ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ సమాజం నుండి అందుకున్న కోవిడ్-19 సహాయ సామాగ్రిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమర్ధవంతంగా కేటాయించిన - భారత ప్రభుత్వం


1764 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్; 1760 ఆక్సిజన్ సిలిండర్లు; 07 ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు; 450 వెంటిలేటర్లు; 1.35 లక్షల కంటే ఎక్కువగా రెమ్‌డెసివిర్ ఇంజంక్షన్లను ఇంతవరకు పంపిణీ చేయడం జరిగింది.

Posted On: 05 MAY 2021 8:45PM by PIB Hyderabad

గత కొన్ని వారాల నుండి దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది.   రోజువారీ కేసుల సంఖ్య తో పాటు,  మరణాల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాలు క్షీణిస్తున్నాయి.   రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో, కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పోరాటం లో భారత ప్రభుత్వం ముందంజలో ఉంది. ఇటువంటి క్లిష్ట సమయంలో, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రయత్నాలను బలోపేతం చేయడానికి వివిధ మార్గాలు, చర్యల ద్వారా, వాటికి అన్ని విధాలా మద్దతు, సహాయాన్ని అందించాలన్నదే, కేంద్ర ప్రభుత్వం లక్ష్యం.

వసుధైవ కుటుంబకం స్ఫూర్తితో,  ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా కొనసాగుతున్న సామూహిక పోరాటంలో భాగంగా, భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు, అంతర్జాతీయ సమాజం, తన సహాయాన్ని అందిస్తోంది. 

భారత ప్రభుత్వం, 2021 ఏప్రిల్, 27వ తేదీ నుండి కోవిడ్-19 ఉపశమన వైద్య సామాగ్రి మరియు పరికరాలను, యు.కే; ఐర్లాండ్; రొమేనియా; రష్యా; యు.ఎ.ఇ; అమెరికా; తైవాన్; కువైట్; ఫ్రాన్స్; థాయిలాండ్; జర్మనీ; ఉజ్బెకిస్తాన్; బెల్జియం; ఇటలీ మొదలైన వివిధ దేశాల నుండి అంతర్జాతీయంగా విరాళంగా, స్వీకరిస్తోంది

2021 ఏప్రిల్,  27వ తేదీ నుండి 2021 మే, 4వ తేదీ వరకు, మొత్తం మీద, 1,764 ఆక్సిజన్ కాన్సెన్ ట్రేటర్స్;  1760 ఆక్సిజన్ సిలెండర్లు;  7 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు; 450 వెంటిలేటర్లు; 1.35 లక్షల కంటే ఎక్కువగా రెంమ్డేసివిర్ ఇంజెక్షన్లతో పాటు; 1.20 లక్షల ఫేవిపైరవీర్ స్ట్రిప్స్ లను పంపిణీ చేయడం జరిగింది. 

2021 మే, 4వ తేదీన అందుకున్న ప్రధాన వస్తువులు:

·      ఆక్సిజన్ కాన్సెన్ ట్రేటర్లు - 1274; 

·      వెంటిలేటర్లు - 101; 

·      ఆక్సిజన్ సిలెండర్లు - 587;  

·      ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు / ప్లాంట్లు - 2; 

·      రెంమ్డేసివిర్  - 1,53,708; 

·      మెడికల్ క్యాబినెట్లు - 33   

2021 మే, 4వ తేదీ వరకు అందుకున్న అన్ని వస్తువులను, రాష్ట్రాలు / సంస్థలకు కేటాయించడంతో పాటు, దానిలో గణనీయమైన భాగం పంపిణీ చేయడం జరిగింది.  ఇది ఒక నిరంతర ప్రక్రియ.  

వైద్య, ఇతర ఉపశమన మరియు సహాయక సామగ్రిని సమర్థవంతంగా పంపిణీ చేయడానికీ, భారతదేశం అందుకున్న సహాయ సామాగ్రిని కేటాయించడానికీ, భారత ప్రభుత్వం, ఒక క్రమబద్ధమైన, సంప్రదాయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, 2021 మే, 2వ తేదీ నుండి, ఒక ప్రామాణిక నిర్వహణ విధానాన్ని రూపొందించి, అమలు చేస్తోంది. వైద్య పరికరాలు, మందులు, గ్రాంట్లు, విరాళాల రూపంలో స్వీకరించిన, విదేశీ కోవిడ్ సహాయ సామాగ్రిని సమన్వయం చేయడానికీ, కేటాయించదానికీ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఒక  ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.  ఈ కేంద్రం 2021 ఏప్రిల్, 26వ తేదీ నుండి పనిచేయడం ప్రారంభించింది.

ఈ సహాయ వైద్య సామాగ్రి, పరికరాల ను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, మొదటి విడతగా, 38  ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ సంస్థలు మరియు 31 రాష్ట్రాలకు సకాలంలో కేటాయిస్తోంది.  క్రియాశీల కేసుల సంఖ్య, మరణాల రేటు, పాజిటివిటీ రేటు, అవసరం మొదలైన కొన్ని ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని, ఈ కేటాయింపు జరిగింది.  ఈ సంస్థలు మరియు 31 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలోని, వైద్య మౌలిక సదుపాయాలను భర్తీ చేయడం తో పాటు,  ఆసుపత్రిలో చేరిన కోవిడ్-19 రోగుల యొక్క సత్వర మరియు సమర్థవంతమైన వైద్య నిర్వహణ కోసం వారి చికిత్స యాజమాన్య సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, ఇది సహాయ పడుతుంది. 

సంబంధిత ఏజెన్సీ లు సకాలంలో  సమన్వయంతో పనిచేయడంతో, సరకు రవాణా, సరఫరా వేగంగా జరిగాయి.  సరకు రవాణా, సరఫరా తో పాటు, అవసరమైన చోట, పరికరాల తదుపరి సంస్థాపనలను కూడా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నిరంతరం పర్యవేక్షిస్తోంది.

*****


(Release ID: 1716554) Visitor Counter : 225