భారత ఎన్నికల సంఘం
పోలింగ్ జరిగిన రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలలో ఓట్ల లెక్కింపునకు కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ పకడ్బందీ ఏర్పాట్లు .
Posted On:
01 MAY 2021 5:53PM by PIB Hyderabad
ఇటీవల పోలింగ్ జరిగిన రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లపై ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ సుశీల్ చంద్ర ఈరోజు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సిఇఒలు, కమిషన్ సీనియర్ అధికారులతో వర్చువల్ పద్ధతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను తప్పకుండా పాటించాలని అన్నారు. అన్ని కౌంటింగ్ హాళ్లూ పూర్తిగా కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో సిఇఒలు ఎన్నికలు సజావుగా నిర్వహించడం పట్ల ఆయన వారిని అభినందించారు.
2-05-2021 న ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతం, అంటే అస్సాం,కేరళ,పుదుచ్చేరి,తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లలో అలాగే ఉప ఎన్నికలు జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాలు, శాసనసభ నియోజక వర్గాలలో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమౌతుంది.ఓట్ల లెక్కింపు సజావుగా,సురక్షితంగా నిర్వహించేందుకు ఐదు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతంలోని 822 శాసనసభ నియోజకవర్గాలలో, 13 రాష్ట్రాలలో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు పార్లమెంటరీ స్థానాలు, 13 శాసనసభ స్థానాలలో విస్తృత ఏర్పాట్లు చేసింది.
3. ఇంతకుముందు ఏప్రిల్ 28 ,2021న కరోనా పరిస్థితుల నేపథ్యంలో కమిషన్ సవివరమైన ఆదేశాలు జారీచేసింది. దీనికితోడు ప్రస్తుతం ఓట్లలెక్కింపునకు సంబంధించి ఆదేశాలు జారీచేసింది. అవి, ప్రతి కౌంటింగ్ కేంద్రంలో డిఇఒ నోడల్ అధికారిగా ఉంటారు. కౌంటింగ్ కేంద్రాలలో కోవిడ్ సంబంధిత నిబంధనలను నోడల్ హెల్త్ ఆఫీసర్ సహాయంతో పాటించేట్టు చూడాల్సి ఉంటుంది. కౌంటింగ్ కేంద్రం కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశారని నిర్ధారిస్తూ వాటినిపాటించినట్టుగా సంబంధిత ఆరోగ్యఅధికారులనుంచి సర్టిఫికేట్ పొందాలి.
ఆర్‌టి-పిసిఆర్ లేదాఆర్ ఎ టి పరీక్ష లేదా రెండు డోసుల కోవిడ్ వాక్సిన్ తీసుకోని వారిని అభ్యర్థిని కానీ ఏజెంటునుకానీ కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించరు. వీరు నెగటివ్ ఆర్‌టిపిసిఆర్ రిపోర్టు లేదా ఆర్.ఎ.టి టెస్ట్ రిపోర్టు లేదా వాక్సినేషన్ రిపోర్టును కౌంటింగ్‌ప్రారంభానికి 48 గంటల ముందు అందజేయాలి. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు ఆర్‌టి-పిసిఆర్ , ఆర్.ఎ.టి పరీక్ష నిర్వహించేందుకు కౌంటింగ్‌కు ఒక రోజుముందు డిఇఒ ఏర్పాట్లు చేయాలి. కౌంటింగ్ ఏజెంట్ల జాబితా సంబంధిత ఆర్ఒ కు కౌంటింగ్ కు నిర్ణయించిన తేదీకి మూడు రోజుల ముందు సాయంత్రం 5గంటల లోగా అందుబాటులో ఉండేట్టు ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు చూడాలి.( పేరా 15.12.2 ఆర్.ఒ. హ్యాండ్ బుక్)
4. ఎన్నికల కమిషన్ ఇప్పటికే విజయోత్సవ ర్యాలీలను 27-04-2021 నాటి ఉత్తర్వుల ద్వారా నిషేధించింది. విజయోత్సవర్యాలీలలో ఏ రకమైన ప్రదర్శనలూ నిర్వహించరాదని తెలిపారు.అంటే విజయం సాధించిన అభ్యర్థి తరఫు మద్దతు దారులు నియోజక వర్గంలోఎక్కడైనా గుమికూడడం, సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్దేశించని సంఖ్యకంటే ఎక్కువమంది నియోజకవర్గంలో , నియోజకవర్గాలలో ఎక్కడైనా గుమికూడడం నిషేధం. ఎన్నికలకమిషన్ జారీ చేసిన ఆదేశాలు ఈ అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతంలో తప్పకుండా అమయ్యేట్టు చూడాల్సిందిగా ఆయా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. జనం గుమి కూడడానికి సంబంధించి ఎన్‌డిఎంఎ, ఎస్‌డిఎంఎ ఆదేశాలను కూడా కౌంటింగ్ సందర్భంగా పాటించాలి.
4 కౌంటింగ్ ఏజెంట్లకు ఆర్‌టిపిసిఆర్,ఆర్ ఎ టి పరీక్షలు అమలు చేయాలి.ఛీప్ ఎలక్టొరల్ అధికారులనుంచి అందిన సమాచారం ప్రకారం పోటీచేస్తున్న అభ్యర్థులు సుమారు 1,50,000 మంది (ప్రత్యామ్నాయపేర్లతోసహా) కౌంటింగ్ ఏజెంట్లపేర్లను 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి నిర్ణీత గడువులోగా సమర్పించారు.
5. వీరిలో 90 శాతం మందికి ఆర్‌టిపిసిఆర్, ఆర్ ఎటి పరీక్షలు పూర్తి అయ్యాయి. మిగిలిన వారి పరీక్ష కు సంబంధించి డిఇఒలు ఈరోజు తగిన సదుపాయాలు కల్పిస్తారు.ఏదైనా అధీకృత ల్యాబ్ నుంచి తెచ్చిన రిపోర్టునుకూడా ఆమోదించాల్సిందిగా కమిషన్ ఆదేశించింది.ఇదే నియమాలను పార్లమెంటరీ నియోజకవర్గ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలకు కూడా వర్తిస్తాయి.
6. ఓట్ల లెక్కింపు వార్తల సేకరణకు కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన మీడియాకు చెందిన వారికి కూడ ఆర్‌టిపిసిఆర్, ఆర్ ఎటి పరీక్షలు నిర్వహిస్తారు. సుమారు 12000 మంది మీడియా ప్రతినిధులకు ఆయా కౌంటింగ్ కేంద్రాలనుంచి వార్తల సేకరణకు అధికారిక లేఖలు అందజేయడం జరిగింది.
7. 2016 ఎన్నికల సమయంలో 1002 హాళ్లలో కౌంటింగ్ జరగగా ఇప్పుడు 2364 కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.కౌంటింగ్ హాళ్ల సంఖ్యను 200 శాతం పైగా పెంచారు. కోవిడ్ నుంచి రక్షణకు సంబంధించిన చర్యలలో భాగంగా విడుదలైన మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ హాళ్లను పెంచారు. కోవిడ్ నుంచి రక్షణ చర్యలు తీసుకోవడానికి పోలింగ్ బూత్‌ల సంఖ్యను పెంచారు. 2 అలాగే పోస్టల్ బ్యాలెట్‌ల సంఖ్యా పెరిగింది.
8. సీనియర్ సిటిజన్లకు ( 80 సంవత్సరాలు పైబడిన వారికి), దివ్యాంగులకు, కోవిడ్ బారిన పడిన వారికి, అత్యవసర సేవలలో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడంతో 2016తో పోల్చినపుడు గతంలో 2.97 లక్షల పోస్టల్ బ్యాలెట్‌లు ఉండగా ఈసారి అవి ఈ 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో 13.16 లక్షలకు పెరిగాయి.
9. కమిషన్ 822 మంది ఆర్.ఒలను 7000 మందికి పైగా ఎఆర్ఒలను 5 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతంలో ఓట్ల లెక్కింపునకు నిర్దేశించింది. సూక్ష్మ పరిశీలకులతో సహా సుమారు 95000 మంది కౌంటింగ్ అధికారులు ఓట్ల లెక్కింపును చేపడతారు.
10.కమిషన్ సుమారు 1100 మంది పరిశీలకులను కౌంటింగ్ ప్రక్రియను గమనించేందుకు నియమించింది.. కోవిడ్ మహమ్మారి కారణంగా ఎవరైనా కౌంటింగ్ ప్రక్రియకు హాజరుకాలేక పోతే వారి బదులు నియమించేందుకు అదనపు రిజర్వు కౌంటింగ్ అబ్జర్వర్లను ఏర్పాటు చేసింది.
******
(Release ID: 1715497)
Visitor Counter : 208