రైల్వే మంత్రిత్వ శాఖ
రెండో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా 120 మె.ట. ద్రవరూప వైద్య ఆక్సిజన్ అందుకున్న దిల్లీ
మొదటి నుంచి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1094 మె.ట. ఆక్సిజన్ పంపిణీ చేసిన రైల్వే శాఖ
మొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా 63.6 మె.ట. ద్రవరూప ఆక్సిజన్ అందుకున్న తెలంగాణ
Posted On:
02 MAY 2021 5:20PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రాణవాయువును అందించే యజ్ఞాన్ని కొనసాగిస్తున్న రైల్వే శాఖ, ఇప్పటివరకు 74 ట్యాంకర్ల ద్వారా 1094 మె.ట. ద్రవరూప వైద్య ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ)ను వివిధ రాష్ట్రాలకు అందించింది. 19 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటికే గమ్యస్థానాలకు చేరగా, మరో రెండు రైళ్లు నాలుగు ట్యాంకర్లలో 61.46 మె.ట. ఎల్‌ఎంఓతో మార్గమధ్యంలో ఉన్నాయి.
విజ్ఞప్తులు పంపిన రాష్ట్రాలకు వీలైనంత తక్కువ సమయంలో సాధ్యమైనంత ఎక్కువ ఆక్సిజన్ తీసుకెళ్లడానికి రైల్వే శాఖ కృషి చేస్తోంది.
రెండో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ తీసుకొచ్చిన 120 మె.ట. ద్రవరూప ఆక్సిజన్‌ను దిల్లీ ఆదివారం అందుకోగా, మూడో రైలు అంగుల్ నుంచి 30.86 మె.ట.తో దిల్లీ బయల్దేరింది.
మొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా తెలంగాణకు 63.6 మె.ట. ఎల్‌ఎంఓ అందింది. ఈ రైలు అంగుల్ నుంచి వచ్చింది.
మరింత ఆక్సిజన్ తీసుకుని హరియాణా, దిల్లీ బయల్దేరిన రైళ్లు మార్గమధ్యంలో ఉన్నాయి.
ఇప్పటివరకు, మహారాష్ట్రకు 174 మె.ట., యూపీకి 430.51 మె.ట., మధ్యప్రదేశ్‌కు 156.96 మె.ట., దిల్లీకి 190 మె.ట., తెలంగాణకు 63.6 మె.ట. కలిపి మొత్తం 1094 మె.ట. ద్రవరూప వైద్య ఆక్సిజన్‌ను రైల్వే శాఖ సరఫరా చేసింది.
***
(Release ID: 1715573)
Visitor Counter : 241