రైల్వే మంత్రిత్వ శాఖ

భారతీయ రైల్వే వందవ 12000 హెచ్పీ డబ్ల్యూఏజీ12 డీ లోకోమోటివ్‌ను ప్రవేశపెట్టింది.


భారతదేశపు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ ప్లాంటులో నిర్మితమైన ఇవి, దేశంలోని అత్యంత శక్తివంతమైన ‘మేడ్-ఇన్-ఇండియా’ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద ఈ లోకోమోటివ్ను తయారు చేశారు.

లోకోమోటివ్‌ను బీహార్లోని మాధేపురా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఈఎల్పీఎల్) తయారు చేసింది.

ఈ డబ్ల్యూఏజీ12B ఇ-లోకోస్ ఇప్పటికే 17 రాష్ట్రాలు & 2 కేంద్రపాలిత ప్రాంతాలలో సరుకులను 48 లక్షల కిలోమీటర్లకు పైగా దూరాలకు రవాణా చేశాయి.

ఈ లోకోమోటివ్‌లలో అత్యాధునిక ఆర్ట్ ఐజిబిటి బేస్డ్, 3 ఫేజ్ డ్రైవ్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి. 12000 హార్స్ పవర్ను విడుదల చేస్తాయి.

అధిక హార్స్పవర్ లోకోమోటివ్‌లు మరింత వేగంగా పరుగెడతాయి. సరుకు రవాణా, లోడింగ్ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల రైల్వే ట్రాక్లపై రద్దీ తగ్గుతుంది.

Posted On: 06 MAY 2021 6:06PM by PIB Hyderabad

 వందవ 12000 హెచ్‌పి వాగ్ 12 బి లోకోమోటివ్ను ఇండియన్ రైల్వే తమ ఇంజన్ల శ్రేణిలో చేర్చడం సంస్థకు గర్వకారణం. లోకోకు 60100 నంబరుతో  ‘డబ్ల్యూఏజీ12 బీ’ అని పేరు పెట్టారు. లోకోమోటివ్‌ను మాధేపురా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్  (ఎంఈఎల్పీఎల్) తయారు చేసింది. ఈ లోకోమోటివ్‌లలో అత్యాధునిక ఆర్ట్ ఐజిబిటి బేస్డ్, 3 ఫేజ్ డ్రైవ్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి.  12000 హార్స్ పవర్ను విడుదల చేస్తాయి. అధిక హార్స్పవర్ లోకోమోటివ్‌లు మరింత వేగంగా పరుగెడతాయి.  సరుకు రవాణా, లోడింగ్ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల రైల్వే ట్రాక్లపై రద్దీ తగ్గుతుంది. ఈ లోకోమోటివ్లో 706 కేఎన్ మ్యాగ్జిమం ట్రాక్టివ్ ఎఫర్ట్ ఉంటుంది. ఇది 150 లో ఒకటో గ్రేడియంట్తో 6000టీ రైలును నడపగలుగుతుంది. 22.5 (టన్నులు) యాక్సిల్ లోడ్ కలిగిన బో-బో డిజైన్‌తో లోకోమోటివ్ను 25 టన్నులకు పెంచవచ్చు. ఇది 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ‘మేక్-ఇన్-ఇండియా’  కార్యక్రమంలో భాగంగా నిర్మించిన ఈ ఉన్నతమైన ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు దేశంలో సరుకు రవాణా ఉద్యమంలో విప్లవాత్మక మార్పులు తేవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వేగంగా, సురక్షితంగా  భారీ సరుకు రవాణా రైళ్లను దేశవ్యాప్తంగా నడుపుతాయి. పట్టాలపై రద్దీని తగ్గిస్తాయి. అలాగే లోడింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇప్పటివరకు ఈ లోకోలు అన్ని రైల్వే డివిజన్లలోనూ మంచి పనితీరు కనబర్చాయి. ఇలాంటి మరిన్ని విజయాల కోసం రైల్వే ఎదురుచూస్తున్నది.

ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ నుంచి బొగ్గు రైళ్ల మరింత వేగంగా వెళ్లడానికి ఈ లోకోమోటివ్లు కీలకపాత్ర పోషిస్తాయని రుజువయింది. దాని వ్యూహాత్మక ప్రయోజనాల కోసం లోకోమోటివ్‌లను ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్, జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయవచ్చు.  మైక్రోవేవ్ లింక్ ద్వారా ఉపరితలంపై సర్వర్‌ల ద్వారా యాంటెన్నాలను నియంత్రించవచ్చు. ఈ డబ్ల్యూఏజీ12B ఇ-లోకోస్ ఇప్పటికే 17 రాష్ట్రాలు & 2 కేంద్రపాలిత ప్రాంతాలలో పలు సరుకులను 48  లక్షల కిలోమీటర్లకు పైగా దూరాలకు రవాణా చేశాయి.  మాధేపురా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భారతీయ రైల్వే ప్రొక్యూర్‌మెంట్ కమ్ మెయింటెనెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  మొదటి 12000 హెచ్‌పి మేడ్ ఇన్ ఇండియా లోకోమోటివ్‌ను బీహార్‌లోని మాధేపురా ఎలక్ట్రిక్ లోకో ఫ్యాక్టరీ తయారు చేసింది. దీనిని భారతీయ రైల్వే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జెఎన్ స్టేషన్ నుండి 18.05.2020 నుంచి దీనిని ప్రారంభించింది. 

***


(Release ID: 1716619) Visitor Counter : 246