విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
వలస పోవడం, మొబిలిటి పార్ట్‌నర్‌శిప్ అనే అంశాల పై భారతదేశాని కి, యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఎండ్ నార్దన్ ఐలండ్ కు మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
05 MAY 2021 12:18PM by PIB Hyderabad
వలస పోవడం, మొబిలిటి పార్ట్‌నర్‌శిప్ అనే అంశాల పై భారతదేశ గణతంత్ర ప్రభుత్వానికి, యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఎండ్ నార్దన్ ఐలండ్ ప్రభుత్వాని కి మధ్య సంతకాలైన ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రానికి (ఎమ్ఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఉద్దేశ్యాలు:
విద్యార్థులు, పరిశోధకులు, నైపుణ్యాన్ని సంపాదించుకొన్న వృత్తి నిపుణుల రాక- పోకల ను ప్రోత్సహించేందుకు గాను వీజా ల జారీ ని సరళతరం చేయడం, నియమ విరుద్ధ ప్రవాసానికి, మానవుల ను చట్ట విరుద్ధం గా తరలించడానికి సంబంధించిన అంశాల లో ఉభయ పక్షాల మధ్య సహకారాన్ని పటిష్ట పరచుకోవడం అనేవి ఈ ఎమ్ఒయు ఉద్దేశ్యాలు గా ఉన్నాయి.
ఈ ఎమ్ఒయు భారతీయ విద్యార్థుల కు, విద్యావేత్తల కు, పరిశోధకుల కు, వృత్తిపరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి కారణాల తో వలస పోయే వారికి మేలు ను చేస్తుంది. దీనితో పాటు రెండు దేశాల లో ఆర్థికాభివృద్ధి ప్రధానమైనటువంటి వివిధ ప్రాజెక్టుల కు తోడ్పాటు ను అందించాలనుకొనే వారికి కూడా వారి కులం, వర్గం, మతం అనే అంశాలను గాని, లేదా వారు మగ వారా లేక ఆడవారా అనే భేదాన్ని ను పట్టించుకోకుండా ఈ ఎమ్ఒయు ఉపయోగకరం గా ఉంటుంది. ఈ ఎమ్ఒయు ప్రతిభావంతులు స్వతంత్రం గా రాక- పోకల ను జరుపుకొనేందుకు వీలు ను కల్పించడం ద్వారా ఇరు దేశాల లో నూతన ఆవిష్కరణల కు సంబంధించిన స్థితిగతుల ను బలపరుస్తుంది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక సంయుక్త కార్యాచరణ సమూహ పాలన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, ఈ ఎమ్ఒయు ప్రభావవంతమైన విధం గా అమలు అయ్యేటట్లు నిశితం గా పర్యవేక్షిస్తుంది.
***
(Release ID: 1716219)