధ్యమం ద్వారా 05.05.2021 తేదీన బదిలీ చేసింది.  ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని, రాజస్థాన్, కోటా లోని సి & ఐ కాలిబ్రేషన్స్ ప్రై. లిమిటెడ్ అనే సంస్థకూ, గుర్గావ్, ఐ.ఎం.టి. మానెసర్ లోని ఎస్.ఏ. కార్ప్ అనే సంస్థకూ , బదిలీ చేయడం జరిగింది. కాగా, హై ఫ్లో రేట్ ఐరన్ రిమూవల్ ప్లాంట్ సాంకేతికతను, గౌహతిలోని మా దుర్గా సేల్స్ ఏజెన్సీకి బదిలీ చేశారు.

సి.ఎస్‌.ఐ.ఆర్-సి.ఎమ్‌.ఇ.ఆర్‌.ఐ. డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) హరీష్ హిరానీ, మాట్లాడుతూ, ఎమ్.ఎస్.ఎం.ఈ. లను ప్రోత్సహించడానికి, సి.ఎస్‌.ఐ.ఆర్-సి.ఎమ్‌.ఇ.ఆర్‌.ఐ. ప్రయత్నిస్తోందని, చెప్పారు. తద్వారా వారు ఈ ఉత్పత్తిని ప్రజలకు చేరువలో తయారు

చేయగలుగుతారని అన్నారు. ఆవిష్కరణలను, సాధారణ ప్రజలకు చేరువలో తీసుకురావడానికి ప్రయత్నించే  ప్రతి ఒక్కరికీ సహాయపడాలన్నదే, సి.ఎస్‌.ఐ.ఆర్-సి.ఎమ్‌.ఇ.ఆర్‌.ఐ. ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఇందు కోసం, తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పాదక సామర్థ్యాలను కలిగి ఉన్న ఎం.ఎస్.ఎం.ఈ. ల సహకారం తమకు చాలా అవసరమని, ఆయన చెప్పారు. 

గువహతి లోని ‘మా దుర్గా సేల్స్ ఏజెన్సీ’ కి చెందిన ఓంకార్ బన్సాల్ మాట్లాడుతూ, అస్సాంలోని పలు ప్రాంతాలు తాగునీటిలో అధికంగా ఇనుము కలుషితమైన సమస్యను ఎదుర్కొంటున్నాయని, చెప్పారు.  కాగా, అస్సాం లోని కామరూప్ మెట్రో, కామరూప్ అర్బన్, బార్పేట, శివసాగర్ అనే నాలుగు అత్యంత ప్రభావిత జిల్లాల్లో, తమ సంస్థ పని ప్రారంభించాలని యోచిస్తోందని, తెలిపారు.  ప్రస్తుతం, గంటకు 1,000 లీటర్ల సామర్థ్యం తో నీటిని శుద్ధి చేసే 700 చిన్న యూనిట్లను ఏర్పాటు చేయడానికి తమ కంపెనీ కృషి చేస్తోందని, ఆయన, చెప్పారు.  ప్రభుత్వం, సంబంధిత పంచాయతీల నుండి అందుకున్న ప్రాజెక్టులలో భాగంగానూ, అలాగే, భారత ప్రభుత్వ జల్ జీవన్ మిషన్‌ లో భాగంగా కూడా, అస్సాంలోని వివిధ జిల్లాల్లో, అధిక (గంటకు 6,000 నుండి 12,000 లీటర్లు) ప్రవాహ వేగంతో, ఇనుమును నిర్మూలించే, సి.ఎస్.ఐ.ఆర్-సి.ఎమ్‌.ఈ.ఆర్.ఐ. సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఏర్పాటు చేయాలని తమ కంపెనీ యోచిస్తున్నట్లు కూడా, ఆయన, తెలియజేశారు. 

రాజస్థాన్, కోటా లోని ‘సి & ఐ కాలిబ్రేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కు చెందిన శ్రీ అశోక్ పట్ని, ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ యొక్క ఉత్పత్తి అభివృద్ధిపై ప్రోత్సహించినందుకు, ప్రొఫెసర్ హిరానీ మరియు ఇన్స్టిట్యూట్ యొక్క సంబంధిత బృందానికి, ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.  ఉత్పత్తిని తయారు చేయడానికి తమకు తగినంత మౌలిక సదుపాయాలు ఉన్నాయనీ, ఎన్‌.ఎ.బి.ఎల్. గుర్తింపు పొందిన ప్రయోగశాలలు ఉండటం వల్ల  కూడా తాము ప్రయోజనం పొందుతున్నామనీ, తద్వారా తాము 700 కి పైగా పరికరాల పరీక్షలు నిర్వహిస్తున్నామనీ, ఆయన, వివరించారు.  ప్రస్తుత మహమ్మారి దృష్టాంతంలో, ప్రజలు ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేకుండా, వారికి అవసరమైన సహాయాన్ని అందించడానికి వీలుగా గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేయడం ద్వారా సమాజానికి సహాయం చేయాలనుకుంటున్నట్లు, ఆయన పేర్కొన్నారు.  ప్రస్తుతానికి, తాము 5 లీటర్ల సామర్థ్యం గల కాన్సన్ట్రేటర్లపై దృష్టి సారించి, దేశంలోని ప్రతి మారు మూల ప్రాంతానికీ చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నామని కూడా, ఆయన, చెప్పారు.  ప్రస్తుతానికి నెలకు 3,000 నుండి 4,000 యూనిట్ల కాన్సన్ట్రేటర్లు తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  ముడి పదార్థాల లభ్యత, వ్యయ అంశాలలో కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ, దిగుమతి ప్రత్యామ్నాయం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

గుర్గావ్‌, ఐ.ఎం.టి, మానేసర్లో ‘ఎస్‌.ఏ. కార్ప్’ కు చెందిన శ్రీ దీపక్ జైన్ మాట్లాడుతూ, తాము, ప్రోటోటైప్‌ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నెలకు 5,000 యూనిట్లను లక్ష్యంగా పెట్టుకున్నామనీ, సాధ్యమైనంత త్వరగా, ఈ లక్ష్యాన్ని, మరింత పెంచుతామనీ, ఆయన, తెలియజేశారు.  ముడిసరుకు ధర అకస్మాత్తుగా పెరగడం వల్ల భారీ మొత్తంలో ఉత్పత్తి తగ్గుతుందని భావిస్తున్నందున ప్రోటోటైప్‌ ను అభివృద్ధి చేయడానికి ప్రారంభ వ్యయం 40,000 - 45,000 రూపాయల వరకు అవుతుందని కూడా, ఆయన పేర్కొన్నారు.  ఈ విషయంలో సహకరించాలని, ఆయన ఇనిస్టిట్యూట్‌ ను కూడా అభ్యర్థించారు.

 

*****



(Release ID: 1716747) Visitor Counter : 148