రైల్వే మంత్రిత్వ శాఖ
కాలంతో పరుగులు పెడుతూ గమ్యస్థానాలు చేరిన 20 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు- 76 ట్యాంకర్లలో 1125 ఎంటీ (సుమారుగా)ల ద్రవ వైద్య ఆక్సిజన్ చేరవేత 27 ట్యాంకర్లలో 422 ఎంటీ ద్రవ వైద్య ఆక్సిజన్ తో నడుస్తున్న ఏడు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు
అంగల్ (ఒరిస్సా) , రూర్కెలా (ఒరిస్సా) నుంచి దాదాపు 72 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో హర్యానా చేరుకోనున్న 4 వ మరియు 5 వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు
85 టన్నులతో హపా (గుజరాత్) నుంచి బయలుదేరిన మరో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ - ఎన్‌సిఆర్ ప్రాంత అవసరాల కోసం గుర్గావ్ కు సరఫరా
హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, న్యూఢిల్లీ దిశగా నడుస్తున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు
Posted On:
03 MAY 2021 1:27PM by PIB Hyderabad
అన్ని అడ్డంకులు, సమస్యలను అధిగమిస్తూ వివిధ రాష్ట్రాలకు అవసరమైన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ను సరఫరా చేయడానికి రైల్వేశాఖ నడుపుతున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి. ఇప్పటివరకు, భారత రైల్వే 76 ట్యాంకర్లలో 1125 మెట్రిక్ టన్నుల (సుమారు) లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను దేశంలోని వివిధ రాష్ట్రాలకు రవాణా చేసింది. 20 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటికే తమ ప్రయాణాన్ని పూర్తి చేశాయి. మరో ఏడు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు 27 ట్యాంకర్లలో 422 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తోని గమ్యస్థానాలకు చేర్చడానికి నడుస్తున్నాయి. అతి తక్కువ సమయంలో వేగంగా రాష్ట్రాల నుంచి అందుతున్న అభ్యర్థనల మేరకు సాధ్యమైనంత ఎల్‌ఎంఓను అందించడానికి భారత రైల్వే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతోంది. .
దుర్గాపూర్ నుంచి బయలుదేరిన మూడవ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ 120 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో 2021 మే 04 నన్యూ ఢిల్లీకి చేరుకుంటుంది.
అంగల్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి రెండవ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ 60.23 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో బయలుదేరింది.
అంగూల్ (ఒరిస్సా), రూర్కెలా (ఒరిస్సా) నుంచి హర్యానా కు తన 4 వ, 5 వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు దాదాపు 72 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను తీసుకొనిరానున్నాయి. ఎన్‌సిఆర్ ప్రాంత అవసరాల కోసం గుర్గావ్ కు చేరవేయడానికి 85 టన్నులతో మరో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ హపా (గుజరాత్) నుంచి బయలుదేరింది.
422.08 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో మధ్యప్రదేశ్ (4 వ), ఉత్తర ప్రదేశ్ (10 వ), తెలంగాణ, హర్యానా, న్యూఢిల్లీ లకు మరో ఏడు మరిన్ని ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు వెళ్తున్నాయి.
ఇప్పటివరకు 1125 మెట్రిక్ టన్నులకు పైగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ను మహారాష్ట్ర (174 మెట్రిక్ టన్నులు), ఉత్తర ప్రదేశ్ (430.51 మెట్రిక్ టన్నులు), మధ్యప్రదేశ్ (156.96 మెట్రిక్ టన్నులు), న్యూఢిల్లీ (190 మెట్రిక్ టన్నులు), హర్యానా (109.71 మెట్రిక్ టన్నులు), తెలంగాణ (63.6 మెట్రిక్ టన్నులు) భారతీయ రైల్వేలు రవాణా చేశాయి.
***
(Release ID: 1715679)
Visitor Counter : 209