రైల్వే మంత్రిత్వ శాఖ

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు 161 ట్యాంకర్లలో 2511 మెట్రిక్‌ టన్నుల కంటే ఎక్కువ ఎల్‌ఎంవో వేర్వేరు రాష్ట్రాలకు పంపిణీ చేశాయి.


మొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ హపా నుండి రాజస్థాన్ (కోటా) కు వెళ్లింది

ఇప్పటివరకూ 40 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ ప్రయాణాన్ని పూర్తి చేశాయి

ఇప్పటివరకు మహారాష్ట్రకు 174 మెట్రిక్ టన్నులు, యుపికి 689 మెట్రిక్ టన్నులు, ఎంపికి 190 మెట్రిక్ టన్నులు, హర్యానాకు 259 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు 123 మెట్రిక్ టన్నులు, ఢిల్లీకు1053 మెట్రిక్ టన్నులు తరలించారు.

Posted On: 06 MAY 2021 7:16PM by PIB Hyderabad

అన్ని అడ్డంకులను అధిగమించి  కొత్త పరిష్కారాలను కనుగొనే భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ను పంపిణీ చేయడం ద్వారా ఉపశమనం కలిగించే ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు భారత రైల్వే 161 ట్యాంకర్లలో 2511 మెట్రిక్‌ టన్నుల (సుమారు) ఎల్‌ఎంవోను దేశంలోని వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసింది.
40 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేశాయి.
రాష్ట్రాల అభ్యర్థన మేరకు సాధ్యమైనంత తక్కువ సమయంలో సాధ్యమైనంత ఎల్‌ఎంఓను అందించడానికి భారత రైల్వే ప్రయత్నిస్తోంది.
ఇప్పటివరకు మహారాష్ట్రకు 174 మెట్రిక్ టన్నులు, యుపికి 689 మెట్రిక్ టన్నులు, ఎంపికి 190 మెట్రిక్ టన్నులు, హర్యానాకు 259 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు 123 మెట్రిక్ టన్నులు, ఢిల్లీకు1053  మెట్రిక్ టన్నులు తరలించారు.
ప్రస్తుతం 22 ట్యాంకర్లు 400 టన్నులకు పైగా ఎల్‌ఎంఓతో నడుస్తున్నాయి, ఇవి ఎంపి, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీకి ఆక్సిజన్‌ను తరలిస్తున్నాయి. కొత్త ఆక్సిజన్‌ అమలు విధానంలో డైనమిక్‌గా ఎప్పటికప్పుడు గణాంకాలు నవీకరించబడతాయి.

****



(Release ID: 1716651) Visitor Counter : 132