ప్రధాన మంత్రి కార్యాలయం

నైట్రోజన్ ప్లాంటుల‌ ను ఆక్సీజన్ ప్లాంటులు గా మార్చే పని లో ప్ర‌గ‌తి పై సమీక్ష ను నిర్వహించిన ప్రధాన మంత్రి

Posted On: 02 MAY 2021 3:25PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి ప్రాబల్యం నడుమ వైద్య చికిత్స కు ఉపయోగించే ఆక్సీజన్ అవసరాన్ని దృష్టి లో పెట్టుకొని భారత ప్రభుత్వం ఆక్సీజన్‌ ఉత్పత్తి కోసం ప్రస్తుత నైట్రోజన్ ప్లాంటుల‌ ను ఆక్సీజన్ ప్లాంటులు గా మార్చడం తాలూకు సాధ్యాసాధ్యాల ను గురించి తెలుసుకొంది.  వివిధ పరిశ్రమల లో ఆక్సీజన్ ఉత్పత్తి చేసేటట్టు గా మార్పిడి చేయగలిగినటువంటి నైట్రోజన్ ప్లాంటుల‌ ను గుర్తించడమైంది.

ప్రస్తుతం ప్రెశర్ స్వింగ్ ఎడ్ సార్ప్ శన్ (పిఎస్ఎ) నైట్రోజన్ ప్లాంటులుగా ఉన్న వాటిని ఆక్సీజన్ ఉత్పత్తి చేసే ప్లాంటులు గా మార్చే ప్రక్రియ పై చర్చించడం జరిగింది.  నైట్రోజన్ ప్లాంటుల లో కార్బన్ మాలిక్యులర్ సీవ్ (సిఎమ్ఎస్) ను ఉపయోగించడం జరుగుతుంది, ఆక్సీజన్ ను ఉత్పత్తి చేయాలి అంటే జియోలైట్ మాలిక్యులర్ సీవ్ (జడ్ఎమ్ఎస్) ను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ కారణంగా, సిఎమ్ఎస్ స్థానం లో జడ్ఎమ్ఎస్ ను మార్చడం తో పాటు, మరికొన్ని మార్పులు.. ఉదాహరణ కు ఆక్సీజన్ ఎనలైజర్, కంట్రోల్ పానెల్ సిస్టమ్, ఫ్లో వాల్వ్స్ వంటివి.. కూడా చేపట్టడం ద్వారా ప్రస్తుత నైట్రోజన్  ప్లాంటుల లో ఆక్సీజన్ ఉత్పత్తి అయ్యే విధం గా మార్పిడి చేయడానికి వీలు ఉంటుంది.

పరిశ్రమల తో సంప్రదింపులు జరిపిన తరువాత ఇప్పటి వరకు 14 పరిశ్రమల ను గుర్తించడమైంది; వాటి లో నైట్రోజన్  ప్లాంటు ల రూపురేఖల ను మార్చే పని చక చక సాగుతున్నది.  దీనికి అదనం గా, పారిశ్రామిక సంఘాల సహాయం తో 37 నైట్రోజన్ ప్లాంటుల ను కూడా ఈ కార్యానికై గుర్తించడం జరిగింది.

ఆక్సీజన్ ఉత్పత్తి కోసం మార్పిడి చేసినటువంటి నైట్రోజన్ ప్లాంటుల ను సమీపం లోని ఆసుపత్రుల కు తరలించడమో, లేదా ప్లాంటు ను మార్చడం సాధ్యపడని పక్షం లో దానిని అక్కడికక్కడే ఆక్సీజన్ ఉత్పత్తి కోసం వాడుకోవడమో చేయవచ్చును.  ఇలా చేయడం ద్వారా ఉత్పత్తి చేసే ప్రాణవాయువు ను ప్రత్యేక ఉపకరణాల ద్వారా గాని, లేదా సిలిండర్ ల ద్వారా గాని ఆసుపత్రి లోపలకు చేరవేయవచ్చును.

సమావేశం లో ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి, కేబినెట్ సెక్రట్రి, హోం సెక్రట్రి, రోడ్ ట్రాన్స్ పోర్ట్ & హైవేస్ సెక్రట్రి లతో పాటు ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

 


 

***


(Release ID: 1715563) Visitor Counter : 260