శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కొవిడ్-19 చార్టింగ్ కోసం ఎస్‌యుటిఆర్‌ఎ మోడల్‌పై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు

Posted On: 02 MAY 2021 12:05PM by PIB Hyderabad

కొవిడ్-19 యొక్క పథాన్ని రూపొందించడానికి ఎస్‌యుటిఆర్‌ఎ మోడల్‌పై పనిచేస్తున్న శాస్త్రవేత్తలం.. మన గణిత నమూనా యొక్క అంచనాలకు సంబంధించిన కొన్ని వాస్తవాలను స్పష్టంగా ఎత్తి చూపించాలనుకుంటున్నాము. ప్రత్యేకించి వీటిలో కొన్ని తప్పుగా అర్ధం చేసుకోబడ్డాయి మరియు తప్పుగా పేర్కొనబడ్డాయి. ఎస్‌యుటిఆర్‌ఎ మోడల్‌పై పనిచేసే శాస్త్రవేత్తలు మార్చిలో రెండవ వేవ్ గురించి హెచ్చరించినప్పటికీ వాటిని పట్టించుకోలేదని ఇటీవల కొన్ని మాధ్యమాలు పేర్కొన్నాయి. కానీ అది తప్పు.

జాతీయ విపత్తుపై ప్రతిస్పందనను సమన్వయం చేసే ప్రభుత్వంలోని సీనియర్ అధికారులలో ఒకరు మా ఇన్‌పుట్లను తెలుసుకోవడానికి  ఏప్రిల్ 2 న ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ మూడవ వారంలో సెకండ్‌ వేవ్‌ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని మరియు రోజువారీ 1 లక్షల కేసుల వరకు ఉంటుందని  ఎస్‌యుటిఆర్‌ఎ మోడల్‌పై మేము సూచించాము. దిగువ కారణాల వల్ల ఈ సందర్భంలో మోడల్ అంచనాలు తప్పుగా ఉన్నాయి.

వైరస్ వ్యాప్తిని అంచనా వేయడానికి మేము గణిత నమూనాపై పని చేస్తున్నాము. వైరస్ డైనమిక్స్ మరియు దాని ట్రాన్స్మిసిబిలిటీ కాలక్రమేణా గణనీయంగా మారనంతవరకు గణిత నమూనా భవిష్యత్తును కొంత నిశ్చయతతో మాత్రమే ఊహించగలదని గమనించడం ముఖ్యం. వివిధ విధాన నిర్ణయాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ దృశ్యాలను అంచనా వేయడానికి గణిత నమూనాలు కూడా ఒక యంత్రాంగాన్ని అందించగలవు.

కొవిడ్-19 విషయంలో  వైరస్ యొక్క స్వభావం చాలా వేగంగా మారుతున్నట్లు స్పష్టమైంది. అటువంటి సందర్భంలో కొవిడ్-19 కోసం ఏదైనా అంచనా నిరంతరం సరిదిద్దబడాలి, కొన్నిసార్లు దాదాపు ప్రతిరోజూ అది జరగాలి.

మేము ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాము. మా సూచనలను, నివేదికలను ప్రభుత్వం ఎల్లప్పుడూ సానుకూలంగా స్వీకరించింది. సెకండ్‌ వేవ్‌ యొక్క ఖచ్చితమైన స్వభావాన్ని మేము ముందే ఊహించలేనప్పటికీ, దాని భవిష్యత్ పథాన్ని బాగా అంచనా వేయడానికి మేము మా ప్రయత్నాలను కొనసాగిస్తాము.


మనీంద్ర అగర్వాల్, ప్రొఫెసర్, ఐఐటి కాన్పూర్
మాధురి కనిత్కర్, డిప్యూటీ చీఫ్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్
ఎం. విద్యాసాగర్, ప్రొఫెసర్, ఐఐటి హైదరాబాద్

***



(Release ID: 1715584) Visitor Counter : 222